దోమాడ చిట్టబ్బాయి: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: en:Domada Chittabbayi
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
'''దోమాడ చిట్టబ్బాయి''' ([[1933]], [[మే 9]]<ref>http://www.indiamusicinfo.com/cgi-bin/vitalstat.cgi?frm=artiststats&id=265</ref> - [[2002]], [[జూలై 2]]) ప్రముఖ నాదస్వర విద్వాంసులు. వీరు [[తూర్పు గోదావరి]] జిల్లా [[బొలిపాలెం]] గ్రామంలొ చాగంటి రాఘవులు, చిట్టెమ్మలకు [[1933]] [[ఆగష్టు 1]]న జన్మించారు. వీరు దోమాడ లచ్చన్న, అచ్చమ్మలకు దత్తపుత్రుడుగా పెరిగారు. ఈయన మేనమామ పసుపతి వెంకట్రావు చిట్టబ్బాయికి నాదస్వరాన్ని పరిచయం చేశాడు. సుప్రసిద్ధ నాదస్వర విద్వాంసులు [[పసుపులేటి వెంకట్రావు]], [[నేదునూరి కృష్ణమూర్తి]], [[దాలిపర్తి పిచ్చయ్య]]ల వద్ద నాదస్వర విద్యాభ్యాసంలో శిక్షణ పొందారు.
 
చిట్టబ్బాయి ఆ తర్వాత రేడియో మరియు దూరదర్శన్ లలో అనేక ప్రదర్శనలు ఇచ్చాడు. ప్రముఖ [[గ్రామఫోన్]] మరియు రికార్డింగ్ కంపెనీలకు క్యాసెట్లు, డిస్కులు రికార్డు చేశాడు. వివిధ ప్రముఖ సంగీత కళా సంస్థలనుండి “సునాద ప్రవీణ”, “కళాసరస్వతి”, “ఆంధ్రరత్న”, “సంగీత కళాసాగర” మొదలైన బిరుదులు పొందాడు. 1990లో [[ఆంధ్రవిశ్వవిద్యాలయం]] చిట్టబ్బాయిని [[గౌరవ డాక్టరేటు]] డిగ్రీ కళాప్రపూర్ణతో సత్కరించింది. సింహాచలంలోని[[సింహాచలం]]లోని శ్రీవరాహ నరసింహస్వామి దేవస్థానం యొక్క ఆస్థాన విద్వాంసునిగా ఒక దశాబ్దకాలంపాటు పనిచేశాడు. 1990 దశకం చివరలో క్రియాశీల ప్రజాజీవితంనుండి వైదొలగే ముందు శ్రీ వెంకటేశ కళాపీఠంలో కూడా పనిచేశాడు.<ref>[http://sify.com/carnaticmusic/fullstory.php?id=14000378 Obituary - Domada Chittabbai] Sify.com</ref> 1995లో సంగీత నాటక అకాడెమీ యొక్క కర్ణాటక వాద్య సంగీత విభాగంలో జాతీయ పురస్కారాన్ని అందుకున్నాడు.<ref>http://www.sangeetnatak.org/programmes_recognition&honours_music_carnatic_instrumental.html</ref>
 
 
"https://te.wikipedia.org/wiki/దోమాడ_చిట్టబ్బాయి" నుండి వెలికితీశారు