పరమేశ్వరుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఆదిదేవుడిగా, భోళాశంకరుడిగా, పరమశివునిగా కీర్తింపబడే పరమాత్మయే పరమేశ్వరుడు. ఈయన హిందువులకు అత్యంత ఆరాధనీయ దైవం. లింగ స్వరూపంలో పూజలందుకునే ఈ పరమశివుడే సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహములను నిర్వహిస్తూ భక్తుల పాలిట కల్పవృక్షంగా భాసిస్తూ ఉంటాడు. జగన్మాత అయిన పార్వతీదేవి ఈయన అర్ధాంగి. పార్వతీపరమేశ్వరులు ఆదిదంపతులుగా సకలలోకవాసులచేత పూజలందుకుంటూ ఉంటారు. శివ కుటుంబం కూడా చాలా చిత్రమైనది. శివుడు భస్మాంగధారియై, పాములను ఆభరణాలుగా వేసుకుని, గజచర్మాన్ని ధరించి ఉంటే, అమ్మవారు సకలాభరణ భూషితురాలై అలరారుతూ ఉంటుంది. పెద్దకుమారుడైన విఘ్నేశ్వరుడు గజముఖుడు, చిన్నకుమారుడైన షణ్ముఖుడు ఆరు ముఖములు కలవాడు.
"https://te.wikipedia.org/wiki/పరమేశ్వరుడు" నుండి వెలికితీశారు