టేకుమళ్ళ అచ్యుతరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''టేకుమళ్ళ అచ్యుతరావు''' (జ: 18 ఏప్రిల్, 1880 - మ: 12 ఫిబ్రవరి, 1947) ప్రముఖ విమర్శకులు మరియు పండితులు.<ref>[http://www.vepachedu.org/manasanskriti/tekumallaa.html టేకులళ్ళ గురించి వేపచేడు వెబ్ సైటులో.]</ref>
 
వీరు [[విశాఖపట్టణం జిల్లా]]లోని [[పోతనవలస]] గ్రామంలో రామయ్య మరియు వెంకమ్మ దంపతులకు [[విక్రమ]] నామ సంవత్సరం [[చైత్ర శుద్ధ నవమి]] రోజున జన్మించారు. వీరు ఎఫ్.ఎ.ను [[పర్లాకిమిడి]] లోను మరియు బి.ఎ.ను [[విజయనగరం]]లోను పూర్తిచేశారు. బి.ఎ. పరీక్షలో ఆంగ్లంలో ప్రథముడిగా నెగ్గి మెక్డోడాల్డ్ మెడల్ సాధించారు. తర్వాత [[రాజమండ్రి]]లోని ప్రభుత్వ కళాశాలలోచేరి ఎల్.టి. పరీక్షలో ఉత్తీర్ణులై అక్కడనే ఉపాధ్యాయులుగా పనిచేశారు. వీరు పాఠశాలల అసిస్టెంట్ ఇన్ స్పెక్టర్ పదవిని అలంకరించి క్రమంగా ఉపాధ్యాయ ట్రయినింగ్ కళాశాల హెడ్ మాస్టరు పదవిని పొంది 1934లో పదవీ విరమణ చేసేవరకు ఆ పదవిలోనే ఉన్నారు. వీరు 1900లో భమిడిపాటి ద్వారకా విశాలాక్షిని పరిణయమాడారు.
 
వీరు రచించిన "విజయనగర ఆంధ్ర వాజ్మయ చరిత్ర", కవి జీవిత విశేషాలను, కవికృత కావ్యాల విమర్శలను సమానంగా పర్యాలోకించిన సారస్వ గ్రంథంగా పేరుపొందినది. [[పింగళి సూరన]] రచించిన గ్రంథాలను గురించి వీరు ఆంగ్లంలో విపులమైన విమర్శను రచించి దానికి "పింగళి సూరనార్యుని జీవితం, కృతులు" అను ఆంగ్ల నామంతో 1941లో ప్రచురించారు.<ref>[http://www.archive.org/details/pingalisuranarya035059mbp పింగళి సూరనార్య, ఇంటర్నెట్ ఆర్కీవులో లభ్యం.]</ref> దీనిని పిఠాపురం మహారాజా సూర్యారావు బహదూరు వారికి అంకితమిచ్చారు. వీరు "ఆంధ్ర పదములు - పాటలు" మరియు "ఆంధ్ర నాటకాలు - రంగ స్థలాలు" అనే గ్రంథాల్ని కూడా రచించారు.
 
వీరు 12 ఫిబ్రవరి, 1947లో [[మద్రాసు]]లో పరమపదించారు. వీరికి ఇద్దరు కుమారులు మరియు ఒక కుమార్తె. ప్రముఖ రచయిత [[టేకుమళ్ళ కామేశ్వరరావు]] వీరి కుమారుడు.
 
==మూలాలు==