సాంఖ్య దర్శనం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: zh:数论 (印度哲学)
చి యంత్రము మార్పులు చేస్తున్నది: hi:सांख्य दर्शन; cosmetic changes
పంక్తి 1:
{{హిందూధర్మశాస్త్రాలు}}
 
హిందూ ధర్మశాస్త్రాలలో జీవుడు, ప్రకృతి, తత్వము, మోక్షము వంటి విషయాలను విశ్లేషించే తత్వశోధనా రచనలను [[షడ్దర్శనాలు|దర్శనాలు]] అంటారు.
[[సాంఖ్య దర్శనము|సాంఖ్యము]], [[యోగ దర్శనము|యోగము]], [[వైశేషిక దర్శనము|వైశేషికము]], [[న్యాయ దర్శనము|న్యాయము]], [[పూర్వమీమాంస]], [[ఉత్తరమీమాంస]] అనే ఆరు ఆస్తికదర్శనాలు. వీటిలో మూల ప్రకృతికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేది '''సాంఖ్యదర్శనము'''.
 
 
ఇది '''[[కపిల మహర్షి]]'''చే ప్రవర్తింపజేయబడినది. విశ్వ సృష్టికి మూలప్రకృతి ప్రధాన కారణమని ఈ దర్శన సారాంశము. ప్రకృతి సత్వము, రజస్సు, తమము అనే మూడు గుణాలతో కూడి ఉంది. ప్రకృతి, పురుషుల సంయోగము వలన బుద్ధి జనిస్తుంది. ఆ బుద్ధి చేసే చేష్టలు మనిషిని సంసారంలో బంధిస్తాయి.
 
ముందుగా ఇది నాస్తికవాదమనీ, తరువాత ఆస్తిక వాదాలలో ఒకటిగా విలీనం చేయబడిందనీ కొందరి వాదన. "ఈశ్వర కృష్ణుడు" రచించిన "సాంఖ్యకారిక" ఒకటే ఈ విషయంపైన స్పష్టమైన గ్రంధం.
 
== మౌలిక సూత్రాలు ==
 
సాంఖ్యవాదం ప్రకారం జ్ఞానానికి మూడు ప్రమాణాలను అంగీకరించవచ్చును
పంక్తి 16:
# శబ్ద ప్రమాణం: వేరేవారు చెప్పగా విన్న విషయాలు
 
== సాంఖ్య తత్వము ==
 
=== ప్రధాన విషయాలు ===
 
"పురుషుడు", "ప్రకృతి" అనేవి రెండు విభిన్నమైన అంశాలు అనేది సాంఖ్యంలో ఒక మౌలికమైన సూత్రం. సృష్టిలో అన్నీ ఈ రెండింటిలో ఏదో ఒకదానికి చెందుతాయి.
 
* '''పురుషుడు'''
పంక్తి 26:
 
* '''ప్రకృతి'''
సృష్టి కారణమైన, శాశ్వతమైన అంశము. ప్రకృతి కూడా అనాదిగా ఉన్నది. ప్రకృతిని ఎవరూ సృజింపలేదు. కాని ప్రకృతికి సృజించే లక్షణం ఉంది. అన్ని పరిణామాలూ, అశాశ్వతమై పదార్ధాలూ కూడా ప్రకృతి వల్లనే సంభవిస్తున్నాయి. అన్ని జీవులూ యదార్ధంగా పురుషుని బాహ్య స్వరూపాలు. కాని ప్రకృతి వలన ఉద్భవించిన భౌతిక దేహాలు పురుషుని బంధిస్తాయి. పురుషునకు తన గురించి సరైన జ్ఞానం లేనందువలన, తాను శరీరం మాత్రమే అని భ్రమించడం వలన, "సంసార బంధం" ఏర్పడుతుంది. ఆత్మజ్ఞానం కలిగినపుడు ఆ బంధం నుండి విముక్తి లభిస్తుంది.
 
* '''ఈశ్వరుడు'''
కపిలముని ప్రతిపాదించిన సాంఖ్యంలో ఈశ్వరునికి స్థానం లేదు. కారణం - ఈశ్వరుని ఉనికిని ఋజువు చేయడం సాధ్యం కాదు గనుకా, పరిణామము లేని ఈశ్వరుడు పరిణామాత్మకమైన సృష్టికి కారణమని చెప్పడం అసంబద్ధం గనుకా.
 
తరువాతి కాలంలో సాంఖ్యవాదులు తమ తమ యోగసిద్ధాంతాలలో "ఈశ్వరుడు" అనే తత్వాన్ని సాంఖ్యవాదంలో ప్రవేశపెట్టారు.
 
=== వైవిధ్యం ===
సాంఖ్యవాదం ప్రకారం సృష్టికి పురుడుడు, ప్రకృతి - రెండూ కారణాలే. పురుషుడు "ఆత్మ"కు, చైతన్యానికి మూలము. ప్రకృతి "పదార్ధము"నకు, పరిణామమునకు మూలములు.
 
