చక్రవర్తి రాజగోపాలాచారి: కూర్పుల మధ్య తేడాలు

చి I corrected a spelling mistake in the first paragraph. It was a small mistake.
పంక్తి 9:
| religion = [[హిందూ మతం|హిందూ]]
}}
'''రాజాజీ'''గా ప్రసిద్ధుడైన '''చక్రవర్తి రాజగోపాలాచారి''' (Chakravarthi Rajagopalachari) స్వతంత్రస్వాతంత్ర సమరయోధుడు మరియు రాజకీయవేత్త. స్వతంత్ర భారతదేశపు రెండవ మరియు చివరి గవర్నర్ జనరల్. ఆయన సంయుక్త మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1937లో పనిచేశాడు. భారతదేశపు అత్యున్నత పౌరపురస్కారమైన [[భారతరత్న]]ను పొందిన తొలివ్యక్తులలో ఒకడు (1954లో). రాజాజీ [[తమిళనాడు]] రాష్ట్రములోని [[సేలం]] జిల్లా, [[తోరపల్లి]] గ్రామములో [[1878]], [[డిసెంబర్ 10]]న జన్మించాడు.
 
==బాల్యం==
రాజాజీ డిసెంబరు 10, 1878 న సాంప్రదాయ వైష్ణవ బ్రాహ్మణ కుటుంబీకులైన చక్రవర్తి అయ్యంగార్, సింగారమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన స్వస్థలం తమిళనాడు, సేలం జిల్లాలోని తోరపల్లి అనే గ్రామము. ఇది పారిశ్రామిక పట్టణమైన హోసూరుకు దగ్గర్లో ఉంటుంది. ఆయన తండ్రి చక్రవర్తి అయ్యంగార్ తోరపల్లి గ్రామానికి మునసబు. ఆయన పాఠశాల విద్య [[హోసూరు]] లోనూ, కళాశాల విద్య [[చెన్నై]] మరియు [[బెంగళూరు]] లోనూ జరిగింది. 1897 లో [[బెంగళూరు]] లోని సెంట్రల్ కళాశాల నుంచి ఆర్ట్స్ లో పట్టభద్రుడయ్యాడు. 1899 లో మద్రాసులో ప్రెసిడెన్సీ కళాశాల నుంచి న్యాయ శాస్త్రాన్ని అభ్యసించాడు. 1900 లో న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించాడు.సాలెం లో ఉండగానే ఆయన సామాజిక, రాజకీయ స్థితిగతులపై ఆసక్తి చూపేవాడు.
==భారత స్వాతంత్ర్యోదమం==
రాజకీయాల్లో రాజాజీ ప్రస్థానం సాలెం పట్టణానికి ప్రతినిథిగా ఎన్నికవడంతో ప్రారంభమైంది. 1900 మొదటి దశాబ్దంలో ప్రముఖ జాతీయవాది [[బాలగంగాధర తిలక్]] పట్ల ఆకర్షితుడయ్యాడు. 1917 లో సాలెం పట్టణ మునిసిపాలిటీకి చైర్మన్ గా ఎన్నికయ్యాడు<ref name="pillarsp88">{{cite book|title=Pillars of Modern India, 1757-1947|first=Syed Jafar|last=Mahmud|page=88|year=1994|publisher=APH Publishing|isbn=8170245869, ISBN 9788170245865}}</ref>. సాలెం ప్రభుత్వంలో మొట్టమొదటి దళిత ప్రతినిథి కూడా ఆయన చొరవతోనే ఎన్నికయ్యాడు. తరువాత ఆయన [[భారత జాతీయ కాంగ్రెస్]] లో చేరి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనడం ప్రారంభించాడు. 1908 లో వరదరాజులు నాయుడు అనే స్వాతంత్ర్య పోరాట యోధుడికి తరపున ప్రభుత్వ ధిక్కారం కేసుకు వ్యతిరేకంగా న్యాయస్థానంలో వాదించాడు. 1919లో రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో పాల్గొన్నాడు. ప్రముఖ జాతీయవాది వీఓ చిదంబరం పిళ్ళై ఈయనకు మంచి స్నేహితుడు. [[అనీబిసెంట్]] కూడా రాజాజీని అభిమానించేది.