విక్షనరీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
ఇది సమగ్రంగా తయారైతే ఎక్కువ ఉపయోగంగా వుండే విభాగం. ఇందులో ఆ పదానికి ఇతర భాషలో అర్ధాలు తెలిసిన వారు వాటిని చేర్చ వచ్చు. అర్ధాల ప్రక్కన బ్రాకెట్ లో ఇతర భాషా ఉచ్ఛారణ తెలుగులో వ్రాయాలి. ఇక్కడ దిద్దుబాటులో ఆ భాషలకు లింకులు ముందే తయారుగా ఉంటాయి. వాటి మధ్య ఆ భాషా పదాన్ని వ్రాసినప్పుడు అది నేరుగా అయా భాషలలో ఆ పదం ఉన్న పేజీకి తీసుకు వెళుతుంది. అనువాదాలలో మరింత కృషి జరగ వలసి ఉంది. ఇతర భాషలతో పరిచయం ఉన్న తెలుగు వారు ఈ పని చేపట్ట వచ్చు.
 
===మూలాలు వనరులు===
ఇక్కడ పదానికి మూలాలు ప్రత్యేకంగా ఉంటే సూచించ వచ్చు. సాధారణంగా తెలుగు పదాలకు ప్రత్యేకమైన మూలాలు అవసరం లేదు. అందరికీ తెలిసే పదాలను చేర్చే సమయంలో మూలాలు వెతకనవసరం లేదు.
===బయట లింకులు===
ఆంగ్ల వీకీ, తెవీకీ లింకులు ఇవ్వాలి. ఆంగ్లవీకీ లింకు ముందే ఉంటుంది. దానిలో పదానికి ఉండే సమానమైన ఆంగ్ల పదాన్ని వ్రాయాలి. ఈ లింకు ఆంగ్ల వీకీలో ఉండే వ్యాసానికి దారి తీస్తుంది.
పంక్తి 35:
===ఇతరాలు===
చివరిగా ఎడిట్ పేజీలో మీకు అందుబాటులో ఉన్న సాంకేతిక సహాయంతో ఆ పదానికి చిత్రాన్ని చేర్చగలిగితే భాష తెలియని వారికి కూడా పదమేమిటో అర్ధం ఔతుంది. ఇది చాలా ఉపయోగకరం. చిత్రాలు ఇప్పటికే లేక పోతే మీరే వికీలో ప్రవేశ పెట్టి (అప్లోడ్) పేజీలో చేర్చ వచ్చు. ఇతర వీకీల నుండి చేర్చ వచ్చు. అయితే సభ్యులు తమకు తెలిసిన ఏ విభాగంలోఅయినా వ్రాయ వచ్చు పూర్తిగా వ్రాయాలన్న నియమం ఏమీ లేదు.
 
==పద సేకరణ ==
విక్షనరీలో సాధారణంగా నిత్య జీవితంలో మన వాడే పదాలను చేర్చాలి. ప్రస్తుతం వాడుకలో లేని పదాలు మన ఇళ్ళల్లో పెద్ద వారు వాడుతుంటారు వాటిని చేర్చి అర్ధాలను వివరిస్తే మరుగున పడుతున్న పదాలు వెలుగులోకి వస్తాయి. జానపదులలో, పల్లె సీమల్లో కొన్ని చిత్రమైన పదాలు వాడుకలో ఉంటాయి. వాటిని కూడా ఇక్కడ చేర్చ వచ్చు. పల్లె సీమల్లో విభిన్నతలు అధికంగా ఉంటాయి. వాటిని చిత్రాలతో ఉదహరిస్తే బాగుంటుంది. పల్లె పదాల్లో అమాయకత్వం, సహజత్వం ఎక్కువ అటువంటి పదాలను చేర్చ వచ్చు. కుల పరంగా కొన్ని ప్రత్యేక పదాలు ఉంటాయి. వాటిని కూడా చేర్చ వచ్చు. సంస్కృతి, సాంప్రదాయాల పరంగా కొన్ని ప్రత్యేక పదాలు ఉంటాయి. వాటినీ చేర్చ వచ్చు. వ్యవసాయానికి సంబంధించి అనేక పదాలు ఉంటాయి వాటినీ చేర్చ వచ్చు. ఇలా విభిన్న పదాలను చేర్చ వచ్చు.వార్తా పత్రికలు, అంతర్జాల అభివృద్ధి వలన కొన్ని కొత్త పదాలు సృష్టింపబడతాయి. వాటిని కూడా పేర్కొన వచ్చు. ఇలా మన పరిసరాలను గమనిస్తే అనేకానేక పదాలు వినిపిస్తాయి. వాటన్నింటినీ ఇక్కడ నిక్షిప్తం చేయవచ్చు.
"https://te.wikipedia.org/wiki/విక్షనరీ" నుండి వెలికితీశారు