భద్రాచలం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{అయోమయం|భద్రాచలం}}
{{భారత స్థల సమాచారపెట్టె‎|type = mandal||native_name=భద్రాచలం|distlink=ఖమ్మం జిల్లా|district=ఖమ్మం|mandal_map=Khammam mandals outline08.png|latd = 17.67 | longd = 80.88|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=భద్రాచలం|villages=62|area_total=|population_total=77960|population_male=39330|population_female=38630|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=57.7|literacy_male=63.48|literacy_female=51.81}}
'''భద్రాచలం''' లేదా '''శ్రీరామ దివ్యక్షేత్రం''' [[ఆంధ్ర ప్రదేశ్]], [[ఖమ్మం జిల్లా]] లో, [[గోదావరి]] నది దక్షిణ తీరమున ఉన్న ఒక పట్టణం. భద్రాచలం మండలానికి ఈ పట్టణం కేంద్రము. జిల్లాకేంద్రమైన ఖమ్మం పట్టణానికి 105 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ పట్టణం, భక్త రామదాసు నిర్మించిన రామాలయానికి ప్రసిద్ధి చెందింది. జిల్లాలోని ప్రముఖ పారిశ్రామిక కేంద్రాలైన [[పాల్వంచ]] 27 కి.మీ., [[మణుగూరు]] 35 కి.మీ., [[కొత్తగూడెం (ఖమ్మం జిల్లా పట్టణము)|కొత్తగూడెం]] 35 కి.మీ. దూరంలోను ఉన్నాయి.
 
==భద్రాచలం పట్టణం==
భద్రాచలం గ్రామ పంచాయితీ 1962లో మద్రాసు గ్రామ పంచాయితీ చట్టం క్రింద ఏర్పడింది. తరువాత 26.07.2001న వచ్చిన ప్రభుత్వం చట్టం GOMs.No.245 (PR & RD) ప్రకారం ఇది ఒక పట్టణంగా గుర్తించబడింది. 8.4.2002న G.O.Ms.No.118 (PR & RD), ప్రకారం ఈ పట్టణం పేరు "శ్రీరామ దివ్య క్షేత్రం" అని మార్చబడినది. <ref>[http://www.khammam.com/html/muncipality/bhadrachalam.htm భద్రాచలం అధికారిక వెబ్‌సైటు]</ref>
==రామాలయ ప్రశస్తి==
పూర్వం భద్రుడు అను భక్తుడు [[శ్రీ రాముడు]]కి తపస్సు చేసి, తను ఒక కొండగా మారి తనపై శ్రీ రాముడు వెలసే విధము గావిధముగా వరము పొందాడు అంటారు. ఆ కొండకు భద్రుడు పేరు మీద [[భద్రగిరి]] అని తరువాత కాలంలో ఆ పట్టణానికి భద్రాచలం అని పేరు స్థిర పడింది. దీనినే రామాలయం అని కుడా అంటారు.
 
[[బొమ్మ:Bhadrachalam temple view.jpg|thumb|left|భద్రాచల రామాలయ దృశ్యము]]
[[గోల్కొండ]] నవాబు [[అబుల్ హసన్ కుతుబ్ షా|అబుల్ హసన్ తానీషా]] పాలనా కాలంలో భద్రాచల ప్రాంతానికి తహశీల్దారుగా [[రామదాసు|కంచెర్ల గోపన్న]] ఉండేవాడు. ఇక్కడికి సమీపంలోని నేలకొండపల్లి గ్రామానికి చెందిన గోపన్న శ్రీరామ భక్తుడు. తాను ప్రజల నుండి వసూలు చేసిన పన్ను(6 లక్షల రూపాయలు) సొమ్మును ప్రభుత్వానికి జమ చెయ్యకుండా, [[భద్రగిరి]] పై శ్రీ రాముడు వెలసిన ప్రదేశమందు ఈ రామాలయాన్ని నిర్మించాడు. దేవునికి రకరకాల నగలు - చింతాకుపతకం, పచ్చలపతకం మొదలైనవి - చేయించాడు.
 
ఆ సొమ్ము విషయమై తానీషా గోపన్నను గోల్కొండ కోటలో బంధించగా, ఆ చెరసాల నుండి తనను విముక్తి చెయ్యమని రాముణ్ణి ప్రార్ధించాడు, గోపన్న. ఆ సందర్భంలో రామునిపై పాటలు రచించి తానే పాడాడు. ఇవే [[రామదాసు కీర్తనలు]] గా ప్రసిద్ధి చెందాయి. గోపన్న కీర్తనలకు కరిగిపోయిన రాముడు, దేవాలయ నిర్మాణానికి ఉపయోగించిన ప్రభుత్వ సొమ్మును తానీషాకు చెల్లించి, గోపన్నకు చెరసాల నుండి విముక్తి ప్రసాదించాడని ఐతిహ్యం. ఆ విధంగా కంచెర్ల గోపన్నకు [[రామదాసు]] అనేపేరుఅనే పేరు వచ్చింది.
 
