స్వాతిముత్యం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: new:स्वातिमुत्यम् (सन् १९८५या संकिपा)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
సినిమా అంతా ఫ్లాష్ బ్యాక్ లో నడుస్తుంది. శివయ్య ([[కమలహాసన్]]) కొడుకులు, తమ కుటుంబాలతో తల్లి,తండ్రి దగ్గరకు వస్తారు. లలిత([[రాధిక]]) ఆరోగ్యము బాగుండదు. శివయ్య మనవరాలు కధ రాయటానికి తండ్రి సహాయము కోరగా, తాతగారి కధను రాయమంటాడు.
 
పెద్దలను ఎదిరించి పెళ్ళి చేసుకున్న లలిత భర్తని పోగొట్టుకుని, అన్నగారు చలపతి ([[శరత్ బాబు]]), కొడుకులతో కలిసి అత్తగారింటికి వెడుతుంది. కోటీశ్వరుడైన మామగారు లోపలికి రానివ్వకుండా, బయటికి గెంటేస్తాడు. అన్నగారింటికి చేరిన లలితకి వదినగారి ([[వై.విజయ]]) సాధింపులు మొదలు అవుతాయి. వారు వున్న ఇంటి లోగిలిలోనే శివయ్య తన నాయనమ్మ ([[నిర్మలమ్మ]]) తో కలిసి ఉంటుంటాడు. చిన్నపిల్లవాడి మనస్తత్వము గల అమాయకుడు శివయ్య. లలిత పడుతున్న బాధలని తీర్ఛడానికితీర్చడానికి తన వంతు సహాయము చేద్దామని అనుకుంటాడు. ఆమె నిఆమెని పెళ్ళి చేసుకుని కొత్త జీవితము ఇవ్వటమే ఎవరైన ఆమెకు చేయగలిగే సహాయము అన్న నాయనమ్మ మాటలకి స్పందించి, శ్రీరామ నవమి పందిళ్ళప్పుడు ఆమె మెడలో తాళి కడతాడు.
 
నాయనమ్మ మరణం తరువాత, శివయ్య లలితని, కొడుకును తీసుకుని పట్నము వెళ్ళిపోతాడు. అక్కడ వారు అద్దెకు తీసుకున్న ఇంటి యజమాని([[గొల్లపూడి మారుతీరావు]]) లలిత మీద కన్నువేసి, శివయ్యని మగవాడు అన్నాక అడుక్కుని అయినా భార్యను పోషిచాలి అన్న మాటకు, ఉద్యోగ నిమిత్తము లలిత బయటికి వెళ్ళినప్పుడు, కొడుకుతో బిచ్చానికి వెడతాడు. అక్కడ తారసపడ్డ లలిత గురువు ([[జె.వి. సోమయాజులు]]) గారి ద్వారా గుడిలో ఉద్యోగము సంపాదిస్తాడు.
"https://te.wikipedia.org/wiki/స్వాతిముత్యం" నుండి వెలికితీశారు