షేక్ నాజర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
 
==కళాప్రతిభ==
ప్రజా కళాకారుడుగా, బుర్రకథ పితామహుడుగా ఎదిగినవాడు. అంగాంగ విన్యాసాల ద్వారా ఆటపాట ద్వారా జాతిని మేల్కొలిపి ఉత్తేజపరిచిన మహనీయుడు షేక్‌ నాజర్‌.పుట్టిల్లు, అగ్గిరాముడు, నాజర్‌బలేబావ, కొన్నినిలువు దోపిడీ, పెత్తందార్లు సినిమాల్లో బుర్రకథనాజర్‌ చెప్పాడు.బుర్రకథలు కొందరికికన్పిస్తాయి.చాలామందికి నేర్పాడు. ఆయన గళ గాంభీర్యాన్ని, మాధుర్యాన్ని గమనించి, వివశులైన ప్రఖ్యాత సినీ సంగీత దర్శకులు [[ఎస్‌. రాజేశ్వరరావు]] సినీరంగంలో స్థిరపడమని కోరినా, ఆ లోకం తన లోకం కాదని సవినయంగా చెప్పి, జనపదమే తన పథమని బుర్రకథలు చెప్పుకుంటూ జనంతో మమేకమై, జీవితాంతం ప్రజా కళాకారుడిగా తన ప్రయాణం సాగించాడు.'ఆసామీ' నాటకాన్ని రచించారు. 18వ ఆంధ్రనాటక కళాపరిషత్తు పోటీల్లో 'ఆసామీ' నాటకం ప్రధమ బహుమతి పొందింది. నాజర్‌ ఏడుసార్లు జైలు జీవితాన్ని అనుభవించారు.
 
వేదికపై నాజరు రాగ తాళ నృత్యాభినయ మెరుపు విన్యాసాలు చూడటం ఓ అద్భుతం. రంగస్థల మహానటుడు [[బళ్ళారి రాఘవ|బళ్లారి రాఘవాచార్యులు]] నాజరు బుర్రకథ విని అమితానందంతో బళ్లారికి ఆహ్వానించడం, మద్రాసులో ప్రదర్శన చూచిన డా: [[గోవిందరాజుల సుబ్బారావు]] నాజరుని అభినందిస్తూ కౌగిలించుకోవడం , ప్రముఖ పాత్రికేయుడు కె.అబ్బాస్ నాజరును ' ఆంధ్ర అమరషేక్ ' అని అభివర్ణించడం కామ్రేడ్ [[పుచ్చలపల్లి సుందరయ్య]] నాజరు [[ప్రజాభాష]] కు ముగ్ధుడై ' నా బిడ్డడు ఎంత ఎదిగిపోయాడో ' అని ఆలింగనం చేసుకోవడం, నాజరు సాధించిన కళాప్రతిభకు తిరుగులేని నిదర్శనాలు. 1986 లో భారతప్రభుత్వం [[పద్మశ్రీ]] బిరుదుతో నాజరును సత్కరించింది. మరణించేవరకు కటిక పేదరికాన్ని అనుభవించాడు.
:'''నింగితాకే రాగతరంగం<br>కదనుతొక్కే కవన తురంగం<br>నాజరుగళం రగడవిరుపులు<br>బుర్రకథా కళల వీరంగం'''<br>
[[1997]] [[ఫిబ్రవరి 22]]న [[అంగలూరు]]లో మణించారు.
==సత్కారాలు==
*ఆంధ్రనాటక అకాడమీ 1981లో ఉత్తమ కళా కారుడు అవార్డుతో సత్కరించింది.
*1986 లో భారతప్రభుత్వం [[పద్మశ్రీ]] బిరుదుతో నాజరును సత్కరించింది.
 
== గ్రంధాలు==
"https://te.wikipedia.org/wiki/షేక్_నాజర్" నుండి వెలికితీశారు