వికీపీడియా:ఏది వికీపీడియా కాదు: కూర్పుల మధ్య తేడాలు

చి
యంత్రము మార్పులు చేస్తున్నది: bat-smg:Pagelba:Kas nier Vikipedėjė; cosmetic changes
చి (యంత్రము కలుపుతున్నది: mg:Wikipedia:Ny tsy tokony ho wikipedia)
చి (యంత్రము మార్పులు చేస్తున్నది: bat-smg:Pagelba:Kas nier Vikipedėjė; cosmetic changes)
{{అడ్డదారి|[[WP:NOT]]<br />[[WP:ISNOT]]}}
వికీపీడియా ఓ ఆన్‌లైను విజ్ఞాన సర్వస్వము, దానికోసం ఏర్పడిన ఓ ఆన్‌లైను సముదాయం. వికీపీడియాలో ఏమేం ఉండాలి అనేందుకు కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. అంచేత, వికీపీడియా కానివి కూడా కొన్ని ఉన్నాయి. వాటిని గురించిన వివరాలు.
{{Policylist}}
== ఏది వికీపీడీయా కాదు ==
 
=== వికీపీడీయా పుస్తక విజ్ఞానసర్వస్వం కాదు ===
వికీపీడీయా పుస్తక విజ్ఞానసర్వస్వం కాదు. ఇక్కడ వ్యాసాల సంఖ్యకు పరిమితి లేదు.
 
డయలప్ ఇంటర్నెట్ కనెక్షన్ను దృష్టిలో నుంచుకుని, వ్యాసపు సైజుకు కొన్ని పరిమితులున్నాయి. అలాగే అందరికీ వర్తించేలా చదవడానికి వీలయ్యే కొన్ని పరిమితులున్నాయి. వ్యాసం ఓ స్థాయికి పెరిగాక, దాన్ని వేరువేరు వ్యాసాలుగా విడగొట్టి, ప్రధాన వ్యాసంలో సారాంశాలను ఉంచడం వ్యాసం అభివృద్ధిలో ఓ భాగం. విజ్ఞాన సర్వస్వం పుస్తకాల్లో చిన్నవిగా ఉండే వ్యాసాలు ఇక్కడ విస్తారంగా, మరిన్ని విశేషాలతో కూడుకుని ఉండొచ్చు.
ఓ వ్యాస విషయానికి దగ్గరగా ఉన్న మరో విషయపు వ్యాసానికి దారిమార్పు చెయ్యాల్సిన అవసరం లేదు. దీని కోసం ప్రత్యేకంగా వ్యాసం రాసి, "ఇవి కూడా చూడండి" విభాగంలో రెండో వ్యాసపు లింకు ఇవ్వవచ్చు.
 
=== వికీపీడీయా నిఘంటువు కాదు ===
వికీపీడీయా నిఘంటువు కాదు. పారిభాషిక పదకోశమూ కాదు. దీనికోసం వికీ సోదర ప్రాజెక్టు [http://te.wiktionary.org|విక్షనరీ] ఉంది. మీకు ఆసక్తి ఉంటే విక్షనరీలో చేయూత నివ్వండి.సహాయం చేయండి. విక్షనరీ కోసం ఇక్కడ చూడండి [[http://te.wiktionary.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80]మొదటి పేజీ]
: వికీపీడియా వ్యాసాలు:
# '''నిర్వచనాలు చెప్పే నిఘంటువు కాదు'''. వికీపీడియా నిఘంటువు కాదు కాబట్టి, కేవలం పదానికి నిర్వచనం రాసేందుకు గాను పేజీ సృష్టించకండి. కొన్ని విషయాలకు సంబంధించి వ్యాసం నిర్వచనంతోటే మొదలు కావాల్సి రావడం తప్పనిసరి కావచ్చు. నిర్వచనం తప్ప మరేమీ లేని వ్యాసం మీ దృష్టికి వచ్చినపుడు ఆ పేజీలో ఇంకేమైనా రాయగలరేమో చూడండి. సంఖ్యలకు ఇచ్చే సాంస్కృతిక అర్థాలు దీనికి మినహాయింపు.
# '''వినియోగ మార్గదర్శిని''' గానీ, '''వాడుకపదాలు, జాతీయాల మార్గదర్శిని''' గానీ కాదు. వికీపీడియా పదాలను, జాతీయాలను ఎలా వాడాలో చెప్పే మార్గదర్శిని కాదు. ఎలా మాట్లాడాలో ప్రజలకు శిక్షణనిచ్చే స్థలం కాదు.
 
