పెద్ద బాలశిక్ష: కూర్పుల మధ్య తేడాలు

చి బొమ్మ చేర్చు
పంక్తి 7:
''''''{{వ్యాఖ్య|రాజ్యాలను సంపాదించాక మనం భౌగోళికంగా సర్వేలు చేయించాము. దేశంలో పండే పంటల ఆరాలు తీశాము. వనరుల గురించి భోగట్టాలు రాబట్టాము. జనాభా లెక్కలు గుణించాము. అంతేగాని స్థానికుల విద్యావిధానం గురించి తెలుసుకోడానికి ఏమాత్రం ప్రయత్నించలేదు.}}''''''
స్థానికులలో మన విశ్వాసాలకు భంగం కలగకుండా వారి విద్యావిధానంలో ఏ మార్పులను తీసుకు రావాలో తెలుసుకున్నారు. అప్పటి దాకా తమ సివిల్ సర్వెంట్ల చదువు కోసమే పుస్తకాలను రాయించిన ప్రభువులు స్థానికుల కోసం ప్రాథమిక గ్రంథాలను రాయించాలని అనుకొన్నారు. '''1832 లో మేస్తర్ క్లూ లో (Clu Low) అనే తెల్లదొర, తన ఆశ్రితుడైన '''పుదూరు చదలవాడ సీతారామశాస్త్రి''' చేత ''బాలశిక్ష'' అనే గ్రంథాన్ని రచింపచేశాడు.''' ఈయన రచనా ప్రణాళికను చాలా జాగ్రత్తగా కుర్రవాళ్ళ గ్రహణశక్తిని దృష్టిలో వుంచుకొని రూపొందించాడు. ఇటువంటి పుస్తకం కోసమే ఆవురావురమంటూ ఎదురు చూస్తున్న మన దేశం దీనిని రెండు చేతులా ఆహ్వానించింది.
[[దస్త్రం:PeddaBalaSikshaPage11.jpg|right|thumb|పెద్దబాలశిక్ష 11 వ పేజి]]
 
1856లో అంటే మొదటి ముద్రణకు రెండు పుష్కరాల తర్వాత వెలువడిన బాలశిక్షలోని పుటల సంఖ్య 78. డెమ్మీ ఆక్టావో సైజు. 1865లో అంటే రమారమి పదేళ్ళ తర్వాత ముద్రణలో పుటల సంఖ్య 90. అంటే పన్నెండు పేజీలు పెరిగాయన్నమాట. పాత ముద్రణలో లేని సాహిత్య విషయాలను, చందస్సు సంస్కృత శ్లోకాలు , భౌగోళిక విషయాలను యిందులో చేర్చారు.దానిని '''''బాలవివేకకల్ప తరువు'''''గా రూపొందించారు. అందుకనే అప్పటిదాకా బాలశిక్షగా ప్రచారంలోవున్న పుస్తకం '''''పెద్ద బాలశిక్ష'''''గా కొత్త పేరును దాల్చింది. ఈ పెద్ద బాలశిక్ష ఇందులో విషయపరిజ్ఞానికి-అంటే భాషాసంస్కృతులకు కావాల్సిన పునాదిరాళ్ళనదగిన భాషా విషయాలు- అక్షరాలు, గుణింతాలు వత్తులు, సరళమైన పదాలు- రెండు మూడు నాలుగు అక్షరాలతో కూడిన మాటలు, తేలిక వాక్యాలు- నీతి వాక్యాలు, ప్రాస వాక్యాలు, సంప్రదాయ సంస్కృతికి సంబంధించినవీ, అందరూ తెలుసుకోదగ్గవీ నాటికి తెలిసిన చారత్రిక, భౌగోళిక, విజ్ఞాన సంబంధ విషయాలను రూఢి వాచకాలను ఈ పుస్తకం ఆది స్వరూపంలోనే ఆనాడు పూదూరువారు పొందుపరచారు.
 
"https://te.wikipedia.org/wiki/పెద్ద_బాలశిక్ష" నుండి వెలికితీశారు