ఎక్కిరాల కృష్ణమాచార్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''ఎక్కిరాల కృష్ణమాచార్య''' (1926-1984) [[ఆంధ్రప్రదేశ్]] కు చెందిన రచయిత. ఆయన శిష్యులు ఆయన్ను ''మాస్టర్ ఇ. కె.'' అని పిలుచుకుంటుంటారు. ఈయన [[1926]], [[ఆగస్టు 11]]వ తేదీన [[ఆంధ్రప్రదేశ్]] కు చెందిన గుంటూరు జిల్లా, [[బాపట్ల]]లో అనంతాచార్యులు మరియు బుచ్చమ్మ దంపతులకు జన్మించాడు. వీరు ఆంధ్ర, సంస్కృత, ఆంగ్ల బాషలలో పాండిత్యాన్ని సాధించారు. 'పాండురంగ మహాత్మ్యం' కావ్యంపై పరిశోధన చేసి ఒక అద్భుతమైన గ్రంధాన్ని వెలయించి 'డాక్టరేట్' సాధించారు. గుంటూరులోని హిందూ కళాశాలలోను, తరువాత ఆంధ్ర విశ్వకళాపరిషత్తులోను ఆంధ్ర ఉపన్యాసకులుగా పనిచేశారు. వీరి రచనలలో 'రాసలీల', 'ఋతుగానం', 'ఓదా వైభవం', 'అశ్వత్థామ సుభద్ర', 'అపాండవము', 'స్వయంవరము', 'పురాణ పురుషుడు', 'పురుష మేధము', 'లోకయాత్ర లకు మంచి ప్రచారం పొందాఅయి. [[జయదేవుడు|జయదేవుని]] 'గీత గోవిందము'ను '[[పీయూష లహరి]]' అనే పేరుతో అచార్య తెలుగులోకి అనువదించారు.
 
వీరు యూరపులో పర్యటించి సనాతన హిందూ ధర్మానికి అక్కడ ప్రచారాన్ని కల్పించి, జగద్గురువుగా ఖ్యాతిగాంచారు. 'వరల్డు టీచర్స్ ట్రస్టు' అనే సంస్థను స్థాపించి తన బోధనలు తగు ప్రచారం పొందే ఏర్పాటుచేసారు. వీరి కృషి ఫలితంగా [[జెనీవా]] నగరంలో [[మొరియా విశ్వవిద్యాలయం]] రూపొందింది. ఇది మానవ జీవితానికి ఆవశ్యకాలైన తత్వశాస్త్ర, వైద్యశాస్త్రాలను సమగ్రంగా సమన్వయించే విద్యాపీఠం. [[హోమియోపతి]] వైద్యవిధానం భారత దేశ ఆర్థిక పరిస్థితికి చక్కగా సరిపోతుందని భావించి వీరు కొన్ని కేంద్రాలలో ఉచిత హోమియో వైద్యశాలలను నెలకొల్పారు. ఈ వైద్యశాస్త్రాన్ని వివరించే సారస్వతాన్ని ఆంధ్రలోను, ఆంగ్లంలోను రచించారు.
పంక్తి 10:
 
[[వర్గం:తెలుగు సాహితీకారులు]]
[[వర్గం:గుంటూరు జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:1926 జననాలు]]
[[వర్గం:1984 మరణాలు]]