"పంచాయితీ రాజ్ (గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ)" కూర్పుల మధ్య తేడాలు

చి
చి (పంచాయతిరాజ్ ని విలీనం, కొంత సమాచారాన్ని గ్రామ పంచాయతీ లో కలుపు)
ప్రాచీనకాలంలో పనిచేస్తున్న గ్రామ పాలనా వ్యవస్థ అప్పటి సాంఘిక పరిస్థితుల కనుగుణంగా ఐదు ప్రధాన [[వృత్తి|వృత్తుల]] ప్రతినిధులతో పనిచేశేవి. అయితే ఇవి ఎక్కువగా అణచివేతకు గురయ్యేవి. బ్రిటిష్ పాలన ప్రారంభంలో అంతగా ఆదరించబడనప్పటికీ గవర్నర్ జనరల్ [[రిప్పన్]] ప్రోత్సాహంతో స్థానిక స్వపరిపాలనా సంస్థలు పునరుజ్జీవనం పొందాయి. 1919 మరియు 1935 భారత ప్రభుత్వ చట్టాలు కొంతమేరకు వీటికి బలం చేకూర్చాయి. భారతదేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రారంభించిన తొలి రాష్ట్రం [[రాజస్థాన్]] కాగా, 1959 నవంబర్ 1న, ఆంధ్ర ప్రదేశ్ లో దేశంలోనే రెండవదిగా, [[మహబూబ్ నగర్ జిల్లా]] [[షాద్‌నగర్]] లో ప్రారంభమైంది. గ్రామ స్థాయిలో [[గ్రామ పంచాయతీ]], బ్లాకు స్ధాయిలో పంచాయతి సమితి, జిల్లా స్థాయిలో [[జిల్లా పరిషత్]] గా ఏర్పడింది. 1986 లో బ్లాకు స్ధాయి వ్యవస్థని [[మండల పరిషత్]] గా మార్చారు.
 
73వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1994లో నూతన పంచాయతీ రాజ్ చట్టాన్ని చేసింది. <ref>The Andhra Pradesh Panchayathraj Manual, published in 1994 by Padala Ramireddy, Page no 27</ref>ప్రస్తుత వ్యవస్థ దీనికి అనుగుణంగా వుంది. కేంద్రంలో [[గ్రామీణాభివృద్ధి ]] మరియు పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ <ref>[http://www.panchayat.gov.in పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్సైటు ]</ref> రాష్ట్రాలలోని అటువంటి మంత్రిత్వ శాఖలతో <ref>[http://www.rd.ap.gov.in/ ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణాభివృద్ధి వెబ్సైటు] </ref> కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఏప్రిల్ 24 ని పంచాయతిరాజ్ దినంగా పాటిస్తున్నారు.
 
ఇంచుమించు 30 లక్షల మంది ప్రజా ప్రతినిధులతో నడుస్తున్న '''[[పంచాయితీ రాజ్]] వ్యవస్థ''' ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రధానంగా మన [[గ్రామాలు|గ్రామాలకు]] ఇది వెన్నెముకగా పనిచేస్తుంది. దేశ వ్యాప్తంగా 537 జిల్లా పంచాయితీలు, 6,097 మండల పంచాయితీలు మరియు 2,34,676 [[గ్రామ పంచాయితీ]]లు పనిచేస్తున్నాయి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/510669" నుండి వెలికితీశారు