=== వికీపీడీయా ఒక వ్యక్తిగత ఆలోచన లేదా అభిప్రాయం కాదు ===
వికీపీడియా మీ ఆలోచనలు, అభిప్రాయాలు, విశ్లేషణలు ప్రచురించే స్థలం కాదు. వికీపీడియాలో..
 
# '''జర్నలిజము''': వికీపీడియా ఎప్పటికప్పుడు వేడివేడిగా వార్తలందించే వార్తా వెబ్సైటు కాదు.
 
=== వికీపీడీయా ప్రచార వాహనం కాదు ===
వికీపీడియా ప్రచార వాహనం కాదు. కాబట్టి వికీపీడియా..
# '''ప్రచార వేదిక కాదు''': వికీపీడియా ఎదైనా విషయాన్ని ప్రచారం చేసే వేదిక కాదు.
# '''సొంత డబ్బా కాదు''': మీ గురించి, మీరేం చేసారు, చేస్తున్నారు, ఏయే ప్రాజెక్టుల్లో పని చేస్తున్నారు మొదలైనవి రాసుకునే వీలు వికీపీడియాలో ఉన్నప్పటికీ, అన్ని పేజీలకు లాగానే ఆ పేజీలు కూడా విజ్ఞాన సర్వస్వం ప్రమాణాలు పాటించాలని గుర్తుంచుకోండి. మరీ అతిగా లింకులు ఇచ్చుకోవడం వంటివి చెయ్యరాదు.
# '''వ్యాపార ప్రకటనా స్థలం కాదు''': సంస్థలు, ఉత్పత్తుల గురించి వ్యాసాలు రాయవచ్చు. అయితే అవి నిష్పాక్షికంగా, విషయ ప్రధానంగా ఉండాలి. వ్యాసంలోని విషయాలన్నీ నిర్ధారణ చేసుకునేందుకు వీలుగా ఉండాలి. అంచేతనే, చిన్న చితకా సంస్థల గురించి రాసిన వ్యాసాలు ఆమోదయోగ్యం కాకపోవచ్చు. వ్యాస విషయానికి సంబంధించినవైతే సంస్థల వెబ్ సైట్లకు బయటి లింకులు కూడా ఇవ్వవచ్చు. వికీపీడియా ఏ వ్యాపార సంస్థకు గానీ, వ్యాపారానికి గానీ ప్రచారం చెయ్యదు.
 
=== వికీపీడియా ఇతర సైట్లకు మిర్రరు గానీ, లింకులు, బొమ్మలు, మీడియా ఫైళ్ళ ఖజానా గానీ కాదు ===
వికీపీడియా ఇతర సైట్లకు మిర్రరు గానీ, లింకులు, బొమ్మలు, మీడియా ఫైళ్ళ ఖజానా గానీ కాదు. ఇక్కడ తయారయ్యే ప్రతీ వ్యాసంలోను నిర్దాక్షిణ్యంగా మార్పుచేర్పులు చేసి తుది రూపుకు తీసుకురావాలి. ఇక్కడ మీరు ఏది రాసినా, దాన్ని [[GNU FDL]] కు అనుగుణంగా విడుదల చేస్తున్నట్లే. వికీపీడియా వ్యాసాలు..
# '''బయటి లింకుల సంగ్రహమో''' లేక '''ఇంటర్నెట్ డైరెక్టరీల సంగ్రహమో కాదు''': వ్యాస విషయానికి సంబంధించిన లింకులను చేర్చడంలో తప్పేమీ లేదు. అయితే మరీ వ్యాసాన్ని మింగేసే స్థాయిలో ఎక్కువ లింకులు చేర్చకూడదు.
# '''ఏ వ్యాసానికీ సంబంధం లేని ఫోటోలు, బొమ్మలు, ఇతర మీడియా ఫైళ్ళ సంగ్రహం కాదు''': అలంటి వాటిని వికీమీడియా కామన్స్ లో పెట్టండి.
 
