"స్త్రీ పర్వము ప్రథమాశ్వాసము" కూర్పుల మధ్య తేడాలు

చి
 
=== కుంతీ దేవి కర్ణుడు తన కుమారుడని చెప్పుట ===
ఆ సమయంలో కుంతీ దేవి కన్నీటితో అందరూ వింటుండగా " అయ్యా ! అందరూ వినండి. కౌరవులకు పెట్టని కోటగా విరాజిల్లిన [[కర్ణుడు]] రాధేయుడిగా లోకానికి తెలిసి ప్రసిద్ధి చెందిన [[కర్ణుడు]] నిజంగా రాధేయుడు కాదు. [[కర్ణుడు]] నా కుమారుడు, కౌంతేయుడు మీకందరికి అగ్రజుడు. నేను కన్యగా ఉన్నప్పుడు మంత్ర ప్రభావం వలన భాస్కర ప్రభావంతో సహజ కవచ కుండల శోభితుడు [[కర్ణుడు]] జన్మించాడు. కనుక మీరు కర్ణుడికి తిలోదకాలు ఇవ్వండి " అని ధర్మరాజుతో చెప్పింది.
==== ధర్మరాజు కర్ణుడి మరణానికి విలపించుట ====
ఆ మాటలకు [[ధర్మరాజు]] వివశుడయ్యాడు.మిగిలిన వారు అమిత దుఃఖముకు లోనయ్యారు. [[ధర్మరాజు]] ఎలాగో మాట పెగల్చుకుని " అమ్మా ! [[కర్ణుడు]] నీకు జ్యేష్ట పుత్రుడు, మాకు అన్నగారు కొంగున నిప్పు కట్టుకున్న చందాన ఈ నిజం ఇంత కాలం ఎలా దాచావమ్మా ! ఈ లోకములో ఒక్క [[అర్జునుడు]] తప్ప కర్ణుడిని గెలువగలవారెవ్వరు. అమ్మా ! కర్ణుడిని తొలి చూలిగా ఎందుకు కన్నావమ్మా ! నీకు దుర్వాసుడు ఇచ్చిన శాపం మా పట్ల శాపంగా పరిణమించి మాకు అంతు లేని శోకాన్ని మిగిల్చింది కదమ్మా ! అమ్మా ! [[అభిమన్యుడు]] మరణించినప్పుడు కూడా ఇంత దు!హ్ఖం పొంద లేదమ్మా ! ద్రుపదుడి కుమారులు, ధృతరాష్ట్రుడి కుమారులు చని పోయినప్పుడు కూడా ఇంతటి వ్యధ చెంద లేదు కదమ్మా ! అమ్మా [[కర్ణుడు]] మా అన్న అని తెలిసిన ఈ యుద్ధం జరిగేది కాదు ఈ మారణ హోమం జరిగేది కాదు కదమ్మా ! "
అని పరి పరి విధముల వాపోయాడు [[ధర్మరాజు]]. వెంటనే [[ధర్మరాజు]] కర్ణుడి గోత్ర నామాలు చెప్పి తిలోదకాలు ఇచ్చాడు. తరువాత భీమ, అర్జున, నకుల, సహదేవులు కూడా తిలోదకాలతో తర్పణములు వదిలారు. [[కర్ణుడు]] కుంతీ కుమారుడు అని తెలియగానే పాండ, కౌరవ కాంతలలో హాహాకారాలు చెలరేగాయి. [[ధృతరాష్ట్రుడు]] కూడా [[గాందారి]] తో చేరి కుంతీ దేవితో కలిసి ఉదక కర్మ చేయించాడు. వెంటనే [[ధర్మరాజు]] కర్ణుని పట్ల సోదర భావంతో కర్ణుడి భార్యలను అతడి బంధువులను పిలిపించి సముచిత రీతిని గౌరవించి ఓదార్చాడు. వారితో కర్ణుడికి ఉత్తమ లోక ప్రాప్తి కొరకు అనేక దానధర్మములు చేయించాడు. తరువాత బంధు, మిత్రులు అందరితోకలిసి [[ధరమరాజు]] గంగా నదిని దాటి అక్కడ అనేక దానధర్మములు చేయించాడు.
 
=== వనరులు ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/531931" నుండి వెలికితీశారు