"స్త్రీ పర్వము ప్రథమాశ్వాసము" కూర్పుల మధ్య తేడాలు

 
==== గాంధారికి కృష్ణుడు సమాధానం చెప్పుట ====
అమ్మా ! గాంధారీ ! నీవు ఈ రోజు ఇచ్చిన శాపం నాకు కొత్త కాదు. అది ఇంతకు ముందు ఉన్నదే. ఇది వరలో యాదవులు మహా మునిని అవహేళన చేసిన కారణంగా
ఆ మహాముని ఇదే విదంగా శపించాడు. నీ నోట ఆమాటలే ఈ రోజు వెలువడ్డాయి. యాదవులకు ఎవరి చేతిలోనూ చావు లేదు. అందు వలన వారు వారిలో వారు కలహించుకుని మాత్రమే అంతమొందగలరు. నీ శాపం అందుకు ఉపకరిస్తుంది " అని పలికాడు [[శ్రీకృష్ణుడు]]. ఆ మాటలు విని పాండవులు కంపించి పోయారు. [[శ్రీకృష్ణుడు]]
లేకున్న తాము జీవించి ఉండడం వృధా అనుకుని తమ జీవితముల మీద ఆశలు వదులుకున్నారు. అప్పుడు [[శ్రీకృష్ణుడు]] [[గాంధారి]] ని చూసి " అమ్మా ! ఇక లే ! చని పోయిన వారికి దహనక్రియలు జరిపించాలి " అని పలికాడు. [[గాంధారి]] పైకి లేచింది ఆమెను పట్టుకుని [[శ్రీకృష్ణుడు]] నడిపిస్తూ " అమ్మా ! నీకుమారుడు సుయోధనుడు, దుశ్శాసనుడు చేసిన దుర్మార్గపు పనులు నీవు ఎరుగవా ! నీకుమారుడి దుష్కృత్యములు నేను కానీ, భీష్ముడు కానీ, ద్రోణుడు కానీ , కడకు నీ భర్త ధృతరాష్ట్రుడు కాని మాన్పలేక పోయాము కదమ్మా ! వారి దుర్నయముల వలన కదమ్మా ! ఇంతటి చేటు దాపురించింది. అందుకు నన్ను నిందించి ప్రయోజనమేమిటి ! ఇక నైనా శోకం మాను. ఇలా శోకిస్తుంటే నీ శోకం రెండింతలు ఔతుంది. నీవు వీరమాతవు. మహా వీరులను పుత్రులుగా పొందావు. వారి మరణానికి శోకించ తగదు " అన్నాడు. ఈ మాటలకు [[గాంధారి]] చింతించడం మానుకుంది.
 
=== ధృతరాష్ట్ర ధర్మరాజులు ఉత్తర క్రియలు గురించి చర్చించుట ===
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/531918" నుండి వెలికితీశారు