షైనీ అబ్రహం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: ml:ഷൈനി വിൽ‌സൺ
చి యంత్రము మార్పులు చేస్తున్నది: ml:ഷൈനി വിൽസൺ; cosmetic changes
పంక్తి 1:
[[1965]]], [[మే 8]] న జన్మించిన '''షైనీ అబ్రహం''' (Shiny Abraham) [[భారతదేశం|భారతదేశపు]] ప్రముఖ అథ్లెటిక్ క్రీడాకారిణి. 800 మ్టర్ల పరుగుపందెంలో ఆమె 14 సంవత్సరాలపాటు జాతీయ చాంపియన్ గా నిలిచింది. అంతర్జాతీయ వేదికపై 75 సార్లకు పైగా భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించింది. [[1985]] లో [[జకర్తా]]లో జర్గిన ఆసియా ట్రాక్ & ఫీల్డ్ పోటీల నుంచి వరుసగా 6 సార్లు ఆసియా ట్రాక్ & ఫీల్డ్ పోటీలలో పాల్గొని ఈ ఘనత సాధించిన ఏకైక క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. ఈ సమయంలో ఆమె 7 బంగారు పతకాలను, 5 వెండి పతకాలను, 2 కాంస్య పతకాలను తన ఖాతాలో వేసుకుంది. అట్లే ఆమె పాల్గొన్న 7 దక్షిణాసియా ఫెడరేషన్ క్రీడలలో 18 బంగారు, 2 వెండి, పతకాలను సాధించింది.
== ప్రారంభ జీవితం ==
షైనీ అబ్రహం 1965, మే 8 న [[కేరళ]]లోని [[ఇడుక్కి]] జిల్లా థోడుపుఝా గ్రామంలో జన్మించింది. చిన్నతనం నుంచే షైనీకి అథ్లెటిక్స్ పై మక్కువ ఉన్ననూ [[కొట్టాయం]]లోని స్పోర్ట్స్ డివిజన్ లో ప్రవేశించిన పిదపే అందులో నైపుణ్యం సంపాదించింది. షైఇనీ అబ్రహం, [[పి.టి.ఉష]], [[ఎం.డి.వల్సమ్మ]]లు ఒకే డివిజన్ కు చెందిన వివిధ ప్రాంతాలలో శిక్షణ పొందిననూ వారి ముగ్గురి కోచ్ పి.జె.దేవెస్లా.
== క్రీడా జీవితం ==
షైనీ అబ్రహం అంతర్జాతీయ క్రీడా జీవితం తన సహచరిణి అయిన పి.టి.ఉష తో సమానంగా ప్రారంభమైంది. [[1982]]లో [[ఢిల్లీ]]లో జరిగిన [[ఆసియా క్రీడలు|ఆసియా క్రీడలతో]] వారిరువురి గమనం ఆరంభమైంది. షైనీ అంతకు ముందు ఏడాదే 800 మీటర్ల పరుగులో జాతీయ చాంపియన్ అయింది. అక్కడి నుంచి అథ్లెటిక్స్ నుంచి నిష్క్రమించేదాకా ప్రతీసారి షైనీ జాతీయ క్రీడలలో ఆ ఈవెంట్‌లో ఆమెకు తిరుగులేకుండా పోయింది. ఆమె 4 [[ఒలింపిక్ క్రీడలు|ఒలింపిక్ క్రీడలతో]] పాటు 3 ఆసియా క్రీడలలో పాల్గొంది. [[1984]]లో [[లాస్ ఏంజిలెస్|లాస్ ఏంజిల్స్]] లో జర్గిన ఒలింపిక్స్‌లో సెమీ ఫైనల్స్ చేరి ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. [[1986]]లో [[సియోల్]] లో జర్గిన ఆసియా క్రీడలలో పరుగుపందెంలో తన ట్రాక్ లైన్‌ను దాటినందుకు అనర్హత పొందింది. ఆమె ఆ సమయంలో పతకం సాధించే దిశలో ఉండింది. [[1992]] [[బార్సిలోనా]] ఒలింపిక్స్‌లో భారత పతాకాన్ని పట్టుకొని ఒలింపిక్ క్రీడల మార్చ్‌ఫాస్ట్ లో జాతీయ పతాకాన్ని పట్టిన తొలి భారతీయ మహిళగా పేరు సంపాదించింది. ఆమె సాధించిన అత్యుత్తమ ప్రతిభ 1:58.8 నిమిషాలు. దీన్ని [[1995]]లో [[చెన్నై]]లో జరిగిన దక్షిణాసియా క్రీడలలో నమోదు చేసింది. ఆమె ఆ సమయంలో తన కూతురు శిల్పాకు జన్మనిచ్చింది. అయినా మెరుగైన సమయాన్ని నమోదు చేయడం విషేశం. రెండు నిమిషాల లోపు సమయాన్ని నమోదుచేయడం కూడా ఇదే ప్రథమం.
 
== వ్యక్తిగత జీవితం ==
షైనీ అంతర్జాతీయ స్విమ్మింగ్ క్రీడాకారుడు మరియు [[అర్జున అవార్డు]] గ్రహీత అయిన [[చెరియన్ విల్సన్]] ను వివాహం చేసుకుంది. అతడు [[ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా]]లో డిప్యూటీ మేనేజర్ (క్రీడల)గా పనిచేస్తున్నాడు.
 
== అవార్డులు ==
* షైనీ అబ్రహంకు [[1985]]లో క్రీడారంగంలో అత్యున్నతమైన అర్జున అవార్డు లభించింది.
* [[1996]] లో షైనీకు బిర్లా అవార్డు లభించింది
పంక్తి 30:
 
[[en:Shiny Abraham]]
[[ml:ഷൈനി വിൽ‌സൺവിൽസൺ]]
"https://te.wikipedia.org/wiki/షైనీ_అబ్రహం" నుండి వెలికితీశారు