రబ్ నే బనాదీ జోడీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
→‎కథ: పూర్తి చేశాను
పంక్తి 24:
 
==కథ==
[[అమృత్‌సర్]] లోని పంజాబ్ పవర్ లో చిరుద్యోగి అయిన సురిందర్ సాహ్నీ ఒంటరి, సిగ్గరి, మితభాషి, మరియు సహృదయుడు. అమృతసర్ జంక్షన్ లో వధూ సమేతంగా రైలు దిగే సన్నివేశంతో చిత్రం మొదలవుతుంది. రైలు దిగే సమయంలో ఆసరాకి అందించిన తన చేయిని వధువు ([[అనుష్క శర్మ]] అందుకోకున్నా నొచ్చుకోక, సరిపుచ్చుకొని ఇంటికి బయలుదేరుతాడు. ఇరుగు-పొరుగు నూతన వధూవరులను చూసి గుస గుసలాడుకొంటూండగా తటాలున తలుపులను బిగించేస్తాడు సురిందర్. తనని ఎంతో అభిమానించే ఉపాధ్యాయుని కూతురు తానియా పెళ్ళికి వెళ్ళిన సూరి కి ఒక పెద్ద సమస్య ఎదురౌతుంది. స్వతంత్ర ఆలోచనలు ఉన్న తానియాకి తన తండ్రి ఎప్పుడూ పొగుడుతున్న సూరి వ్యక్తిత్వం అంతగా రుచించదు. తమ ప్రేమని పెద్దలతో ఒప్పించిన తానియా పెళ్ళిలో దురదృష్టవ శాత్తూ వరుడు, అతని కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతారు. గుండె పోటుతో మరణశయ్య పైనున్న తానియా తండ్రి కూతురిని ఒప్పించి, సంజయ్ చేతిలో పెడతాడు. చేసేది లేక సురిందర్, కన్నీళ్ళతో తానియా ఆ పెళ్ళిని అంగీకరిస్తారు.
 
 
తన భార్యని అపురూపంగా చూసుకోవాలనుకొన్న సూరి, తన పడక గదిని తాని కి ఇచ్చి తాను మాత్రం సామనులు భద్రపరిచే గది లో పడుకొంటుంటాడు. తాని అంటే మనసులో ప్రేమ ఉన్నా, దానిని తన తో చెప్పటానికి సంశయిస్తుంటాడు. భార్య స్థానం పై గౌరవమున్న తాని, తన సహధర్మ చారిణి గా మాత్రమే ఉండగలనని, కానీ తనని ఎన్నటికీ ప్రేమించలేనని సూరితో చెబుతుంది. కనీసం తనకు సహధర్మ చారిణిగా ఉండటానికి తానికి అభ్యంతరం లేదు అని తెలుసుకొన్న సూరి తానికి అనుకూలంగానే ప్రవర్తిస్తుంటాడు. తాని కి నాట్యం, ప్రేమకథా చిత్రాలు అంటే ఇష్టం ఉండటంతో తరచూ ఇద్దరూ కలిసి సినిమాలకి వెళ్తుంటారు. హీరో చేసే సాహస కృత్యాలు, చెప్పే సంభాషణలని తాని బాగా ఆస్వాదిస్తూ ఉంటుంది. ఇంటి పట్టునే ఉంటూ ఏమీ పాలుపోని తాని బొంబాయి నుండి వచ్చిన 'డ్యాన్సింగ్ జోడీ' అనే నాట్య శిక్షణా సంస్థలో నాట్యం నేర్చుకోవటానికి సూరి అంగీకారంతో చేరుతుంది.
 
