మకరరాశి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
* శుక్రుడు :- మకర లగ్నానికి పంచమ, సప్తమ, దశమ స్థానాలకు కారకత్వం వహిస్తాడు. మకర లగ్నానికి శుక్రుడు శుభుడు. మకర ల్;అగ్నస్థ శుక్రూడి కారణంగా వ్యక్తి అందం, బుద్ధి కుశలత కలిగి ఉంటాడు. లగ్నస్థ శుక్రుడు వీరిని విలాసవంతులు, స్వార్ధపరులుగా చేస్తుంది. తమ అవసరానికి అనుగుణంగా బుద్ధిని మార్చుకుంటారు. వీరు అవసరార్ధం మిత్రులను కలిగి ఉంటారు. స్త్రీలైన పురుషుల పట్ల పురుషులైన స్త్రీల పట్ల ఆకర్షితులు ఔతారు. సప్తమ స్థానమైన కటక రాశి మీద శుక్రుడి దృష్టి పడటం కారణంగా వీరి మీద జీవిత భాగస్వామి ప్రేమను అప్యాయతను కలిగి ఉంటారు. జీవిత భాగస్వామి సుఖ దుఃఖంలో సహాయ సహకారలను అందిస్తారు.
* శని :- మకర లగ్నస్థ శని లగ్నాధిపతి, ద్వితీయ స్థానాలకు ఆధిపత్యం వహిస్తూ కారక గ్రహం ఔతాడు. ఈ కారణంగా ఈ వ్యక్తి భాగ్యశాలి కాగలడు. ఆకర్షణీయమైన బలిష్టమైన శరీరాకృతి కలిగి ఉంటాడు. ఉద్యోగ వ్యాపారాలలో సాఫల్యం లభిస్తుంది. ఆకర్షణీయముగా మాట్లాడ లేరు. ప్రభుత్వ సేవారంగంలో పని చేసే అవకాశాం లభిస్తుంది. తల్లితో చక్కని సంబంధ బాంధవ్యాలు ఉంటాయి.శని తృతీయ, సప్తమ, దశమ దృష్టి కారణంగా జీవిత భాగస్వామికి కష్టాలు ప్రాప్తిస్తాయి. వైవాహిక జీవితంలో కలతలు ఉంటాయి.
* రాహువు :- మకర లగ్నంలో రాహు స్థితి కారణంగా అనవసర తిరుగుడు అధికం. కార్య హాని జరగడానికి అవకాశం ఎక్కువ. అనుకున్న కార్యాలు సాధించడంలో సమయలు తలెత్తుతాయి. వ్యాపారంలో ఆసక్తి ఉన్నా ఉద్యోగమే లాభదాయకంగా ఉంటుది. వ్యవసాయంలో సమస్యలు కష్టములు అధికంగా కలుగుతాయి. లగ్నస్థ రాహువు సప్తమ దృష్టి కారణంగా సంసార జీవితంలో జీవిత భాగస్వామి నుండి మిత్రుల నుండి తగిన సహకారం లభించదు.
* కేతువు :- మకర లగ్నంలో ఉన్న కేతువు ఆరోగ్య సమస్యలకు హేతువు ఔతాడు. అన్ని సమయములలో అన్వేక కష్టములను ఎదుర్కొంటారు. శత్రువుల వలన హాని కలుగుతుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టల కొరకు అనుచిత కార్యముల చేసి అపజయం పాలు ఔతారు. లగ్నస్థ కేతువు స్ర్తీలకు పురుషుల అందు పురుషులకు స్త్రీల అందు విపరీత ఆకర్షణ కలిగి ఉంటారు. సప్తమ స్థానం మీద కేతు దృష్టి కారణంగా భాగస్వామికి కష్టాలు కలుగుతాయి. భాస్వామి సహాయ సహకారాలు లభించవు.
{{తెలుగు పంచాంగం}}
"https://te.wikipedia.org/wiki/మకరరాశి" నుండి వెలికితీశారు