మకరరాశి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
=== మకర లగ్నస్థ గ్రహాలు ===
మకర లగ్న జాతకులు నియమానుసారంగా నడచుటకు ఆసక్తి చూపుతారు. వీరు సన్నగా ఉంటారు, కొంచం మొరటు స్వభావం కలిగి ఉంటారు. వారి స్వ విషయంలో ఇతరుల జోక్యం వీరు సహించరు. వివాహ విషయంలో కొంచం వివాదాలు ఉంటాయి.మకర లగ్నస్థ గ్రహ ఫలితాలను కింద చూడ వచ్చు.
* సూర్యుడు :- మకరలగ్నానికి సూర్యుడు అష్టమాధిపతి. అష్టమాధిపతి లగ్నంలో ఉండడం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తుటకు అవకాశం ఉంది. ఎముకల నొప్పి, ఉదర సంబంధ రోగములు కలిగే అవకాశం ఎక్కువ. నేత్ర వ్యాధులలు కలుగుతాయి. పేరాశ, స్వార్ధ చింతన ఎక్కువ. సూర్యుడు తన శత్రు స్థానమున ఉండడం కారణంగా జీవితంలో కఠిన పరిస్తితిని ఎదుద్కో వలసి వస్తుంది. కటిన పరిస్థితులలోఆత్మబలంతో పరిశ్రమతో విజయం సాధిస్తారు. గృహస్థ జీవితంలో ఓడి దుడుకులు ఉంటాయి. వ్యాపారం చేయాలన్న కోరిక ఉద్యోగం చేయాలన్న ఆసక్తి కలగలుపుగా ఉంటాయి.
* చంద్రుడు :- మకర లగ్నంలో చంద్రుడు సప్తమాధిపతి. శత్రు రాశిలో లగ్నస్థ చంద్రుడు వ్యక్తికి సఒందర్యం ఇస్తాడు. కాని చంద్రుడు శత్రు స్థానంలో ఉన్న కారణంగా విచిత్ర మనస్తత్వం ఉంటుంది. నేత్రములు, చెవుల అందు వ్యాధులు ఉంటాయి. చంద్రుడు లగ్నం నుండి సప్తమ స్థామును మీద దృష్టి సారించడం వలన జీవిత భాగస్వామి అందం, గుణం కలిగి ఉండును. జీవిత భాగ స్వామితో అన్యోన్యం అనుకూలత కలిగి ఉంటారు.
* కుజుడు :- మకర లగ్నానికి కుజుడు సుఖాధిపతి మరియు లాభాధిపతి ఔతాడు. కుజుడు లగ్నంలో ఉంటే ఆవ్యక్తి క్రోధ స్వభావం కలిగి ఉంటాడు. తండ్రి వైపు బంధువుల
సహకారం లభిస్తుంది. తండ్రి వలన పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. శని ప్రభావంగా తండ్రి వైపు ఆస్థులు త్యాగం చేయవలసిన పరిస్థితి సంభవించగలదు. లగ్నస్థ కుజుడు నాలుగు, ఏడు, ఎనిమిది స్థానాల మీద దృష్టి సారిస్తాడు కనుక ధార్మిక ఉంటుంది. కుటుంబ జీవితంలో కలతలు కలుగుతాయి.
* బుధుడు :- మకర లగ్నానికి బుధుడు షటమ మరియు నవమాధిపతి ఔతాడు. మకర లగ్నస్థ బుధుడు వ్యక్తికి జ్ఞానం, బుద్ధికుశలత కలిగి ఉంటాడు. వీరికి దైవ భక్తి, దయా స్వభావం, కళాభిరుచి కలిగి ఉంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు, ధనం ప్రాప్తిస్తాయి. సప్తమ స్థానం మీద బుధ దృష్టి ఫలితంగా జీవిత భాగస్వామి అందంగా ఉండును. షష్టామాధిపతి దృష్టి క్లారణంకా భార్యాభర్తల మధ్య విభేదాలు ఉంటాయి. సంతానం కలగడానికి జాప్యం కలుగ వచ్చు.
* గురువు :- మకర లగ్నానికి గురువు తృతీయ వ్యయ స్థానాలకు ఆధిపత్యం వహిస్తాడు కనుక గురువు ఈ లగ్నానికి అకారక గ్రహం ఔతాడు. లగ్నస్థ గురువు వ్యక్తికి జ్ఞానం, సుగుణం కలిగి ఉంటాడు. వీరికి క్షమాగుణం మెండు. అయినా వీరు వారి యోగ్యతను గుణమును సద్వినియోగపరచ లేరు. ఇతరుల కలతలు వీరిని ప్రభావితంచేస్తాయి కనుక కొన్ని సమస్యలను ఎదుకొంటారు. లగ్నస్థ గురువు పంచమ, సప్తమ, నవమ స్థానాల మీద దృష్టి సారిస్థాడు కనుక వివాహానంతరం అదృష్టం ప్రాప్తిస్తుంది.
 
{{తెలుగు పంచాంగం}}
"https://te.wikipedia.org/wiki/మకరరాశి" నుండి వెలికితీశారు