నాణెం: కూర్పుల మధ్య తేడాలు

1,691 బైట్లు చేర్చారు ,  12 సంవత్సరాల క్రితం
దిద్దుబాటు సారాంశం లేదు
===భారతదేశంలో===
క్రీ.పూ 1000 సంవత్సరం నుంచి భారతదేశంలో నాణేలు చెలామణిలో ఉన్నాయని కన్నింగ్‌హామ్ అభిప్రాయం<ref>Coins of Ancient India, A. Cunningham, 1891, Asian Educational Services, New Delhi, 2000; ISBN 81-206-0606-X</ref>. జె.క్రిబ్ అనే మరో పురావస్తు శాస్త్రవేత్త అభిప్రాయం ప్రకారం ఇక్కడ క్రీ.పూ 350 సంవత్సరం కంటే ముందే నాణేలను వినియోగించారు. మనదేశంలో క్రీస్తుపూర్వం 6-7 శతాబ్దాలలో, లేదా అంతకంటే కొంచెం ముందు నాణేలు తయారై ఉండవచ్చునని ''పి ఎల్ గుప్తా''తో పాటు, అధిక సంఖ్యలో చరిత్రకారులు ప్రతిపాదిస్తున్నారు. ఇంత వివాదానికి కారణం తొలినాటి నాణేల మీద పాలకుల వివరాలు లేవు. నాణేలు తమ సంగతి తాము చెప్పలేనపుడు వాటి ఆచూకీ తెలుసుకోవడానికి ఉపయోగపడేవి సాహిత్య, పురావస్తు ఆధారాలే. క్రీ.శ ఒకటవ శతాబ్దానికి చెందినట్టు భావించే [[పాణిని]] తన [[అష్టాధ్యాయి]] గ్రంధంలో నాణేల ప్రస్తావన తెచ్చాడు. క్రీస్తుశకం నాల్గవ శతాబ్దం వాడైన [[కౌటిల్యుడు]] [[అర్థశాస్త్రం]]లో దొంగనాణేలను గురించి, సీసం గనుల గురించి ప్రస్తావించాడు. కాబట్టి దేశంలో పంచ్‌మార్క్‌డ్ నాణేలు నాల్గవ శతాబ్దానికే చెలామణీలో ఉన్నట్టే. లేదంటే కొంచెం ముందు నుంచి ఉండవచ్చు. ఇది అందరూ అంగీకరిస్తున్న చారిత్రక సత్యం.అయితే ఎవరు విడుదల చేశారో చెప్పడానికి ఆధారాలు లేవు. మన కృష్ణాజిల్లా సింగవరంలో లభ్యమైన వెండి నాణేల పరిస్థితి కూడా ఇదే.<ref>http://www.telugudanam.co.in/vijnaanam/meeku_telusaa/naaNela_charitra.htm</ref>
నాణేలు చరిత్రకు అద్దంపట్టే సాక్ష్యాలు. పల్లవుల పరిపాలనా దక్షత, చోళుల వైభవం, నవాబుల విలాసం, కృష్ణదేవరాయల కీర్తి, ఆంగ్లేయుల రాజభక్తిని చాటేవి నాణేలే. స్వాతంత్య్రానంతరం కూడా వీటి ప్రాధాన్యం తగ్గలేదు. భారతదేశ చరిత్రను మలుపు తిప్పిన నేతలు, ఘటనలు, విప్లవాలను నాణేలుగా తీసుకువచ్చింది. స్మృతికీ, పంపిణీకి వేర్వేరుగా ముద్రించడం ప్రారంభించింది.
===కుషాణుల రాజు వాసుదేవుడు ముద్రించిన నాణెం===
క్రీ.శ. 1వ శతాబ్దం - 3వ శతాబ్దం మధ్య కాలంలో తజికిస్తాన్ నుండి ఉత్తర భారతదేశంలోని గంగానది పరివాహక ప్రాంతమంతా పాలింఛిన వారు [[కుషాణులు]]. ఈ సామ్రాజ్యం పాలకులు మొదట యూజీ అనే ఇండో-యూరోపియన్ తెగకు చెందిన పశ్చిమచైనా ప్రాంతంవారు.
 
కుషాణుల రాజు, కనిష్క వంశపు సామ్రాజ్యాధి పతులలొ చివరి ప్రభువు ఆయిన వాసుదేవుడు (క్రీ.శ. 202-233)ముద్రించిన నాణెం.నాణేనికి ఒక వైపున తన బొమ్మను శూలం ధరించిన రూపులో వేయించినాడు. మరో వైపున "ఓషొ" అనే దేవత బొమ్మను వేయించినాడు. ఇతని పేరును బట్టియే అతడు పూర్తిగా భారతీకరణకు లోనైనట్టు గమనించగలము.
 
<gallery>
బొమ్మ:Kushan_vasudavudu1.jpg|కుషాణుల నాణెం ముందర వైపు
బొమ్మ:Kushan vasudavudu2.jpg|కుషాణుల నాణెం వెనుక వైపు
</gallery>
 
===నాణేల్లో నిలిచిన మహనీయులు ===
*[[మహాత్మాగాంధీ]] 1969లో జాతిపిత మహాత్మాగాంధీ శతజయంత్యుత్సవాల సందర్భంగా 20 పైసలు, 50 పైసలు, రూ.1, రూ.10 నాణేలు వెలువరించారు. రూ.10 నాణెం విడుదలజేయడం అదే ప్రథమం. అత్యధిక విలువున్న రూ.5, రూ.10 రూపాయలకూ నాణెం ముద్రించేందుకు వీలుగా సంబంధిత చట్టానికి (కాయిన్స్ యాక్ట్) ప్రత్యేక సవరణ కూడా తీసుకువచ్చారు.
7

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/511010" నుండి వెలికితీశారు