కుంభరాశి: కూర్పుల మధ్య తేడాలు

చి కొత్త పేజీ: {{తెలుగు పంచాంగం}}
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
కుంభ రాశి జాతకచక్రంలో పదకొడవ స్థానంలో ఉంది. ఈ రాశ్యధిపతి శని భగవానుడు. ఈ రాశి 300 డిగ్రీల నుండి 330 డిగ్రీల వరకు ఉంటుంది. ఈ రాశి బేసి రాశి, క్రూర రాశి, పురుష రాశి, స్థిర రాశిగా వ్యవహరిస్తారు. ఈ రాశి తత్వం వాయుతత్వం, శబ్ధం అర్ధ శబ్ధం, అర్ధ జల రాశి, జీవులు మానవులు, జాతి వైశ్య జాతి, సంతానం సమ సంతానం, సమయం పగటి సమయం, పరిమాణం హస్వం, ఉదయం శీర్షోదయం, దిక్కు పడమర దిక్కు, ప్రకృతి వాత, కఫ, పిత్త ప్రకృతి, కాలపురుషుని శరీరావయవం పిక్కలు. ఇది విషమ రాశి.
* నిరయన రవి ఈరాశిలో ఫిబ్రవరి పదిహేన తేదీలో ప్రవేశిస్థాడు.
* ఈ రాశిని రాహువుకు స్వస్థానంగా కొందరు భావిస్తారు. సహజంగా ఛాయా గ్రహమైన రాహుకు జాతక చక్రంలో స్థానం లేదని పండితులు భావిస్తారు.
* ఈ రాశి గూఢాచారులను, వ్యాపారులను సూచిస్తుంది,
* గృహంలో నీటి పారలు, నీరు ఉండే ప్రదేశాలు ఈ రాశికి స్థానాలు.
* ఈ రాశిలో జన్మించిన వారు లౌక్యం తెలిసిన వారు, అల్పసంతోషులు, దానధర్మములు చేయు వారు, ఎవరిని నొప్పించ మాటాడని వారు, సామాన్యులుగా ఉంటారు. సన్నని వారై ఉంటారు.
* ఈ రాశి వారికి అయిదు, పన్నెండు, ఇరవై ఎనిమిది సంవత్సరాలలో ఆరోగ్య సమస్యలు కలుగుతాయి.
* ఈ రాశికి అంటు వ్యాధులు, నేత్ర వ్యాధులు, చర్మరోగములకు కారకత్వం వహిస్తాడు.
{{తెలుగు పంచాంగం}}
"https://te.wikipedia.org/wiki/కుంభరాశి" నుండి వెలికితీశారు