పులికాట్ సరస్సు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: kn:ಪುಲಿಕಾಟ್ ಸರೋವರ; cosmetic changes
పంక్తి 1:
{{విస్తరణ}}
[[బొమ్మదస్త్రం:Blue sail on Pulicat Lake.jpg|right|thumb|పులికాట్ సరస్సులో పడవ]]
[[ఆంధ్రప్రదేశ్]] లోని అతిపెద్ద సరస్సుల్లో '''పులికాట్ సరస్సు''' ఒకటి. ఇది ఉప్పునీటి సరస్సు. సముద్రపు నీరు, మంచి నీరు కలగలిసి ఉండటం వలన సముద్రపు నీరంత ఉప్పగా ఉండదు. దీని అసలు పేరు '''''ప్రళయ కావేరి'''''. అది పులికాటుగా మారింది. [[తమిళనాడు]], ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాల్లో దాదాపు 250 చ.కి.మీ. వైశాల్యంలో వ్యాపించి ఉంది. వర్షాకాలంలో ఇది 460 చ.కి.మీ. వరకు పెరుగుతుంది. భారతదేశ కోరమాండల్ తీరములో [[చిల్కా సరస్సు]] తర్వాత రెండవ అతిపెద్ద లగూన్. [[శ్రీహరికోట]] ద్వీపము పులికాట్ సరస్సును బంగాళా ఖాతము నుండి వేరు చేస్తున్నది. పులికాట్ సరస్సు యొక్క దక్షిణపు ఒడ్డున తమిళనాడు రాష్ట్రములోని [[తిరువళ్ళువర్ జిల్లా]]లో [[పులికాట్ పట్టణం]] ఉన్నది.
[[బొమ్మదస్త్రం:Dutch cemetery in pulicat town.jpg|right|thumb|పులికాట్ పట్టణములో డచ్చివారి చారిత్రాత్మక శ్మశానవాటిక]]
పులికాట్ సరస్సు 60 కిలోమీటర్ల పొడవు మరియు ప్రదేశాన్ని బట్టి 0.2 నుండి 17.5 కిలోమీటర్ల వెడల్పు ఉన్నది.
 
[[నెల్లూరు]] జిల్లాలో [[శ్రీ కాళహస్తి]]కి 27 కి.మీ. దూరంలో ఉన్న ఈ చెరువు ఎన్నో జాతుల పక్షులకు, ప్రకృతి సంపదకు నిలయం.
== చరిత్ర ==
ఒకటవ శతాబ్దానికి చెందిన ఒక అనామక రచయిత రాసిన Periplus of the Erythraean Sea అనే గ్రంథంలో పులికాట్ ను భారతదేశ తూర్పు తీరం వెంబడి ఉన్న మూడు ఓడరేవుల్లో ఒకటి గా పేర్కొన్నాడు. రెండవ శతాబ్దంలో టాలెమీ పొందుపరిచిన ఓడరేవుల జాబితాలో ఇది కూడా ఉంది.
 
13 వ శతాబ్దంలో మక్కాలో కొత్తగా నియమితులైన ఖలీఫాకు కప్పం కట్టడానికి నిరాకరించడంతో వారిని అక్కడ నుంచి బహిష్కరించడంతో వారు నాలుగు ఓడల్లో పడవల్లో బయలు దేరి ఈ తీరానికి వలస వచ్చారు. తర్వాత పోర్చుగీసు వారు ఈ ప్రాంతంలో 1515 ప్రాంతంలో ఒక చర్చి ని కూడా నిర్మించారు. దాని తాలూకు శిథిలాలు నేటికీ ఈ ప్రాంతంలో కనిపిస్తాయి. తర్వాత డచ్ వారు కూడా ఇక్కడికి వచ్చారు.
== భౌగోళిక స్వరూపం ==
ఈ సరస్సు 13.33° - 13.66° ఉత్తరం మరియు 80.23° to 80.25°తూర్పు అక్షాంశ రేఖాంశాల మధ్య విస్తరించి ఉన్నది. ఎండిపోయిన భాగం కూడా పరిగణనలోకి తీసుకుంటే ఉత్తరం 14.0° దాకా విస్తరించి ఉన్నది. ఈ సరస్సులో 84% ఆంధ్రప్రదేశ్ లోనూ, 16% తమిళనాడులోనూ విస్తరించి ఉంది.
 
== సాహిత్యంలో పులికాట్‌ ==
పులికాట్‌ సరస్సు, అక్కడి ప్రజల జీవనము నేపథ్యంగా స.వెం.రమేష్ ''ప్రళయ కావేరి కథలు'' అనే కథల సంపుటి రచించాడు.
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
పంక్తి 23:
[[en:Pulicat Lake]]
[[hi:पुलीकट]]
[[kn:ಪುಲಿಕಾಟ್ ಸರೋವರ]]
[[ta:பழவேற்காடு ஏரி]]
[[mr:पुलीकट सरोवर]]
"https://te.wikipedia.org/wiki/పులికాట్_సరస్సు" నుండి వెలికితీశారు