స్త్రీ పర్వము ప్రథమాశ్వాసము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 137:
కృష్ణా ! అటు చూడు నా అల్లుడు దుస్సల భర్త జయద్రధుడు. [[అర్జునుడు]] చేసిన ప్రతిజ్ఞకు బలి అయిన అభాగ్యుడు. నాడు అరణ్యమున [[ద్రౌపది]] ని కామించిన నాడే సగం చచ్చాడు. కాని ఆ నాడు పాండవులు చెల్లెలి భర్త అని వదిలారు. ఈ నాడు చెల్లెలి భర్త అన్న కనికరం మాని చంపారు కదయ్యా ! పాపం దుస్సల భర్త శిరస్సు కొరకు వెదుక్కుంటుందయ్యా ! కుమార్తెను ఇలాంటి దుస్థితిలో చూడడం కంటే దురదృష్టం తల్లికి మరేమి కలదో చెప్పవయ్యా ! కృష్ణా ! నీకుయ్ తెలుసో లేదో [[అర్జునుడు]] ప్రతిజ్ఞ గురించి విన్న దుస్సల భర్తకు ఎంతగా నచ్చచెప్పిందో " అర్జునుడికి ఈ ముల్లోకాలలో తిరుగు లేదు. నా మాట విని [[ధర్మరాజు]] ను శరణు వేడిన అతడు నిన్ను తప్పక కాపాడగలడు " అని పరి పరి విధముల వేడుకున్నా ! [[సైంధవుడు]] వినక తన మరణమును తానే కొని తెచ్చుకున్నాడు. " ఏ శుభకార్యానికి వెళ్ళ లేకుండా చేసారని [[దుస్సల]] ఎంతగా పాండవులను నిందిస్తుందో వినవయ్యా ! కృష్ణా ! అయినా [[సైంధవుడు]] చేసిన అపరాధం ఏమిటి ? యుద్ధధర్మం ప్రకారం భీమ, నకుల, సహదేవ, [[ధర్మరాజు]] లను అభిమన్యుడికి సహకరించకుండా ఆపాడు. అయినా ! బాలుడైన [[అభిమన్యుడు]] యోధానుయోధులైన భీష్మ, ద్రోణ, కర్ణ, [[అశ్వత్థామ]], శల్యులను ఒంటరిగా ఎదుర్కోవడం అతడి దసుస్సాహసం కాదా ! అతడి తొందరపాటే అతడి మరణానిక్మి కారణమైంది. చంపిన వారిని వదిలి అడ్డగించిన సైంధవుడిని చంపుట న్యాయమా ! ధర్మమా అర్జునుడికే అది తెలియాలి. కృషా ! మహావీరుడైన [[శల్యుడు]] ధర్మనిరతిలో ధర్మరాజుతో సమానుడు అటూవంటి వాడు దుర్యోధన పక్షం చేరి కర్ణుడికి సారధ్యం వహించి అతడిని సూటి పోటీ మాటలతో వేధించి అతడి ధైర్యాన్ని నీరు కార్చి అతడి మరణానికి ఒక కారణమయ్యాడే ! అలాంటి శల్యుడూ మరణించక మాన లేదు. అతడి శల్యుని చుట్టూ చేరి అతడి బంధువులు ఎలా విలపిస్తున్నారో చూడవయ్యా ! కృష్ణా ! మహేంద్రుడిని కూడా గెలువగలిగిన భగదత్తుడిని చూడు అర్జునుడి మీద ప్రేమతో ఇతడిని దారుణంగా చంపింది నువ్వే కదా !
 
==== గాంధారి మిగిలిన వీరుల కొరకు రోదించుట ====
==== గాంధారి భీష్మ ద్రోణుల కొరకు రోదించుట ====
==== గాంధారి శకునిని నిందించుట ====