అవయవ దానం: కూర్పుల మధ్య తేడాలు

స్వచ్ఛందంగా అవయవాలు దానం చేసే ప్రక్రియ
కొత్త పేజీ: చనిపోయాక మనిషి తన శరీరంలోంచి 200 ఆర్గాన్స్‌, టిష్యూలను దానం చేయవ...
(తేడా లేదు)

14:57, 12 జూన్ 2010 నాటి కూర్పు

చనిపోయాక మనిషి తన శరీరంలోంచి 200 ఆర్గాన్స్‌, టిష్యూలను దానం చేయవచ్చు.కళ్లు, గుండె, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, క్లోమం, పెద్ద, చిన్నపేగులు, ఎముకలు, మూలుగను దానం చేయవచ్చు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత సగటున ఆరేడుగురికి బతుకు ఇవ్వొచ్చు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన 'జీవనదానం' కార్యక్రమం మార్గదర్శకాలు రూపొందించే దశలో ఉంది.

ఎప్పుడు సేకరిస్తారు?

చనిపోయాక అవయవాల మార్పిడి గంటల్లో జరిగిపోవాలి. గుండె ఆగి చనిపోతే కళ్లు, గుండె కవాటాలు వంటి వాటిని 6 నుంచి 24 గంటల్లోపు సేకరించవచ్చు. రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన కేసుల్లో ఎక్కువగా బ్రెయిన్‌ డెత్‌గా ప్రకటిస్తారు. వీరిని వెంటిలేటర్‌ నుంచి బయటకు తీసుకొచ్చేలోపు అవయవాలు సేకరించవచ్చు. బయటకు తీసుకొచ్చాక గుండె అయితే నాలుగైదు గంటలు, కాలేయం 10-12 గంటలు, మూత్రపిండాలు 24 గంటల్లోపు సేకరించాల్సి ఉంటుంది.

ఎవరు ఇవ్వొచ్చు?

బతికుండానే అవయవాలు రక్త సంబంధీకులకు దానం చేయవచ్చు. రక్త సంబంధీకులు అంటే అమ్మానాన్న, సోదరి, పాప, బాబు, భార్య . ఇందుకు ప్రభుత్వ అనుమతి అక్కర్లేదు.బతికుండానే బంధు, మిత్రులకు అవయవదానం చేసేటప్పుడు మాత్రం ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరి.ఆరోగ్యవంతులైన అన్ని వయసులవారు అవయవదానానికి అర్హులే. తన మరణాంతరం శరీరంలోని భాగాలు ఉపయోగించుకునేలా అంగీకారం తెలపవచ్చు. బంధుమిత్రుల ఆమోదంతో వీరి శరీరంలోని అవయవాలను మార్పిడి కోసం సేకరిస్తారు.

"https://te.wikipedia.org/w/index.php?title=అవయవ_దానం&oldid=517424" నుండి వెలికితీశారు