వరుణ్ గాంధీ: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: ml:വരുൺ ഗാന്ധി
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
| source =
}}
[[భారతీయ జనతా పార్టీ]] యువ నేతలలో ముఖ్యుడైన వరుణ్ గాంధీ (Varun Gandhi) [[1980]], [[మార్చి 13]]న జన్మించాడు. [[భారత్|భారతదేశం]]లో చారిత్రకంగా, రాజకీయంగా ప్రముఖమైన నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వరుణ్ తను మూడు నెలల వయసు ఉన్నప్పుడే తండ్రి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించగా, నాలుగేళ్ళ వయసు ఉన్నప్పుడు నానమ్మ, భారత తొలి మహిళా ప్రధానమంత్రి అయిన [[ఇందిరా గాంధీ]] మరణించింది. నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వారు ఇప్పటివరకు ముగ్గురు భారతదేశ [[ప్రధాన మంత్రి]] పదవిని చేపట్టినారు. [[మోతీలాల్ నెహ్రూ]] ఈ కుటుంబం నుండి పేరు ప్రఖ్యాతలు పొందిన తొలి వ్యక్తి కాగా, వరుణ్ గాంధీతో పాటు [[రాహుల్ గాంధీ]], ప్రియాంకలు ఐదవ తరానికి చెందినవారు. ప్రారంభం నుండి ఈ కుటుంబం వ్యక్తులు [[కాంగ్రెస్ పార్టీ]] తరఫున ఉండటమే కాకుండా పార్టీ అధ్యక్షపదవిని చేపట్టడంలో మరియు అధికార పదవులు చేపట్టడంలో ముందంజలో ఉన్నారు. కాని వరుణ్ గాంధీ రాజకీయాలలో చేరినప్పటి నుండి [[భాజపా]] పక్షంలోనే ఉన్నాడు. [[2009]] సార్వత్రిక ఎన్నికలలో పోటీచేయడానికి [[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్రంలోని ఫిలిభిత్ లోకసభలోక్‌సభ నియోజకవర్గం నుండి పార్టి టికెట్టు కూడా పొందినాడు. ఎన్నికల ప్రసంగంలో మతపరమైన ఉద్రేక ప్రసంగాలు చేసినందుకు ఎన్నికల కమీషన్ పోటీచేయడానికి అనర్హత విధించగా, ఈ విషయంలో వాతావరణం వేడెక్కడంతో తొలుత బెయిల్ వారెంటు తీసుకున్న వరుణ్ దాని గడుపు ముగయడంతో స్వచ్ఛందంగా [[మార్చి 28]], 2009న పిలిభిత్ స్థానిక కోర్టులో లొంగిపోయి, 20 రోజులు ఇటా జైలులో ఉండి ఏప్రిల్ 16న పెరోల్ పై విడుదలైనాడు.
==ప్రారంభ జీవనం==
[[సంజయ్ గాంధీ]], [[మేనకా గాంధీ]]ల ఏకైక సంతానమైన వరుణ్ గాంధీ 1980, మార్చి 13న జన్మించాడు.<ref>[http://sify.com/news/fullstory.php?id=14350690&page=4 sify.com/news/fullstory.</ref> విధి వక్రించి అతిచిన్న ప్రాయంలో ఉండగానే తండ్రిని కోల్పోయాడు. కేవలం మూడు నెలల వయస్సు ఉన్నప్పుడు తండ్రి సంజయ్ గాంధీ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఇది జరిగిన మరి కొద్ది కాలానికే నానమ్మ అయిన ఇందిరా గాంధీ అంగరక్షకుల తుపాకుల కాల్పులకు బలైంది. ఇతనిది భారతదేశంలోనే చెప్పుకోదగిన కుంటుంబం. [[1989]] నుండి ఐదేళ్ళ పాటు [[ఆంధ్ర ప్రదేశ్]] లోని [[చిత్తూరు]] జిల్లా [[మదనపల్లె]]లో సమీపంలోనున్న రిషీ వాలీ పాఠశాలలో విధ్యాభ్యాసం చేశాడు. ఉన్నత విద్య [[లండన్]] లో జరిగింది.
పంక్తి 27:
[[File:Varun Gandhi in a public meeting in Pilibhit.jpg|right|200px|thumb|<center>ఫిలిబిత్‌లో ఒక బహిరంగ సభలో వరుణ్ గాంధీ</center>]]
===కుటుంబ రాజకీయాలు===
భారతదేశంలోనే అతి ముఖ్యమైన రాజకీయ కుటుంబంలో జన్మించుటచే వరుణ్‌కు రాజకీయాలు వారసత్వంగా వచ్చినవే. తన నానమ్మ తాత అయిన [[ మోతీలాల్ నెహ్రూ‎]] భారత జాతీయోద్యమంలో ప్రముఖ పాత్ర వహించాడు. నానమ్మ తండ్రి [[జవహర్‌లాల్ నెహ్రూ‎]] జాతీయోద్యమ నేతనే కాకుండా భారత జాతీయ కాంగ్రెస్‌లో చురుగ్గా పాలుపంచుకొని పార్టీ అద్యక్ష పదవిని కూడా చేపట్టినాడు. స్వాతంత్ర్యానంతరం భారత తొలి ప్రధానమంత్రిగా సుధీర్ఘకాలం పనిచేశాడు. నానమ్మ ఇందిరాగాంధీ కూడా ప్రధానమంత్రి పదవిని నిర్వహించింది. ఇందిరా గాంధీ పాలనా సమయంలోనే వరుణ్ తండ్రి సంజయ్ గాంధీ కూడా రాజకీయాలలో చురుగ్గా వ్యవహరించాడు. 1980లో తండ్రి సంజయ్ గాంధీ మరణంతో సంజయ్ సోదరుడు [[రాజీవ్ గాంధీ‎]] రాజకీయాలలో ప్రవేశించి ఆ తరువాత ప్రధానమంత్రి పదవి కూడా చేపట్టినాడు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అద్యక్షురాలైన [[సోనియా గాంధీ‎]] రాజీవ్ భార్య. వరుణ్ తల్లి మేనకా గాంధీ కూడా సంజయ్ గాంధీ మరణం అనంతరం రాజకీయాలలో ప్రవేశించింది. ప్రారంభంలో సంజయ్ విచార్ మంచ్ పార్టీని స్థాపించింది. ఈ పార్టీ [[1984]] ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో [[తెలుగుదేశం]] పార్టీతో పొత్తు పెట్టుకొని ఐదు స్థానాలకు పోటీచేసి నాలుగు చోట్ల విజయం సాధించింది. ప్రస్తుతం మేనకా గాంధీ భారతీయ జనతా పార్టీ తరఫున లోకసభలోక్‌సభ సభ్యురాలిగా ఉంది.
 
