మద్యపానం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 31:
*సంపూర్ణ మద్యనిషేధం వల్ల తాగుబోతుల కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, స్త్రీలపై అత్యాచారాలు, ఇతర నేరాలు తగ్గిపోతాయి".
==నిబంధనలు==
* పాఠశాల, దేవాలయం, ఆసుపత్రికి 100 మీటర్ల దూరంలోపుగా దుకాణం ఏర్పాటు చేయకూడదు.
* పాఠశాల గుర్తింపు పొందినదై ఉండాలి. అలాగే దేవాలయం దేవాదాయ శాఖ పరిధిలోనిదై ఉండాల్సి ఉంటుంది. 30 పడకల ఆసుపత్రికి 100 మీటర్ల దూరంలోపు మద్యం దుకాణం ఏర్పాటు చేయకూడదు.
* దుకాణం ఏర్పాటు నిర్ధేశించిన స్థలం మేరకే ఉండాలి. దుకాణంతో పాటు ప్రత్యేక గదులు, బార్‌స్థాయి ఏర్పాట్లు చేయకూడదు. దుకాణం అమ్మకం స్థానం మాత్రమే. కొన్నచోటే తాగటానికి ఏర్పాట్లు చేయటం నిషిద్దం.
* మద్యం వ్యాపారులు లిక్కరు, బీరు ఇతర మద్యాన్ని బాటిల్‌పై వేసిన ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలి.
* విక్రయాలు ఉదయం 10.30గంటల నుంచి రాత్రి 11గంటల వరకు మాత్రమే జరపాలి. అంతకుమించి సమయాన్ని దాటి అమ్మకాలు జరిపిన వారికి జరిమానా విధిస్తారు.
* బార్‌లు అయితే రాత్రి 12గంటల వరకు తెరిచి ఉంచే వెసులుబాటు ఉంది.
 
==ఆల్కోపాప్స్‌==
ఆల్కోపాప్స్‌ను ఎక్సైజ్‌శాఖ సాధారణ మద్యం విభాగంలో చేర్చింది.తియ్యగా పండ్ల రసం లా ఉంటుంది.త్రాగినవారు క్రమేపీ దీనికి అలవాటు పడిపోతారు. చివరికి ఇది మద్యపానానికి దారితీస్తుంది.దీన్ని 'రెడీ టు డ్రింక్‌' అని పిలుస్తారు. నారింజ, బెర్రీ... ఇలా రకరకాల పండ్ల రుచుల్లో లభిస్తున్నాయి. పండ్ల రసంతోపాటు వీటిలో 4.8 శాతం ఆల్కహాలు ఉంటుంది.సాధారణ మద్యం కంటే దీని ధర,వినియోగం కూడా మూడురెట్లు ఎక్కువగా ఉంది.
"https://te.wikipedia.org/wiki/మద్యపానం" నుండి వెలికితీశారు