 
[[బొమ్మ:Srirama-Bhadra.jpg|right|250px|thumb|భద్రాచల దేవస్థానంలో శ్రీ సీతారామ లక్ష్మణుల మూల విగ్రహాలు]]
[[బొమ్మ:Ramadasu.jpg|right|250px|thumb|భద్రాచల దేవస్థానము వద్ద రామదాసు విగ్రహం]]
[[బొమ్మ:boates in godavari.a.jpg|right|250px|thumb|గోదావరిలో పడవల రాకపోకలు]]
 
దేవాలయమందు సీతా, లక్ష్మణ, హనుమంత సమేతంగా శ్రీరామచంద్రుడు ఇక్కడ అత్మారాముని రూపంలో కొలువుతీరి ఉన్నాడు. సీత, రాముని తొడపై కూర్చొని ఉన్నట్లు ఇక్కడి విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. మరే దేవస్థానంలోనూ లేని ప్రత్యేకత ఇది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి వైభవంగా జరిగే సీతారామ కళ్యాణ ఉత్సవానికి అశేషప్రజానీకంఅశేష ప్రజానీకం వస్తారు. రాష్ట్రప్రభుత్వంరాష్ట్ర ప్రభుత్వం ఈ కళ్యాణోత్సవానికి ముత్యపు తలంబ్రాలు, పట్టువస్త్రాలుపట్టు వస్త్రాలు పంపించడం సాంప్రదాయం. ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి, ఇక్కడ శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది. రామదాసు చేయించిన వివిధరకాల నగలు దేవస్థానపు ప్రదర్శనశాలలో ప్రదర్శనకు ఉంచారు.
 
 
పంక్తి 29:
మండలకేంద్రమైన భద్రాచలం ప్రముఖ యాత్రాస్థలం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో రోడ్డు రవాణా సౌకర్యం బాగా ఉంది. [[హైదరాబాదు]] నుండి ఖమ్మం, కొత్తగూడెం మీదుగా, [[విజయవాడ]] నుండి [[కొత్తగూడెం (ఖమ్మం జిల్లా పట్టణము)|కొత్తగూడెం]] మీదుగా, [[రాజమండ్రి]] నుండి [[మోతుగూడెం]] మీదుగా, [[విశాఖపట్నం]] నుండి [[సీలేరు]], [[చింతపల్లి]] మీదుగా, [[వరంగల్|వరంగల్లు]] నుండి [[ఏటూరునాగారం|ఏటూరు నాగారం]] మీదుగా రోడ్డు మార్గాలు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి.
 
భద్రాచలం [[రెవెన్యూ డివిజన్]] కేంద్ర స్థానమైనా రైలుసౌకర్యం లేదు. ఇక్కడికి 35కి.మీ.ల దూరంలోని [[కొత్తగూడెం (ఖమ్మం జిల్లా పట్టణము)|కొత్తగూడెం]] లో ఉన్న ''[[భద్రాచలం రోడ్]] '' స్టేషను అతిదగ్గరలోనిఅతి దగ్గరలోని స్టేషను. ప్రతిరోజూ హైదరాబాదు నుండి ఒకటి, విజయవాడ నుండి ఒకటి, [[రామగుండం]] నుండి ఒక రైలు ఈ స్టేషనుకు వచ్చిపోతాయి.
 
[[గోదావరి]] నది పక్కనే భద్రాచలం ఉండడంతో [[రాజమండ్రి]] నుండి ప్రతిరోజూ లాంచీ ద్వారా రాకపోకలు సాగుతూ ఉంటాయి. ఈ మార్గంలోనే [[పాపి కొండలు|పాపికొండలు]] కానవస్తాయి. భద్రాచలం కేంద్రంగా జరిగే విహారయాత్రల్లో ఈ జలమార్గం ప్రముఖమైనది.
 
==కొన్ని వివరాలు==
భద్రాచలం పట్టణం పేరును ప్రభుత్వం [[2002]] లో <u>'''శ్రీరామ దివ్యక్షేత్రం'''</u> పట్టణం గాపట్టణంగా మార్చింది. భద్రాచలం రెవిన్యూ మండల జనాభాలో దాదాపు మూడోవంతు గిరిజనులు. వ్యవసాయాధారిత ఆర్ధికవ్యవస్థ. పర్యాటకం మరో ప్రధాన ఆర్ధిక వనరు. ప్రతీ వర్షాకాలంలోను గొదావరికిగోదావరికి వరదలు వచ్చి భద్రాచలం పట్టణపు పల్లపు ప్రాంతాలు జలమయం కావడం సర్వసాధారణంగా ఉండేది. పట్టణ అభివృద్ధిలో భాగంగా, నదికి వరదకట్టను నిర్మించిన తరువాత ఈ బెడద బాగా తగ్గింది. ప్రభుత్వ సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం (ఐ.టి.డి.ఏ) భద్రాచలంలోనే ఉంది.
* [[లోక్‌సభ]] నియోజకవర్గం: [[మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం]] (పునర్విభజన అనంతరం)
* [[శాసనసభ]] నియోజకవర్గం: [[భద్రాచలం శాసనసభ నియోజకవర్గం]]
* రెవిన్యూ డివిజను: భద్రాచలం
* చూడదగ్గ ప్రదేశాలు
** భద్రాచల సీతారామచంద్ర స్వామి దేవస్థానం
 
==దగ్గరలో ఉన్న పర్యాటక స్థలాలు==
* [[కిన్నెరసాని]]: భద్రాచలం పట్టణం నుండి 32కి.మీ.ల దూరంలోని కిన్నెరసాని నదిపై ఒక డ్యాము, జింకల పార్కు ఉన్నవి
* [[పర్ణశాల]]: వనవాస సమయంలో శ్రీరాముడు ఇక్కడ ఉన్నాడని, ఇక్కడినుండేఇక్కడి నుండే సీతను రావణుడు అపహరించాడని స్థానిక కథనం.
* [[పాపి కొండలు]]: సుందరమైన గోదావరి నది, కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణము. భద్రాచలం నుంచి పడవలో ఇక్కడికి వెళ్ళే సౌకర్యం ఉంది.
 
==మూలాలు==
పంక్తి 58:
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ నగరాలు మరియు పట్టణాలు]]
[[వర్గం:గోదావరి ఒడ్డున వెలసిన పుణ్య క్షేత్రములు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ దర్శనీయ స్థలాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/భద్రాచలం" నుండి వెలికితీశారు