=== వికీపీడియా ఉచితంగా స్పేసు ఇచ్చే వెబ్ హోస్టు కాదు ===
వికీపీడియాలో మీ సొంత వెబ్ సైటు, బ్లాగు, వికీ మొదలైనవి పెట్టరాదు. వికీ టెక్నాలజీ వాడి ఏదైనా చెయ్యాలని మీకు ఆసక్తి ఉంటే దానికి [[:en:List_of_wiki_farms|చాలా సైట్లున్నాయి]] (ఉచితంగా గానీ, డబ్బులకు గానీ). అలాగే మీరే స్వంత సర్వరులో [http://wikipedia.sourceforge.net/ వికీ సాఫ్టువేరును స్థాపించుకోవచ్చు]. వికీపీడియా..
# '''మీ వ్యక్తిగత పేజీలు కాదు''': [[వికీపీడియా:వికీపీడియనులు|వికీపీడియనులకు]] తమ స్వంత పేజీలున్నాయి. కానీ వాటిని తమ వికీపీడియా పనికి సంబంధించిన వాటికి మాత్రమే వాడాలి. వికీయేతర పనుల కోసం పేజీలు అవసరమైతే ఇంటర్నెట్లో దొరికే అనేక ఉచిత సేవలను వాడుకోండి.
# '''ఫైళ్ళు దాచిపెట్టుకునే స్థలం కాదు''': వ్యాసాలకు అవసరమైన ఫైళ్ళను మాత్రమే అప్ లోడు చెయ్యండి; అలా కానివి ఏవైనా సరే తొలగిస్తాం. మీదగ్గర అదనంగా బొమ్మలుంటే వాటిని కామన్స్ లోకి అప్ లోడు చెయ్యండి, అవసరమైనప్పుడు వాడుకోవచ్చు.
 
=== వికీపీడియా విచక్షణా రహితమైన సమాచార సంగ్రహం కాదు ===
వికీపీడియా విచక్షణా రహితమైన సమాచార సంగ్రహం కాదు. నూటికి నూరుపాళ్ళూ నిజమైన ప్రతి విషయమూ వికీపీడియాలో చేర్చదగినదేం కాదు. వికీపీడియా వ్యాసాలు..
# '''తరచూ అడిగే ప్రశ్నల జాబితాలు కాదు'''. వ్యాసాల్లో తరచూ అడిగే ప్రశ్నల జాబితాలు చేర్చరాదు. దాని బదులు, అదే సమాచారాన్ని ఓ పద్ధతిలో వ్యాసంగా అమర్చండి.
# '''అనేక చిన్న చిన్న విషయాలను గుదిగుచ్చి చూపించే సంగ్రహం కాదు''': సూక్తులు, గొప్పవారి ఉటంకింపులు, ఉల్లేఖనలు మొదలైన వాటి ఏరి కూర్చి పెట్టే సంగ్రహం కాదు.
# '''ప్రయాణ మార్గదర్శిని కాదు''': [[విశాఖపట్టణం]] వ్యాసంలో [[దాల్ఫిన్స్ నోస్]] గురించి, [[రామకృష్ణా బీచ్]] గురించి ఉండొచ్చు. అంతేగానీ, అక్కడ ఏ హోటల్లో గది అద్దెలు తక్కువగా ఉంటాయి, భోజనం ఎక్కడ బాగుంటుంది, ఫలానా చోటికి వెళ్ళాలంటే ఏ నంబరు బస్సెక్కాలి ఇలాంటివి ఉండకూడదు.
# '''జ్ఞాపికలు రాసుకునే స్థలం కాదు''': సన్నిహితుల మరణం దుస్సహమే. అంతమాత్రాన వాళ్ళ జ్ఞాపకాలను, సంతాప తీర్మానాలను రాసుకోడానికి వికీపీడీయాను వాడుకోరాదు. వారి గురించి వ్యాసం రాయాలంటే, దానికి తగ్గ ప్రఖ్యాతి కలిగి ఉండాలి.
# '''వ్యాపార విశేషాలు తెలియజేసే డైరెక్టరీ కాదు''': ఏదైనా టెలివిజను చానలు గురించిన వ్యాసం ఉందనుకోండి. ఆ చానల్లో ఏ సమయానికి ఏ కార్యక్రమం వస్తుందో జాబితా తయారు చేసి పెట్టరాదన్న మాట. ముఖ్యమైన కార్యక్రమాల గురించి రాయవచ్చు కానీ మొత్తం కార్యక్రమాల జాబితా ఇవ్వరాదు.
 
