స్త్రీ పర్వము ప్రథమాశ్వాసము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 162:
 
=== ధృతరాష్ట్ర ధర్మరాజులు ఉత్తర క్రియలు గురించి చర్చించుట ===
[[ధృతరాష్ట్రుడు]] [[ధర్మరాజు]] ను చూసి " కుమారా ! ఇరు పక్షముల లోని సైన్యముల లెక్క నీకు తెలుసు కదా ! ఇరి పక్షములలో సైన్యం ఎంత మంది మరణించారో చెప్పగలవా ! " అని అడిగాడు. [[ధర్మరాజు]] సమాధానంగా " తండ్రీ మన సైన్యంలో ఉత్తమ క్షత్రియులు 76 కోట్ల ఇరవై వేల మంది. మిగిలిన సైనికులు 24 వేల మంది యుద్ధంలో చని పోయారు. వీరందరూ యుద్ధంలో చనిపోయారు కనుక వీర స్వర్గం అలంకరించాడు. కాని కొంత మంది భయపడి పారి పోయారు. వారు గుహ్యక లోకానికి వెళతారు. కాని యుద్ధంలో ఏవిధంగా మరణించినా నరక లోకముకు వెళ్ళరు " అన్నాడు [[ధర్మరాజు]]. [[ధృతరాష్ట్రుడు]] " ధర్మజా ! యుద్ధంలో చనిపోయిన వారిలో అనాధలు అయిన వారు ఉన్నారు కదా ! వారికి అగ్ని కార్యం చెయ్యడంలో తప్పేమి లేదు కదా ! " అని అడిగాడు. [[ధర్మరాజు]] " మహారాజా ! ఈ యుద్ధమే ఒక మహా యజ్ఞం. ఈ మహా యజ్ఞంలో ఆహుతి అయిన వారందరూ అగ్ని కార్యముకు అర్హులే ! ఇక్కడ మరణించిన అనాధలకు అగ్ని కార్యం నెరవేర్చి ఉత్తమ గతులు ప్రాప్తించేలా చేద్దాము " అని పలికాడు.
==== యోధులకు దహన క్రియలు జరిపించుట ====
[[ధర్మరాజు]] వెంటనే [[విదురుడు]], [[సంజయుడు]], తన పురోహితుడు ధౌమ్యుడిని పిలిపించి భరత వంశ సంజాతకులకు తప్ప మిగిలిన వారికి దహనసంస్కారం చెయ్యమని చెప్పి అందుకు కావలసిన చందనము, అగరు, కస్తూరి మొదలైన సుగంధ ద్రవ్యములను తదితర సామగ్రిని కావలసిన మనుషులను అప్పగించాడు. తరువాత [[ధర్మరాజు]]
బ్రాహ్మణ సంఘాల తోడ్పాటుతో దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శల్య మొదలైన వారికీ అభిమన్య, ఘటోత్కచ, విరాట, దుష్టకేతు వంటి ప్రముఖులకు నానాదేశాధీశులకు చితులు పేర్పించి అగ్ని కార్యం నిర్వహించాడు. అనాధలుగా మిగిలిన రాజుల కళేబరములకు వేలకు వేలుగా ప్రోగులుగా పెట్టించి సామూహిక దహన క్రియ జరిపించాడు. అందుకు కావలసిన కట్టెలు దొరకక విరిగిన రధములు, బాణములు, ధనస్సు మొదలైనవి సేకరించి దహన క్రియ నిర్వహించాడు. తరువాత [[ధర్మరాజు]] [[ధృతరాష్ట్రుడు]] అంతఃపుర కాంతలతో కలిసి స్నానములు ఆచరించారు. కౌరవులందరికీ [[ధృతరాష్ట్రుడు]] తర్పణములు విడిచాడు.
 
=== అగ్ని కార్య నిర్వహణ ===