64,775
edits
రాహువు క్రూర రూపము కలవాడు, పొడగరి, నల్లని మేని ఛాయ కలవాడు. నాలుగు భుజములు గలవాడు. కత్తి, త్రిశూలమును ధరించి కవచ ధారణ చేసి ఉంటాడు. సింహాన్ని అధిరోహించి ఉంటాడు. తండ్రి కశ్యపుడు, తల్లి సింహిక. పార్ధివ నామ సంవత్సరం భాద్రపద శుక్ల పూర్నిమ నాడు పూర్వాభద్రా నక్షత్రములో జన్మించాడు. రాహువు క్షీర సాగర మధన సమయంలో దేవతా రూపం ధరించి మోహినీ చేతి అమృతపానం చేసాడు. దానిని సూర్య, చంద్రులు విష్ణు మూర్తికి చెప్పడంతో విష్ణువు అతడి తలను మొండెం నుండి వేరు చేయడంతో పాము శరీరం పొందాడు. విష్ణు మూర్తి అతడిని అనుగ్రహించి గ్రహ మండలంలో స్థానం కల్పించాడు. అప్పటి నుండి సూర్యచంద్రులకు శత్రువై గ్రహణ సమయాన కబళించి తిరిగి విడుస్తుంటాడని పురాణ కధనం వివరిస్తుంది.
=== పరిహారం ===
రాహువును శాంతింప చేయడానికి చేయవలసిన పరిహార విధులు. ప్రతిమకు కావలసిన లోహము సీసం, ప్రతిమకు పూజకు గ్రహ ఆసనం చేట, సమిధ దూర్వ, నైవేద్యం మినప సున్ని, మినప గారెలు, ఖర్జూరం, చేయవలసిన పూజ అధిష్టాన దేవత అయిన సరస్వతి పూజ, దుర్గా పూజ, సుభ్రహ్మణ్య స్వామి పూజ, శివారాధన, రాహుకాలంలో దుర్గకు నిమ్మకాయ దీపం పెట్టడం. ఇది దేవాలయంలో దుర్గాదేవి సన్నిధిలో చేయాలి. ఇంట్లో అయితే నేతి దీపం పెట్టాలి.ఆచరించ వలసిన వ్రతం సరస్వతి వ్రతం, రాహువుకు ప్రియమైన తిధి చైత్ర బహుళ ద్వారశి, పారాయణ చేయవలసినవి రాహు అష్టోత్తరం, లలితా సహస్రనామం, ఆచరించవలసిన దీక్ష భవానీ దీక్ష, ధరించవలసిన మాల రుద్రాక్ష మాల, అష్టముఖ రుద్రాక్ష, రత్నము గోమేధికము, దర్శించవలసిన దేవాలయములు సరస్వతి, దుర్గ, సుభ్రహ్మణ్య స్వామి దేవాలయం, శివాలయాలు, నవగ్రహాలయాలు. దానం చెయ్యవలసినవి ఎండు ద్రాక్ష, తేనె, ఖర్జూరములు. చేయవలసిన జపసంఖ్య పద్దెనిమిది వేలు.
|