[[క్షౌరశాల]] నడుపుతున్న తన స్నేహితుడు బల్విందర్ (బాబీ) ఖోస్లా ([[వినయ్ పాఠక్]]) తో సినిమా హీరోలంటే తానికి బాగా ఇష్టమని, వారిలా తనని మార్చేసి తన ప్రేమని పొందేలా ఏదైనా చేయమని బాబీ ని ఉద్రేకంగా కోరతాడు సూరి. బాబీ సూరికి కేశాలంకరణ చేస్తాడు. కళ్ళజోడుని మారుస్తాడు. నవతరం యువకులు ధరించే టీ-షర్టు, జీన్స్ ప్యాంటుని ఇస్తాడు. తాని ఇష్టపడే హీరో పాత్ర "రాజ్ కపూర్" గా సూరి తన పేరును మార్చుకొంటాడు. 'డ్యాన్సింగ్ జోడీ' లో విద్యార్థిగా చేరతాడు. కలయో నిజమో వైష్ణవ మాయో అన్నట్టు తానికి సహ నాట్యకారునిగా ఎన్నుకోబడతాడు. ఈ కాలం అమ్మాయిలతో ఎలా వ్యవహరించాలో తెలియని సూరి, తన అత్యుత్సాహంతో మొదట తాని చిరుకోపాలకి గురి అయినా మెల్లగా తానిని మచ్చిక చేసుకోవటంలో సఫలీకృతుడౌతాడు. రక్షా బంధన్ నాడు 'డ్యాన్సింగ్ జోడీ'లోని అమ్మాయిలందరూ తమ సహ నాట్యకారులకి రాఖీలు కట్టటం నచ్చని తాని, సూరిని స్త్రీ పురుషుల మధ్య, సోదర బంధానికే గానీ స్నేహ భావానికి చోటు లేదా అని ప్రశ్నిస్తుంది. సంతోషించిన రాజ్, కొంత కాలం తర్వాత ఆమెకి తన ప్రేమని ప్రకటిస్తాడు. ఈ హఠాత్పరిణామానికి సిద్ధంగా లేని తాని తాను ఇంకొకరి భార్యనని, రాజ్ ప్రేమని అంగీకరించలేని తన నిస్సహాయత తెలుపుతుంది.
[[క్షౌరశాల]] నడుపుతున్న తన స్నేహితుడు బల్విందర్ (బాబీ) ఖోస్లా ([[వినయ్ పాఠక్]]) తో సినిమా హీరోలంటే తానికి బాగా ఇష్టమని, వారిలా తనని మార్చేసి తన ప్రేమని పొందేలా ఏదైనా చేయమని బాబీ ని ఉద్రేకంగా కోరతాడు సూరి.
 
తాని లో అంత:స్సంఘర్షణ మొదలవుతుంది. ఒక వైపు ప్రేమ లేని పెళ్ళితో చీకటి మయమైన తన జీవితం, మరొక వైపు చావుబ్రతుకుల్లో ఉన్న తన తండ్రికిచ్చిన మాట. సూరి పరిస్థితి కూడా అంతే. బాధాకరమైన తన భార్య జీవితాన్ని మార్చేయాలని ఆరాటం, రాజ్ ని ఇష్టపడి తానియా వెళ్ళిపోతే, మళ్ళీ తనని పలకరించే ఒంటరితనం. ఒక రోజు రాజ్ వద్దకి వెళ్ళి తన ప్రేమని తాను అంగీకరిస్తున్నానని తాని తెలుపుతుంది. తమ నాట్య ప్రదర్శన పోటీలు జరిగిన తర్వాతి రోజునే తాము పారిపోదామని రాజ్ తాని ని ఒప్పిస్తాడు. రాజ్ నే కానీ సూరి ని ప్రేమించట్లేదని తెలిసిన బాబీ, తాని కి నిజం చెప్పేసి, తనకి ఆమె పట్ల ఉన్న ప్రేమని చెరిపివేయమని సలహా ఇస్తాడు.
 
నాట్య ప్రదర్శన పోటీలు జరిగే రోజున తానీని (పోటీలో మరియు జీవితంలో) విజయం వరించాలని కోరుతూ సువర్ణ దేవాలయానికి తానితో బాటు వెళ్ళి పూజలు చేయిస్తాడు సూరి. తమ వివాహం భగవంతుని తలంపు అని తాని అక్కడే తెలుసుకొంటుంది. సూరిలో ఉన్న ఉదార మనస్తత్త్వం, అతని నిగర్వి వ్యక్తిత్వంలో ఉన్న గొప్పదనం తానియాకి అప్పుడే అర్థం అవుతాయి. తాము పారిపోదామన్న సలహాని కొట్టి పారేస్తున్నందుకు తనని క్షమించమని, తాను సూరితోనే ఉంటాననీ రాజ్ తో చెప్పటం, తానికి సూరి అంటే ఎంత ప్రేమో తెలుపుతుంది. కన్నీటి పర్యంతమైన్ రాజ్, నాట్యపోటీకి రాడు. అతను వస్తాడని ఎదురు చూస్తున్న తాని, రాజ్ బదులుగా సూరి సహ నాట్యకారునిగా రావటంతో నిర్ఘాంతపోతుంది. కలిసి చేసే నాట్యంలో సూరి - రాజ్, ఇద్దరూ ఒక్కడే అని తెలుసుకొని, పోటీ జరిగిన తర్వాత సూరి ప్రేమని తాను అంగీకరిస్తున్నాని తెలిపుతుంది. నాట్యపోటీల్లో సూరి-తాని జంటే విజేతలుగా నిలవటం, తానికి [[జపాన్]] అంటే ఇష్టం కావటంతో సూరి అంతకు మునుపే ఒక సుమో వీరునితో తలపడి ఆ దేశ యాత్రకి టిక్కెట్లను గెల్చుకొని ఉండటం, వారు తమ ప్రేమ యాత్రకి బయలుదేరటంతో చిత్రం సుఖాంతమౌతుంది.
 
==లింకులు==
"https://te.wikipedia.org/wiki/రబ్_నే_బనాదీ_జోడీ" నుండి వెలికితీశారు