=== వికీపీడియా భవిష్యత్తు చూసే మాయాదర్పణం కాదు ===
'''భావి ఘటనలు''' విజ్ఞాన సర్వస్వంలో భాగం కావు. జరిగేదాకా అసలవి జరుగుతాయో లేదో చెప్పలేని ఘటనలైతే మరీను.
# '''ఘటనా క్రమాన్ని ముందే నిర్ణయించినంత మాత్రాన''' ఆ ఘటనలు వ్యాసాలుగా పనికిరావు: ఉదాహరణకు 2028 ఒలింపిక్స్ గురించి ఇప్పటి నుండే వ్యాసం రాయడం సమంజసంగా ఉండదు. వచ్చే సంవత్సరం కూడా సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు అన్నంత ఖచ్చితంగా జరిగే ఘటనల గురించి రాయవచ్చేమోగానీ, ఇలాంటి విషయాల మీద వ్యాసాలు కూడదు.
# అలాగే భవిష్యత్తులో ఫలానా ఘటన జరిగితే ఈ పేరు పెడదాం అని ముందే పేర్లు నిర్ణయించుకుని పెట్టే విషయాలు కొన్ని ఉన్నాయి. అలాంటి విషయాలకు వ్యాసాలు రాయరాదు. ఉదాహరణకు తుపానులకు పేర్లు పెట్టే పద్ధతి. 2010లో వచ్చే తుపానులకు ఫలానా పేర్లు పెడదాం అని ముందే పేర్ల జాబితా తయారు చేసి పెట్టుకుంటారు. ఎలాగూ పేర్లు పెట్టేసారు కదా అని వ్యాసాలు రాసెయ్యకూడదు.
# '''భవిష్యత్తు గురించిన లెక్కలు, ఊహలు, "భవిష్యత్తు చరిత్రల"''' గురించి చెప్పే రచనలు వికీపీడియాలో కూడవు. ఇవి మౌలిక పరిశోధన కిందకి వస్తాయి. అయితే అలాంటి తార్కిక, సంబద్ధ వ్యాసాల ''గురించి'' వికీపీడియాలో రాయవచ్చు. స్టార్ వార్స్ గురించి వ్యాసం రాయవచ్చు కానీ "నాలుగో ప్రపంచ యుద్ధంలో వాడబోయే ఆయుధాలు" అనే వ్యాసానికిక్కడ చోటులేదు.
 
=== పిల్లల కోసం వికీపీడియాను సెన్సారు చెయ్యం ===
వికీపీడియాలో ఉండే కొన్ని వ్యాసాలు కొందరు పాఠకులకు అభ్యంతరకరంగా ఉండవచ్చు. ఇక్కడి వ్యాసాలను ఎవరైనా సరిదిద్దవచ్చు. ఆ దిద్దుబాట్లు వెంటనే వ్యాసంలో కనిపిస్తాయి. అంచేత ఆయా వ్యాసాల్లో కనిపించే విషయాలు పిల్లలు చదివేందుకు అనుగుణంగా ఉంటాయని చెప్పలేం. అనుచితమైన విషయాలు దృష్టికి వెనువెంటనే తీసెయ్యడం జరుగుతుంది. అయితే శృంగారం, బూతు మొదలైనవి విజ్ఞాన సర్వస్వంలో భాగమే కాబట్టి, అలాంటి విషయాలపై వ్యాసాలు ఉండే అవకాశం లేకపోలేదు.
 
== ఏది వికీపీడియా సముదాయం కాదు ==
=== వికిపీడీయా యుద్ధభూమి కాదు ===
ప్రతీ సభ్యుడు తన సహసభ్యులతో సంయమనంతో వ్యవహరించాలి. [[వికీపీడియా:మర్యాద|మర్యాదగా]], [[వికీపీడియా:Staying cool when the editing gets hot|సంయమనం]]తో, సభ్యతతో వ్యవహరించాలి, సహకరించుకోవాలి. మిగతా సభ్యులతో ఏకీభవించని పక్షంలో సహసభ్యులపై [[వికీపీడియా:వ్యక్తిగత దాడులు కూడదు|వ్యక్తిగత దాడులు చెయ్యరాదు]], దూషించరాదు, పరుషవ్యాఖ్యలు, వ్యక్తిగత నింద చేయరాదు లేదా రాయరాదు. ఏకీభవించని విషయాన్ని చాకచక్యంతో, ఋజువులతో నిరూపించాలి, చర్చించాలి. చర్చించిన విషయం మీద ఒక నిర్ణయానికి రావాలి. కేవలం మీ వాదనను నిరూపించేందుకు వ్యాసాలను సృష్టించడం, ఉన్న వ్యాసాలను మార్చడం వంటివి చెయ్యరాదు. వికీపీడియాపైనా, వికీపీడియనులపైనా, వికీమీడియా ఫౌండేషను పైనా చట్టపరమైన చర్యల బెదిరింపులు చెయ్యరాదు. బెదిరింపులను సహించం. బెదిరించిన సభ్యులు [[వికీపీడియా:నిషేధాలు, నిరోధాలు|నిషేధానికి]] గురౌతారు. [[వికీపీడియా:వివాద పరిష్కారం]] కూడా చూడండి.
 
