రబ్ నే బనాదీ జోడీ: కూర్పుల మధ్య తేడాలు

వ్యాసం ప్రారంభం
 
→‎కథ: శుద్ధి చేసాను
పంక్తి 24:
 
==కథ==
[[అమృతసర్]] లోని పంజాబ్ పవర్ లో చిరుద్యోగి అయిన సురిందర్ సాహ్నీ సిగ్గరి, మితభాషి, సున్నిత మనస్కుడుసహృదయుడు. స్వస్థలం [[అమృతసర్]] జంక్షన్ లో వధూ ([[అనుష్క శర్మ]]) సమేతంగా రైలు దిగే సన్నివేశంతో చిత్రం మొదలవుతుంది. రైలు దిగే సమయంలో ఆసరాకి అందించిన తన చేయిని వధువు ([[అనుష్క శర్మ]] అందుకోకున్నా నొచ్చుకోక, సరిపుచ్చుకొని ఇంటికి బయలుదేరుతాడు. ఇరుగు-పొరుగు నూతన వధూవరులను చూసి గుస గుసలాడుకొంటూండగా తటాలున తలుపులను బిగించేస్తాడు సురిందర్. తనని ఎంతో అభిమానించే ఉపాధ్యాయుని కూతురు తానియా పెళ్ళికి వెళ్ళిన సూరి కి ఒక పెద్ద సమస్య ఎదురౌతుంది. స్వతంత్ర ఆలోచనలు ఉన్న తానియాకి తన తండ్రి ఎప్పుడూ పొగుడుతున్న సూరి వ్యక్తిత్వం అంతగా రుచించదు. తమ ప్రేమని పెద్దలతో ఒప్పించిన తానియా పెళ్ళిలో దురదృష్టవ శాత్తూ వరుడు, అతని కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతారు. గుండె పోటుతో మరణశయ్య పైనున్న తానియా తండ్రి కూతురిని ఒప్పించి, సంజయ్ చేతిలో పెడతాడు. చేసేది లేక సురిందర్, కన్నీళ్ళతో తానియా ఆ పెళ్ళిని అంగీకరిస్తారు.
 
 
తన భార్యని అపురూపంగా చూసుకోవాలనుకొన్న సూరి, తన పడక గదిని తాని కి ఇచ్చి తాను మాత్రం స్టోర్ రూం లో పడుకొంటుంటాడు. తాని అంటే మనసులో ప్రేమ ఉన్నా, దానిని తన తో చెప్పటానికి సంశయిస్తుంటాడు. భార్య స్థానం పై గౌరవమున్న తాని, తన సహధర్మ చారిణి గా మాత్రమే ఉండగలనని, కానీ తనని ఎన్నటికీ ప్రేమించలేనని సూరితో చెబుతుంది. కనీసం తనకు సహధర్మ చారిణిగా ఉండటానికి తానికి అభ్యంతరం లేదు అని తెలుసుకొన్న సూరి తానికి అనుకూలంగానే ప్రవర్తిస్తుంటాడు. తాని కి నాట్యం, ప్రేమకథా చిత్రాలు అంటే ఇష్టం ఉండటంతో తరచూ ఇద్దరూ కలిసి సినిమాలకి వెళ్తుంటారు. హీరో చేసే సాహస కృత్యాలు, చెప్పే సంభాషణలని తాని బాగా ఆస్వాదిస్తూ ఉంటుంది. ఇంటి పట్టునే ఉంటూ ఏమీ పాలుపోని తాని బొంబాయి నుండి వచ్చిన 'డ్యాన్సింగ్ జోడీ' అనే నాట్య శిక్షణా సంస్థలో నాట్యం నేర్చుకోవటానికి సూరి అంగీకారంతో చేరుతుంది.
 
హెయిర్-సెలూన్ నడుపుతున్న తన స్నేహితుడు బల్విందర్ (బాబీ) ఖోస్లా ([[వినయ పాఠక్]]) తో సినిమా హీరోలంటే తానికి బాగా ఇష్టమని, వారిలా తనని మార్చేసి తన ప్రేమని పొందేలా ఏదైనా చేయమని బాబీ ని ఉద్రేకంగా కోరతాడు సూరి.
 
==లింకులు==
"https://te.wikipedia.org/wiki/రబ్_నే_బనాదీ_జోడీ" నుండి వెలికితీశారు