"కాశీనాథుని నాగేశ్వరరావు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
'''కాశీనాథుని నాగేశ్వరరావు''' (Kasinadhuni Nageswara Rao) ([[1867]] - [[1938]]) ప్రముఖ పాత్రికేయుడు, వ్యాపారవేత్త, స్వాతంత్ర్య సమర యోధుడు, రాజకీయ నాయకుడు, గ్రంధాలయాల విస్తరణకు కృషి చేసిన విద్యా వేత్త, దానశీలి, ఖాదీ ఉద్యమాన్ని ప్రోత్సహించాడు. ఆయనను 'నాగేశ్వరరావు పంతులు' అనేవారు. '''దేశోద్ధారక''' అని ఆయనను అంతా గౌరవించేవారు. 1935లో [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] ఆయనను '[[కళాప్రపూర్ణ]]' బిరుదుతో సత్కరించింది. {{fact}}
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = కాశీనాథుని నాగేశ్వరరావు
నాగేశ్వరరావు పెద్ద చదువులు చదవలేదు. పదవులు ఆశించలేదు. [[ఆంధ్ర పత్రిక]], అమృతాంజనం సంస్థలను ఆయన స్థాపించాడు. ఆంధ్రపత్రిక, [[భారతి పత్రిక|భారతి]], ఆంధ్ర గ్రంధాలయాల ద్వారా తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేసేడు. ఆయన స్వయంగా రచయిత. భగవద్గీతకు వ్యాఖ్యానం రాసేడు.
 
ఆయనకు ''విశ్వదాత'', ''దేశోద్ధారక'' అనే బిరుదులు ఉన్నాయి. ఆయన తలచుకొంటే లక్షలపై లక్షలు ఆర్జించి కోట్లకి పడగలెత్తేవాడు. ఆడంబర రాజకీయాల జోలికి పోలేదు. [[అమృతాంజనం]] ద్వారా గణించిన డబ్బును పేద విద్యార్ధులకి వేతనాలుగా ఇచ్చేసేవాడు. ఆయన దేశభక్తినీ వితరణశీలాన్నీ గాంధీ మహాత్ముడు కూడ మెచ్చుకున్నాడు{{fact}}.
 
[[చెన్నై]] లోని నాగేశ్వరరావు నివాసమైన ''శ్రీబాగ్'' లోనే చారిత్రాత్మక [[శ్రీబాగ్‌ ఒడంబడిక]] కుదిరింది. [[కోస్తా]], [[రాయలసీమ]] నాయకుల మధ్య కుదిరిన ఈ ఒడంబడిక ద్వారా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైంది.
2,920

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/520698" నుండి వెలికితీశారు