===వ్యక్తిగత రాజకీయాలు===
[[2004]] సార్వత్రిక ఎన్నికలలోనే పోటీకి ఆసక్తి చూపిననూ వయస్సు అడ్డంకి రావడంతో విరమించుకున్నాడు. కాని దృష్టి మాత్రం రాజకీయాలపైనే సాగించాడు. ఉత్తర ప్రదేశ్ రాజకీయాలలో చురుకైన పాత్ర వహించి పలు సమావేశాలలో, పార్టీ మీటింగులలో పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే భాజపా కార్యనిర్వాహక సభ్యుడిగా నియమించబడ్డాడు. అప్పుడు తల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి వెళ్ళి ప్రజల పరిస్థితిని, కష్టాలను ప్రత్యక్షంగా గమనించాడు. ప్రజల కష్టాలు పరిశీలించి వారికి అప్పటికప్పుడు సహాయం కూడా చేశాడు. ఇవన్నీ రాజకీయంగా అతని ఎదుగుదలకు దోహదపడింది. [[2006]] లో [[మధ్య ప్రదేశ్]] లోని విదిశా లోకసభలోక్‌సభ ఉప ఎన్నికలలో పార్టీ టికెట్టు కోసం ప్రయత్నించిననూ లభించినట్టే లభించి చివరి క్షణంలో దూరమైంది. <ref>[http://www.hindu.com/2006/10/07/stories/2006100706301200.htm హిందూ ఆన్‌లైన్ ఎడిషన్ తేది 07-10-2006]</ref>2009 ఎన్నికలకై ఇదివరకు అతని తల్లి మేనకా గాంధీ ప్రాతినిధ్యం వహించిన ఫిలిబత్ లోకసభలోక్‌సభ స్థానంలో పోటీచేయడానికి పార్టీ టికెట్టు కూడా పొందినాడు. [[మార్చి 5]]న ఎన్నికల ప్రసంగంలో మతపరమైన ఉద్రేక ప్రసంగాలు చేసినందుకు ఎన్నికల కమీషన్ లోకసభలోక్‌సభ ఎన్నికలలో పోటీచేయడానికి అనర్హత విధించింది. వరుణ్‌కు పార్టీ టికెట్టు ఇవ్వరాదని భారతీయ జనతా పార్టీని ఆదేశించింది<ref>ఈనాడు దినపత్రిక, తేది 23-03-2009</ref>
 
==ఇటీవలి పరిణామాలు==
పంక్తి 56:
[[వర్గం:భారతీయ జనతా పార్టీ రాజకీయ నాయకులు]]
[[వర్గం:నెహ్రూ-గాంధీ కుటుంబం]]
[[వర్గం:15వ లోకసభలోక్‌సభ సభ్యులు]]
 
[[en:Varun Gandhi]]
"https://te.wikipedia.org/wiki/వరుణ్_గాంధీ" నుండి వెలికితీశారు