తుమకూరు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: war:Tumkur
చి యంత్రము మార్పులు చేస్తున్నది: en:Tumkur; cosmetic changes
పంక్తి 24:
'''తుమకూరు''' ({{lang-kn|ತುಮಕೂರು}}), ఇది వరకు తుమ్కూరుగా పిలవడిన ఈ నగరం [[దక్షిణ భారతదేశం]]లోని [[కర్ణాటక]] రాష్ట్రములోని ఒక ప్రముఖ నగరం. ఇది తుముకూరు జిల్లా ముఖ్యపట్టణం.
 
== పేరు వ్యుత్పత్తి ==
వ్యుత్పత్తి ప్రకారం '''తుమకూరు''' ఇక్కడ విరివిగా కనిపించే తుంబె పువ్వు మీదుగా తుంబె ఊరు అన్న వాడుకనుండి వచ్చిందని భావిస్తారు. లేదా తమాటె ఊరు నుండి వచ్చిందని మరో అభిప్రాయం (ఇక్కడ పూర్వం ఉపయోగించేవారని భావిస్తున్న తమాటె ఒక డప్పు వాయిద్యము). ఈ నగరానికి కొబ్బరికాయల నగరం అని కూడా పేరు.
 
== భౌగోళిక స్వరూపం ==
తుమకూరు {{coord|13.34|N|77.1|E|}} అక్షాంశరేఖాంశాల వద్ద ఉన్నది.<ref>[http://www.fallingrain.com/world/IN/19/Tumkur.html Falling Rain Genomics, Inc - Tumkur]</ref> సముద్ర మట్టం నుండి ఈ నగరపు సరాసరి ఎత్తు 822&nbsp;మీటర్లు (2696&nbsp;అడుగులు). తుముకూరు నగరం యొక్క వాతావరణం బెంగుళూరును పోలి ఉంటుంది. బెంగుళూరుకు వాయువ్యాన 43 మైళ్ళ దూరములో ఉన్న ఈ నగరంలో దక్షిణ రైల్వే విభాగంలో భాగమైన రైల్వేస్టేషను ఉన్నది.
 
== గణాంకాలు ==
2001 భారత జనాభా లెక్కల ప్రకారం<ref>{{GR|India}}</ref>, తుమకూరు 2,48,592 మంది జనాభా కలిగి ఉన్నది. అందులో 52% పురుషులు, 48% స్త్రీలు. తుముకూరు ప్రజల సగటు అక్షరాస్యత 75% (జాతీయ సరాసరి 59.5% కంటే అధికం). పురషులలో అక్షరాస్యత 79%. స్త్రీలలో అక్షరాస్యత 70‍%. 11% జనభా 6 సంవత్సరాలు లేదా అంతకంటే పిన్నవయస్కులు.
 
== ఆర్ధికరంగం ==
ఇక్కడ పండించే ప్రధాన పంటలు చిరుధాన్యాలు, వరి, పప్పుదినుసులు, పోకచెక్కలు మరియు నూనెగింజలు. పరిశ్రమలలో ముతక నూలు వస్త్రాలు, ఉన్ని కంబళ్ళు, తాళ్ళు, గడియారాలు (హిందుస్తాన్ మెషీన్ టూల్స్), విప్రో, టి.వి.ఎస్.ఈ మరియు కార్‌మోబిల్స్ ముఖ్యమైనవి. తుముకూరు పరిసరాల్లోని క్యాట్‌సండ్రలో సిద్ధగంగ మఠము ప్రసిద్ధమైనది. ఇక్కడ దేశములోని వివిధ ప్రాంతాలకు చెందిన 8000కు పైగా విద్యార్ధులు వివిధ సిద్ధగంగ సంస్థలలో విద్యనభ్యసించుచున్నారు. ఈ మఠానికి అనుబంధంగా ఒక ఇంజనీరింగు కళాశాల (సిద్ధగంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) కూడా ఉన్నది. ఇటీవల సిద్ధగంగ మఠం నూరు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రస్తుత మఠ నిర్వాహకుడు శివకుమార్ స్వామీజీని కర్ణాటక రాష్ట్రప్రభుత్వం ''కర్ణాటక రత్న'' పురస్కారంతో సత్కరించింది.
 
కర్ణాటక అర్ధశతోత్సవం "సువర్ణ కర్ణాటక" పురస్కరించుకొని తుమ్కూరు యొక్క అధికారిక నామాన్ని తుమకూరుగా మార్చారు. కేంద్ర ప్రభుత్వం ఈ మార్పును ఇంకా ఆమోదించలేదు. 80% శాతం రాష్ట్ర జనాభా రాష్ట్ర రాజధాని అయిన బెంగళూరు చేరటానికి తుమకూరు గుండా ప్రయాణించటం విశేషం.
 
== జిల్లాలో తాలూకాలు ==
తుముకూరు జిల్లాలో 10 తాలూకాలున్నాయి. అవి గుబ్బి, తిప్తూరు, మధుగిరి, పావ్‌గడ, కొరట్‌గేరె, సీరా, తురువెకేరె, చిక్కనాయకనహళ్ళి, కునిగళ్ మరియు తుమకూరు.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
{{కర్ణాటక జిల్లాలు}}
 
[[వర్గం:కర్ణాటక]]
[[వర్గం:కర్ణాటక జిల్లాలు]]
[[వర్గం:కర్ణాటక నగరాలు మరియు పట్టణాలు]]
 
[[en:TumakuruTumkur]]
[[kn:ತುಮಕೂರು]]
[[bn:তুমকুর]]
"https://te.wikipedia.org/wiki/తుమకూరు" నుండి వెలికితీశారు