గణపతి దేవుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
==రాజ్యవిస్తరణ==
===తీరాంధ్రవిజయము===
గణపతిదేవుడు రాజ్యవిస్తరణకు ప్రాధాన్యత ఇచ్చాడు. ఇందుకోసం సైనిక బలంపైనే కాకుండా సరిహద్దు రాజ్యాల రాజకుటుంబాలతో సంబంధాలుపెట్టుకున్నాడు. 1201లో జరిగిన మొదటి దండయాత్ర లో బెజవాడ స్వాధీనము చేసుకున్నాడు. అటునుండి దివిసీమకు మరలాడు. అచట అయ్య వంశమునకు చెందిన పినచోడి పాలిస్తున్నాడు. తీవ్ర ప్రతిఘటన అనంతరము పినచోడి లొంగిపోయాడు. పినచోడి కూతుళ్ళు నారమ్మ, పేరమ్మలను గణపతి వివాహమాడి, కొడుకు జాయప సేనాని ని కాకతీయ గజసైన్యాధికారిగా నియమిస్తాడు. దీనితో వెలనాడు కాకతీయ రాజ్యములో కలిసిపోయింది. 1209 ఇడుపులపాడు (బాపట్ల తాలూకా) శాసనము ప్రకారము [[కమ్మనాడు]], [[వెలనాడు]] ఈ దండయాత్రలో జయించబడ్డాయి. 1212లో తూర్పు తీరంపై దండయాత్ర చేసి కృష్ణా, గోదావరి గుంటూరులను స్వాధీనం చేసుకున్నాడు.నిడదవోలును పాలిస్తున్న వేంగీచాళుక్య రాజు వీరభద్రుడికి తన కూతురు రుద్రమదేవినిచ్చి వివాహం చేశాడు. మరో కూతురు గణపాంబను ధరణికోట రాజు బేతరాజుకు ఇచ్చి వివాహం జరిపించాడు. . నెల్లూరును జయించి మనుమసిద్ధికి ఇచ్చాడు. దాదాపు రాయలసీమ మొత్తం గణపతిదేవుని పాలనలోకి వచ్చింది. శాతవాహనుల అనంతరం తెలుగు ప్రాంతాన్నంతటినీ ఏకఛత్రాధిపత్యంలోకి తెచ్చినాడు.<ref><[http://www.aponline.gov.in/Quick%20Links/Hist-Cult/history_medieval.html www.aponline.gov.in/history medieval]</ref> గణపతి దేవునికి కుమారులు లేనందున ఇతని అనంతరం కూతురు [[రుద్రమదేవి]] అధికారంలోకి వచ్చింది.<ref>[http://www.telangana.com/History/kakatiyas.htm www.telangana.com/History/kakatiyas]</ref>
 
===దక్షిణదేశ దండయాత్ర===
"https://te.wikipedia.org/wiki/గణపతి_దేవుడు" నుండి వెలికితీశారు