వామనావతారము: కూర్పుల మధ్య తేడాలు

1 బైటు చేర్చారు ,  12 సంవత్సరాల క్రితం
చిదిద్దుబాటు సారాంశం లేదు
== ఉపనయనం ==
ఆ బాలునికి సవిత సావిత్రిని ఉపదేశించింది. బృహస్పతి యజ్ఞోపవీతాన్ని, కశ్యపుడు ముంజిని, అదితి కౌపీనాన్ని, ధరణి కృష్ణాజినమును, చంద్రుడు దండమును, ఆకాశ దేవత ఛత్రమును, బ్రహ్మ కమండలమును, సరస్వతి అక్షమాలికను, సప్తర్షులు కుశపవిత్రములను, ఈశ్వరుడు భిక్షాపాత్ర ను, భవాని పూర్ణ భిక్షను ఇచ్చింది. అలా ఉపనయనమైన మాయా రూపధారి వివిధ దేశముల నుంచి వచ్చిన విప్రులతో ముచ్చటించాడు. వారు బలిని మించిన వదాన్యుడు లేరని చెప్పగా విని, తల్లిదండ్రుల నుంచి సెలవు తీసుకొని, పయనమై, నర్మదానదిని దాటి ఆ నదికి ఉత్తరతీరమున ఉన్న బలి చక్రవర్తి అశ్వమేథ వాటికను సమీపించెను.
 
== శివుడా - హరుడా? ==
అతనిని చూచి జనులు గుజగుజలు పోవుచూ, గజిబిజి పడుచూ, కలకలములై ఎవరీ పొట్టి బాలుడు? శివుడా? హరియా? బ్రహ్మయా? సూర్యుడా? అగ్నియా? ఈ బ్రహ్మచారి ఎవరు? అని విస్మయం చెందారు. కొందరితో చర్చించుచూ కొందరితో జటలు చెప్పుచూ, గోష్ఠిలో పాల్గొనుచూ, తర్కించుచు, ముచ్చటలాడుచు, నవ్వుచూ అనేక విధంబుల అందరికీ అన్ని రూపులై వినోదించుచూ, వెడవెడ నడకలు నడుచుచూ, బుడి బుడి నొడువులు నొడుచుచు, జిడిముడి తడబడగ, వడుగు రాజును సమీపించి "స్వస్తి ! జాగత్త్రయీ భావన శాసన కర్తకు! హాసమాత్ర విధ్వస్త నిలింప భర్తకు, ఉదారపద వ్యవహర్తకు, మునీంద్ర స్తుత మంగళాధ్వ విధాన విహర్తకు, దానవ లోక భర్తకు స్వస్తి'' అని దీవించెను.
అజ్ఞాత వాడుకరి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/546258" నుండి వెలికితీశారు