స్త్రీ పర్వము ప్రథమాశ్వాసము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 152:
==== గాంధారి కృష్ణుడిని నిందించి శపించుట ====
[[భీష్ముడు]], [[ద్రోణుడు]], [[కర్ణుడు]], [[అశ్వత్థామ]], భూరిశ్రవసువు, కృపుడు, [[సైంధవుడు]], [[కృతవర్మ]] నా కుమారుడు సుయోధనుడు వీరంతా అతిరధ మహారధులు. వీరందరితో యుద్ధం చేసి కూడా నువ్వు, నీ తమ్ముడు [[సాత్యకి]], పాండవులు నిరపాయంగా ఎలా బయట పడ్డారయ్యా ! మహాఆద్భుతంగా ఉంది కదూ ! నాకు నమ్మ బుద్ధి కావడం లేదు కృష్ణా ! . అపారమైన దైవ బలం ఉంటే కాని ఇది సాధ్యం కాదు. కాని ఆ దైవం కూడా దయమాలి నా నూరుగురు కుమారులకు అన్యాయం చేసిందంటే నా మనస్సు క్షోభిస్తుందయ్యా ! ఏమి చెయ్యగలను నా కుమారులందరిని పోగొట్టుకుని అనాధను అయ్యాను. ఈ ముదిమి వయస్సులో నాకు ఆసరాగా ఒక్క కొడుకుని కూడా మిగల్చలేదయ్యా ! ఆ [[భీముడు]]. [[భీముడు]] మాత్రం ఏమి చేస్తాడులే ! అంతా నేను నా కొడుకులు చేసుకున్న ప్రారబ్ధం. ఆ నాడు నువ్వు రాయబారానికి వచ్చినప్పుడు
విన్నట్లైతే ఇంత జరిగేదా ! నువ్వే కాదు [[భీష్ముడు]], [[విదురుడు]] కూడా ఎన్నో హితోక్తులు చెప్పారే ! నేను నా భర్త నాకుమారులు ఆమాటలు వినక పెడ చెవిన పెట్టి ఫలితం అనుభవిస్తున్నాము. కృష్ణా ! నాడు కురుసభలో నీవు పలికిన పలికులు నిజమైయ్యాయి. ఈ సర్వనాశనానికి నువ్వే కారకుడవు. ఊరకే హితవులు చెపుతూ కూర్చుని ఉండక
నువ్వు నా కుమారులు పాండవుల మీద అసూయతో చేస్తున్న అకృత్యములు ఆపే ప్రయత్నం ఎందుకు చేయ లేదు. నువ్వు తలచిన ఈ యుద్ధం ఆపలేక పోయే వాడివా !
నాడు కొలువులో ఎంత మంది పెద్దలు ఉన్నారు. మానవీయ వాక్చాతుర్యం కలిగిన వ్డవు ధర్మవేత్తవు నీవు ఉన్నావు. మీరందరూ కలసి ఈ ఘోరకలికి కారకులయ్యారు. కృష్ణా ! నీవు సుయోధనుడిని నాశనం చేయడానికి ఈ రాయబార నాటకం ఆడి ఎందరో రాజులను ఈ రణభూమికి బలి ఇచ్చావు. ఇందుకు ప్రతిగా అంతకు అంతా నువ్వు అనుభవిస్తావు కృష్ణా ! ఇదిగో ఇదే నీకు నా శాపం. నేను ణా జీవితాంతం సంపాదించుకున్న పాతివ్రత్య పుణ్యఫలాన్ని ఫణంగా పెట్టి పలుకుతున్నాను. నీవు ఎలాగైతే ఈ కురుక్షేత్ర సంగ్రామంలో దాయాదులను ఒకరి చేత ఒకరిని చంపించావో అలాగే నీ వారంతా తమలో తాము కలహించుకుని దారుణ మరణానికి గురి ఔతారు. నువ్వు కూడా సరిగ్గా నేటికి సరిగ్గా ఒక్క సంవత్సరం ముప్పై ఆరు దినములకు అతి కౄరంగా దిక్కు లేని చావు చస్తావు. నేడు నా వాళ్ళు ఎలా ఏడుస్తున్నారో నాడు నీ వాళ్ళు అలాగే భర్తలను, కుమారులను, బంధువులను పోగొట్టుకుని ఏడుస్తారు. ఇదే నా శాపం అనుభవించు " అని ఘోరంగా శపించింది [[గాంధారి]]. [[శ్రీకృష్ణుడు]] ఆ శాపాన్ని చిరునవ్వుతో స్వీకరించాడు.
 
==== గాంధారికి కృష్ణుడు సమాధానం చెప్పుట ====