కొలాములు: కూర్పుల మధ్య తేడాలు

→‎సామాజిక జీవనం: కాపీహక్కులు లేని బొమ్మ తొలగింపు
→‎సామాజిక జీవనం: +భాష గురించి
పంక్తి 7:
==సామాజిక జీవనం==
కొలాములు ప్రధానంగా ఆ సమూహంలో ఉన్న వాళ్ళను కాకుండా, బయటి సమూహాలకు చెందిన కొలాములనే పెళ్ళి చేసుకుంటారు (Exogamy). కొలాముల గణదేవత "ఆయక", గోండీలో "భీమల్" అని వ్యవహరిస్తారు. సంరక్షిత అటవీప్రాంతాల పేరుతో బలవంతంగా గెంటేసిన ఆదివాసుల్లో కొలాములు కూడా వున్నారు.<ref>[http://publishing.cdlib.org/ucpressebooks/view?docId=ft8r29p2r8&chunk.id=d0e1758&toc.depth=1&toc.id=d0e1668&brand=eschol Tribes of India - The Struggle for Survival Christoph von Fürer-Haimendorf (1982)]</ref> అలా చెల్లాచెదురైన కొలాములు ఏ పండుగకో, పబ్బానికో సంరక్షిత అటవీప్రాంతంలోని వీరి గత జీవితానికి అవశేషాలుగా మిగిలిపోయిన ఆయక గణదేవత [[ఆలయం]]లో కలుసుకుంటారు. [[ప్రార్థన]]లు మన్నించి, ఆపదలలో ఆదుకొనే దేవతగా కొలాములు ఆయక గణదేవతను భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఈ దేవాలయాల సంరక్షణ ఆ సమూహంలోని ''[[పూజారి]]'' బాధ్యత. [[దేవత]]ల కోపాలు చల్లార్చడంలో, జరగబోయేది ముందుగా చెప్పడంలో కొలాములు ఆరితేరిన వారని గోండ్లు నమ్ముతారు. అందుకే తమ పండుగలు, [[కృతువు]]లు, [[కొండదేవత]], [[అడవిదేవత]] పూజలు జరిపించే బాధ్యతను కొలాములకే అప్పజెప్పుతారు. ఈ కారణంగానే కొలాము తెగను గోండులు "పూజారి" అని వ్యవహరిస్తారు.
 
==కొలామీ భాష==
కొలాములు మాట్లాడే కొలామీ భాష, మధ్య ద్రవిడ భాషా కుటుంబానికి చెందిన భాష. ఈ భాషకు ప్రస్తుతానికి లిపి లేదు. కొలామీ భాషను ఒక ప్రత్యేక ద్రవిడ భాషగా తొలుత భాషావేత్త గ్రియర్‌సన్ గుర్తించాడు. మధ్య ద్రవిడ భాషగా కొలామీ, గదబ, నాయికీ మరియు పర్జీ భాషలకు దగ్గరగా ఉంటుంది.<ref name=Steever>[http://books.google.com/books?id=CF5Qo4NDE64C&pg=PA301&lpg=PA301&dq=kolami+language#v=onepage&q=kolami%20language&f=false The Dravidian languages By Sanford B. Steever]</ref> కొలామీ భాషలో నాలుగవ వంతు పదాలు మరాఠీ నుండి అరువు తెచ్చుకున్నప్పటికీ, ఈ భాషకు తెలుగు, కన్నడ భాషలతో సారూప్యత ఉన్నది. కొన్ని విధాలుగా ఇది తెలుగును, మరికొన్ని విధాలుగా కన్నడను పోలి ఉంటుంది. కొందరు భాషావేత్తలు కొలామీ భాష కన్నడ, తెలుగు భాషలకు ఉమ్మడి మాతృక అయిఉండవచ్చని భావిస్తున్నారు. ఈ భాషకు ముఖ్యంగా మూడు మాండలికాలు ఉన్నాయి. అవి అదిలాబాదు, నాయిక్రీ, వార్ధా మాండలికాలు.<ref name=Steever /> కొలామీ భాష యునెస్కో ప్రకటించిన అంతరించిపోతున్న భాషల్లో ఒకటి.<ref>http://www.dailypioneer.com/242724/Centre-pays-lip-service-to-languages-facing-extinction.html</ref> కొలామీ మాతృభాషగా మాట్లాడే వారి సంఖ్య క్రమంగా క్షీణిస్తుంది. నాగరికత వ్యాప్తి వలన కొలామీలు హెచ్చుసంఖ్యలో మరాఠీ, తెలుగు భాషలను ఉపయోగిస్తున్నారు.
 
కొలామీ భాషపై పరిశోధన చేసి పి.సేతుమాధవరావు 1950లో కొలామీ భాష యొక్క వ్యాకరణాన్ని ప్రచురించాడు. ఆ తరువాత 1950-51లలో ఆక్స్‌ఫర్డుకు చెందిన ఆచార్యుడు టి.బర్రో మరియు ఆంత్రొపాలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియాకి చెందిన సిద్ధిభూషన్ భట్టాచార్యలు అనేక గ్రామాలలో కొలామీ భాషా పదాలను సేకరించారు<ref name=emeneau>[http://books.google.com/books?id=JqYMTdBws40C&pg=PA338&lpg=PA338&dq=kolami+language#v=onepage&q=kolami%20language&f=false Current Trends in Linguistics]</ref> ఎమెనూ 1937-38లో వార్ధాకు 19 మైళ్ల దూరంలో ఉన్న మండ్వా గ్రామంలో ఈ భాషకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాడు. అందుకే ఆయన సేకరించిన మాండలికానికి వార్ధా మాండలికం అని పేరుబడింది. ఎమెనూ వార్ధా మాండలికంతో పాటు సేతుమాధవరావు సేకరించిన అదిలాబాదు మాండలికం యొక్క వివరాలతో పాటు, బర్రో, భట్టాచార్యలు సేకరించిన సమాచారం ఆధారంగా కిన్వట్, పంఢర్‌కవ్రా మాండలికాల సమాచారాన్ని పొందుపరచాడు.<ref name=Steever /> ముర్రే ఎమెనూ 1955లో ''కొలామీ - ఏ ద్రవిడియన్ లాంగ్వేజ్'' అనే పుస్తకంగా ప్రచురించాడు.<ref name=emeneau />
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కొలాములు" నుండి వెలికితీశారు