=== సృష్టి సిద్ధాంతం ===
 
సాంఖ్యం "సత్కార్యవాదం"ను సమర్ధిస్తుంది. దీని ప్రకారం ఏదైనా పనిలో కారణము, ఫలితము కలిసి ఉంటాయి. ఉన్నదేదీ నశించదు. లేనిదేదీ ఉత్పన్నం కాదు. అంతా పరిణామమే. అందుకు కారణంలో ఫలితం అంతర్లీనంగా ఉంటుంది. వీరి "ప్రకృతి పరిణామ వాదం" ప్రకారం మూల ప్రకృతి అన్నిటికీ కారణం. అదే క్రమంగా విభజితమై వివిధ పదార్ధాలుగా పరిణామం చెందుతుంది. చివరిలో అన్నీ మళ్ళీ అవిభాజిత మూల ప్రకృతిలో లీనమౌతాయి. ఇలా చక్రగతిలో విభజన, విలీనం సంభవిస్తాయి.
 
వైవిధ్యం, ఘర్షణ అనేవి ప్రకృతిలో అంతర్లీనంగా ఉన్న లక్షణాలు. వీటివల్లనే ప్రకృతి 24 వేర్వేరు
పంక్తి 60:
* ''[[పంచభూతాలు|పంచ మహాభూతాలు]]''
 
ఈ గుణాల మధ్య తులనాన్ని బట్టి జీవుల, పదార్ధాల లక్షణాలు మారుతాయి. పరిణామం జరుగుతుంది. సాంఖ్య సిద్ధాంతాలు పతంజలి యోగసూత్రాలలోను, మహాభారతంలోను, యోగవాసిష్టం లోను విస్తృతంగా ప్రస్తావించబడ్డాయి.
 
అన్ని జీవులలోను ఆత్మ పురుషుని స్వరూపము. మనసు, బుద్ధి, అహంకారము ప్రకృతి లక్షణాలు.
 
=== మోక్షము ===
అజ్ఞానమే బంధాలకు, కష్టాలకు కారణం - అని మిగిలిన చాలా సిద్ధాంతాలలాగానే సాంఖ్యం కూడా చెబుతుంది. "పరుషుడు" (అనగా జీవాత్మ)శాశ్వతమైన, నిర్మలమైన చైతన్యము. ప్రకృతి వల్ల కలిగే సత్వరజస్తమోగుణాలు, మనసు, అహంకారము, మహత్‌లు ఈ జీవుని శరీరంలో బంధించివేస్తున్నాయి. జ్ఞానం వల్లం ఈ బంధం నుండి విముక్తులు కావచ్చును. అందువలన మోక్షం లభిస్తుంది.
 
 
ఇక్కడ సాంఖ్యానికి, వేదాంతానికి మధ్య విభేదాలను గమనించవలసి ఉన్నది. [[అద్వైతం|అద్వైత వేదాంతం]] ప్రకారం బ్రహ్మమే అన్నిటికీ కారణం. వేరే పదార్ధం లేదు. కాని సాంఖ్యం ప్రకారం ప్రకృతి, పురుషుడు అనేవి రెండూ అనాదిగా వేర్వేరు. శాశ్వతమైన దానినుండి అశాశ్వతమైనది జనిస్తుందనే వాదాన్ని సాంఖ్యం అంగీకరించదు.
 
== పాశ్చాత్య తత్వాలలో సాంఖ్యం ==
 
పాశ్చాత్య తత్వశాస్త్రంలో "కార్టీజియన్ సిద్ధాంతం" ప్రకారం శరీరం, మనసు అనేవి వేరు వేరు పదార్ధాలు. ఇది సాంఖ్యానికి కాస్త దగ్గరగా అనిపించినా కొన్ని ముఖ్యమైన భేదాలను గమనించాలి. పాశ్చాత్య తత్వ శాస్త్రంలో "శరీరం" అనేది భౌతిక పదార్ధం. "మనసు" కనిపించని చైతన్యం. కాని సాంఖ్యంలో శరీరము, మనసు, అహంకారమూ కూడా ప్రకృతి లక్షణాలే. "జీవుడు" లేదా "ఆత్మ" అనేది మరింత అంతర్గతంగా ఉండేది అనవచ్చును.
పంక్తి 77:
సాంఖ్యం ప్రకారం కన్నులు, చూసేది కూడా శరీరమే. అలా చూసేదానికి "సాక్షి" మాత్రమే ఆత్మ)
 
== వనరులు ==
 
* హిందూ ధర్మ పరిచయము, స్తోత్ర మంజరి" - రచన: శిరోమణి సముద్రాల లక్ష్మణయ్య, విద్వాన్ ముదివర్తి కొండమాచార్యులు - [[తిరుమల తిరుపతి దేవస్థానములు]] వారి ప్రచురణ
== బయటి లింకులు ==
* [http://web.archive.org/web/20041023062627/http://www.philo.demon.co.uk/enumerat.htm సాంఖ్య తత్వము గురించ ]
పంక్తి 87:
 
[[en:Samkhya]]
[[hi:सांख्य दर्शन]]
[[kn:ಸಾಂಖ್ಯ]]
[[ml:സാംഖ്യം]]
"https://te.wikipedia.org/wiki/సాంఖ్య_దర్శనం" నుండి వెలికితీశారు