=== వికిపీడీయా-అరాచకం ===
వికిపీడీయాలో మార్పులు చేర్పులు చెయ్యడానికి అందరికి అవకాశం ఉంటుంది. కాని కొన్ని సందర్భాలలో మార్పులు చేయడాన్ని నియంత్రించవచ్చు లేదా నిరోధించవచ్చు. ఇది వివాదాస్పద అంశాలకు ప్రత్యేకంగా వర్తిస్తుంది. వికిపీడీయా ఒక స్వయంనియంత్రణ వ్యవస్థ. అయితే ఇది ఒక అంశం లేదా ఒక విషయం మీద సభ్యులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే చర్చావేదిక కాదు. వికిపీడీయాను అందరి సహాయంతో విజ్ఞాన సర్వస్వ భాండాగారం క్రింద తయారు చేసే ఉద్దేశంతో ప్రారంభించాం. చర్చావేదిక కోసమైతే ఇక్కడ చూడండి. వికీఫోర్క్ ను వాడండి.
[http://www.meta.anarchopedia.org/ అరాచకపీడియా]. ఇది కూడా చూడండి [[meta:Power structure|పవర్]]
 
=== వికీపీడీయా - ప్రజాస్వామ్యం ===
వికీపీడియా [http://mail.wikimedia.org/pipermail/wikien-l/2005-January/018735.html ప్రజాస్వామ్యంలో ప్రయోగం లాంటిదేమీ కాదు]. ఇక్కడ [[వికీపీడియా:విస్తృతాభిప్రాయం|విస్తృతాభిప్రాయం]] సాధించే పద్ధతి -చర్చేగానీ, వోటింగు కాదు. అంటే, అధిక సంఖ్యాకుల అభిప్రాయమే నియమం కావాలనేమీ లేదు. నిర్ణయం తీసుకోవడంలో వోటింగు ఒక అంగం మాత్రమే. వోటింగుతోపాటు జరిగే చర్చ, విస్తృతాభిప్రాయం సాధించడంలో కీలకం. ఉదాహరణకు, [[వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు]] పేజీలో జరిగే చర్చ.
 
=== వికీపీడియా అధికార యంత్రాంగం కాదు ===
విభేదాలు తలెత్తినపుడు, నియమాలు, పద్ధతులను పట్టుకుని వేళ్ళాడకుండా చర్చ ద్వారా పరిష్కరించుకోవాలి. ఏదైనా పని ఓ పద్ధతి ప్రకారం జరగనంత మాత్రాన, ఆ పనే సరైనది కాదనడం పద్ధతి కాదు. నియమ నిబంధనలు, విధానాలు, మార్గదర్శకాలు మొదలైన వాటి అంతరార్థాలను గ్రహించి ఆచరించాలే గానీ, వాటి ప్రత్యక్షర భావాన్నీ అనుసరించే ప్రయత్నం చెయ్యరాదు.
 
== ఏం చెయ్యాలో అర్థం కానపుడు ==
* "ఫలానా" అనే వ్యాసంలో ఏమేం ఉండాలో నిర్ణయించుకోలేని పరిస్థితిలో ఉంటే, ముందు "ఫలానా" వ్యాసంలో ఏమి ఉండాలని పాఠకుడు కోరుకుంటారో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.
* ఇక్కడి నియమాలను ఉల్లంఘించినట్లు మీరు గమనిస్తే, ఇలా చెయ్యవచ్చు:
** వ్యాసంలో తగు దిద్దుబాట్లు చెయ్యడం (మామూలు దిద్దుబాటు)
** పేజీ చరితాన్ని భద్రపరుస్తూ, పేజీని దారిమార్పుగా మార్చడం
 
 
== ఇవి కూడా చూడండి ==
 
{{Wikipedia policies and guidelines}}
[[az:Vikipediya:Vikipediya nə deyil]]
[[bar:Wikipedia:Wos Wikipedia ned is]]
[[bat-smg:Pagelba:Kas nėranier VikipedijaVikipedėjė]]
[[be:Вікіпедыя:Чым не з'яўляецца Вікіпедыя]]
[[be-x-old:Вікіпэдыя:Чым не зьяўляецца Вікіпэдыя]]
21,579

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/508091" నుండి వెలికితీశారు