అంపశయ్య నవీన్: కూర్పుల మధ్య తేడాలు

చి 117.195.209.95 (చర్చ) చేసిన మార్పులను, వైజాసత్య వరకు తీసుకువెళ్ళా�
చి Bot: replacing outdated link thehindu.com with hindu.com
పంక్తి 2:
'''అంపశయ్య నవీన్''' గా పేరొందిన బొందల మల్లయ్య నేటి ప్రముఖ [[తెలుగు]] రచయితల్లో ఒకరు. ఇతడు [[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు]] గ్రహీత. ఆర్ధిక శాస్త్ర ఆచార్యుడైన నవీన్, [[1941]]లో [[వరంగల్]] జిల్లా, [[వావిలాల]] గ్రామములో జన్మించాడు. కరీంనగర్, వరంగల్లు లో లెక్చరర్ గా పనిచేశారు. [[చైతన్య స్రవంతి]] శిల్పం తో ప్రభావితమయ్యారు. అంపశయ్య, చీకటిరోజులు, ముళ్ళపొదలు నవలల్ని రచించారు. ఈ మూడు నవలలో కథానాయకుని పేరు రవి కావడంతో, మూడింటిని కలిపి రవిత్రయ నవలలు అని వ్యవహరిస్తారు. 1969లో ఈయన వ్రాసిన అంపశయ్య నవల ఎంతగా విజయవంతమైందంటే, ఈయన అప్పటి నుండి అంపశయ్య నవీన్ గా పేరొందాడు. ఈయన కథలు అనేకం హిందీ, ఇంగ్లీషు, తమిళ, కన్నడ, మరాఠీలలోకి అనువదించబడ్డాయి.<ref>http://www.cpbrownacademy.org/Rendu_kavalandi.asp</ref>
 
బాల్యంలో పిల్లవాడిగా నవీన్ వరంగల్లో జరిగిన 11వ [[ఆంధ్ర మహాసభ (తెలంగాణ)|ఆంధ్రమహాసభ]]ను చూశాడు. ఆ సభ ప్రారంభోత్సవంలో వేడుకగా అలంకరించిన బండిని 11 జతల ఎద్దులతో నడిపిస్తూ వీధుల వెంట ఉత్సవంగా ఊరేగించి అందులో సభాప్రముఖులను ప్రాంగణానికి చేరవేసిన సన్నివేశం నవీన్ పై చెరగని ముద్రవేసింది. యువకునిగా సాహిత్వంతో పరిచయమేర్పడినప్పుడు, ఈ ఊరేగింపు సన్నివేశం ప్రారంభ సన్నివేశంగా ఒక్క పెద్ద నవలను వ్రాయలని అనుకున్నాడు. అదే కాలరేఖలు నవలకు బీజం వేసింది <ref>{{cite news|publisher=The Hindu|url=http://www.thehinduhindu.com/2006/09/17/stories/2006091705640200.htm|title=No life without literature, says `Ampasayya' Naveen|date=2006}}</ref> 1996 లో కళాశాల అధ్యాపక వృత్తికి పదవీవిరమణ చేశాక నవీన్ ఈ నవలను రాయడం మొదలు పెట్టాడు. కాలరేఖలు 1944 నుండి 1995 వరకు తెలంగాణా ప్రాంతపు సామాజిక, రాజకీయ, సాంస్కృతిక చరిత్రకు అద్దంపడుతుంది. 1600 కు పైగా పేజీలున్న ఈ గ్రంథాన్ని పాఠకుల సౌలభ్యం కోసం “కాలరేఖలు”, “చెదిరిన స్వప్నాలు”, “బాంధవ్యాలు” అనే నవలాత్రయంగా విడుదల చేశారు.<ref>[http://www.eemaata.com/em/issues/200701/1055.html నేనూ నా రచనలు - అంపశయ్య నవీన్] ఈమాట జనవరి 2007 సంచిక</ref> 2004లో కాలరేఖలు రచనకు, అంపశయ్య నవీన్ సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నాడు.
 
నవీన్‌ అసలు పేరు బొందల మల్లయ్య. తొలి రోజుల్లో ఆ పేరుతోనే అనేక రచనలు చేశారు. అయితే వాటిల్లో చాలావరకు అచ్చుకాలేదు. తన ప్రియమిత్రుడు [[వరవరరావు]] సలహామేరకు తన పేరును నవీన్‌గా మార్చుకొన్నారు.<ref>[http://www.eenadu.net/sahithyam/display.asp?url=main205.htm ఈనాడులో నవీన్ ఫై చీకోలు సుందరయ్య వ్యాసం]</ref>
"https://te.wikipedia.org/wiki/అంపశయ్య_నవీన్" నుండి వెలికితీశారు