విక్షనరీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
 
=== విక్షనరీ అభివృద్ధి ===
=== పద సేకరణ ===
విక్షనరీలో సాధారణంగా నిత్య జీవితంలో మన వాడే పదాలను చేర్చాలి. ప్రస్తుతం వాడుకలో లేని పదాలు మన ఇళ్ళల్లో పెద్ద వారు వాడుతుంటారు వాటిని చేర్చి అర్ధాలను వివరిస్తే మరుగున పడుతున్న పదాలు వెలుగులోకి వస్తాయి. జానపదులలో, పల్లె సీమల్లో కొన్ని చిత్రమైన పదాలు వాడుకలో ఉంటాయి. వాటిని కూడా ఇక్కడ చేర్చ వచ్చు. పల్లె సీమల్లో విభిన్నతలు అధికంగా ఉంటాయి. వాటిని చిత్రాలతో ఊదహరిస్తే బాగుంటుంది. పల్లె పదాల్లో అమాయకత్వం, సహజత్వం ఎక్కువ అటువంటి పదాలను చేర్చ వచ్చు. కుల పరంగా కొన్ని ప్రత్యేక పదాలు ఉంటాయి. వాటిని కూడా చేర్చ వచ్చు. సంస్కృతి, సాంప్రదాయాల పరంగా కొన్ని ప్రత్యేక పదాలు ఉంటాయి. వాటినీ చేర్చ వచ్చు. వ్యవసాయానికి సంబంధించి అనేక పదాలు ఉంటాయి వాటినీ చేర్చ వచ్చు. ఇలా విభిన్న పదాలను చేర్చ వచ్చు.వార్తా పత్రికలు కొన్ని కొత్త పదాలను సృష్టిస్తుంటాయి. వాటిని కూడా పేర్కొన వచ్చు. ఇలా మన పరిసరాలను గమనిస్తే అనేకానేక పదాలు వినిపిస్తాయి. వాటన్నింటినీ ఇక్కడ నిక్షిప్తం చేయవచ్చు.
"https://te.wikipedia.org/wiki/విక్షనరీ" నుండి వెలికితీశారు