మేషరాశి: కూర్పుల మధ్య తేడాలు

riki
పంక్తి 15:
* శని :- మేష లగ్నానికి శని దశమ, ఏకాదశాధిపత్యం వహిస్తాడు. మేష లగ్నానికి శని మిశ్రమ ఫలితాలను ఇస్తాడు. మేష లగ్నస్థ శని కారణంగా వ్యక్తి సన్నగా కోపస్వభావితుడై ఉంటాడు. లగ్నస్థ శని తృతీయ దృష్టి కారణంగా సోదరుల నుండి సహాయ సహకారాలు అందవు. సపమ దృష్టి కారణంగా బంధి మిత్రుల సహాకారం బాధిస్తుంది. జీవిత భాగస్వామి చెడు మనస్తత్వం కలిగి ఉండే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపారాలలో అస్థిరత ఉంటుంది. లగ్నస్థ శని శుభగ్రహ చేరిక దృష్టి కలిగిన శుభఫలితాలు ఉంటాయి.
* రాహువు :- మేషలగ్నస్థ రాహువు వ్యక్తికి ఆత్మవిశ్వాసం కలిగిస్తాడు. వీరికి ఉదర సంబంధ వ్యాధులు ప్రాప్తిస్తాయి. జీవితంలో చాలా సంఘర్షణ ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో అతి కష్టం మీద సఫలత సాధిస్తారు. వ్యాపారం చేయాలన్న కోరిక ఉన్నా ఉద్యోగంలో సఫలత సాధిస్తారు. రాహువు దృష్టి వలన సప్తమ స్థానం బాధించబడి జీవిత భాగస్వామి రోగగ్రస్థుడౌతాడు. వైవాహిక జీవితంలో సుఖం లోపిస్తుంది. మిత్రుల సోదరుల సహాయ సహకారాలు అందడం కష్టం.
* కేతువు :- మేష లగ్నస్థ కేతువు వ్యక్తిని శక్తి శాలిని చేస్తాడు. సాధారణంగా వీరు రోగరహిత జీవితాన్ని గడుపుతారు. వీరిలో సాహసం, ఆత్మవిశ్వాసం మెండు. కనుక వీరు శత్రు భయంకరులుగా ఉంటారు. సమాజంలో గౌరవం ఖ్యాతి కలిగి ఉంటారు. రాజనీతి, కుటిల నీతి అందు సఫలత సాధిస్తారు. తల్లి, తండ్రుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. జీవితభాగస్వామి నుండి సంతానం నుండి కష్టములు ఎదుర్కొంటారు.
* కేతువు :-
 
"https://te.wikipedia.org/wiki/మేషరాశి" నుండి వెలికితీశారు