"ఋతుచక్రం" కూర్పుల మధ్య తేడాలు

637 bytes added ,  11 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
{{మొలక}}
'''ఋతుచక్రం''' (Menstrual cycle) [[స్త్రీ]]లలో నెలనెల జరిగే ఒకరకమైన [[రక్తస్రావం]]. ఇవి మొదటిసారిగా రావడాన్ని [[రజస్వల]] అవడం అంటారు. ఇది [[గర్భాశయం]] లోని [[ఎండోమెట్రియమ్]] అనే లోపలి పొర ఒక నిర్ధిష్టమైన కాల వ్యవధిలో విసర్జించబడి, తిరిగి కొత్తగా తయారు అవుతుంది. ఈ విధంగా విసర్జించబడిన స్రావాల్ని [[ఋతుస్రావం]] అంటారు.పూర్వం ఇలా నెలసరి లో ఉన్న స్త్రీలను ఏ పనీ చేయనీయకుండా [[ముట్టు]] [[అంటు]] [[మైల]] అంటూ ఆరోగ్యకారణాల రీత్యా ఇంటి బయటే ఉంచేవారు.కాబట్టి ఆమె బయట చేరింది అనేవాళ్ళు. ఇప్పుడు ముట్టు గుడ్డల వాడకంతో స్త్రీలు తమ తమ పనులు మామూలుగానే చేసుకోగలుగుతున్నారు.పెద్దవయసు స్త్రీలలో రుతుక్రమం ఆగిపోటాన్ని [[మెనోపాజ్]] (ముట్లుడిగిపోవటం) అంటారు.
==నెలసరి నేప్కిన్లు ==
గ్రామీణ ప్రాంత కౌమార బాలికల్లో [[నెలసరి]] సమయంలో పరిశుభ్రతను పెంపొందించటం కోసం [[రుతుక్రమం]] వేళల్లో వాడేందుకు శుభ్రమైన రుతుక్రమ రుమాళ్లు (ముట్టు బట్టలు,ప్యాడ్లు/నేప్కిన్లు) ప్రభుత్వం అందించనుంది. పేదరిక రేఖకు దిగువన (బీపీఎల్‌) ఉండే 10-19 సంవత్సరాల మధ్య వయసున్న కోటిన్నర మంది బాలికలకు చౌక ధరకు వీటిని పంపిణీ చేస్తారు. ఆరు రుమాళ్లతో కూడిన ఒక పొట్లం ధర రూ.1 గా నిర్ణయించారు. బీపీఎల్‌ ఎగువ కుటుంబాల బాలికలకు మాత్రం రూ.5కు ఒకటి చొప్పున అందజేస్తారు.వీటిని పంపిణీ చేసే బాధ్యతను ఆశా కార్యకర్తలకు అప్పగిస్తారు.
8,854

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/518635" నుండి వెలికితీశారు