రాహువు జ్యోతిషం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
కాని ఆధునిక శాస్త్రంలో రాహువుకు అధిక ప్రాముఖ్యత ఇస్తున్నారు. రాహువు పాపగ్రహం. రాహువు ఏగ్రహంతో కలిసి ఉంటే ఆ ఫలితాలను ఇస్తాడు. రాహువు శరీరం దిగువ భాగం పాము శరీరం ఉంటుంది. అందుకనే రాహువుకు విషముతో అధిక ప్రాముఖ్యత ఉంటుంది. ఎప్పుడూ రోదశీలో ఉండే సూర్యుడిని కొంత కాలం కనిపించకుండా చేస్తాడు కనుక కల్పనా జగత్తుకు ప్రతీకగా జ్యోతిష పండుతులు విశ్వసిస్తారు. కళాకారుల జీవితంలో రాహువు ప్రధాన పాత్ర పోషిస్తాడని జ్యోతిష శాత్ర పండితులు విశ్వసిస్తారు.
=== గుణగణాలు ===
రాహువు తమోగుణ ప్రధానుడు, గ్రహ సంఖ్య రెండు, అధిదేవత గౌరి, ముసలి వారిని సూచిస్తాడు. బుధుడు, శుక్రుడు, శని మిత్రులు. సూర్యుడు, చంద్రుడు, కుజుడు శత్రువులు. గురువు సముడు. స్వక్షేత్రం కుంభం, శత్రు క్షేత్రం సింహం, మిత్ర క్షేత్రం తుల. అసుర, బహి, స్వర్భాను, తమస అనేవి ఇతర నామాలు. జాతి మ్లేచ్ఛ, స్వాభావము క్రూరము, రుచులలో పులుపును సూచిస్తాడు. ప్రదేశం పాములు తిరిగే ప్రదేశం. దిక్కు నరుతినైరుతి, పాలనా శక్తి భటుడు, ఆత్మాధికారం కష్టాలు, లోహము సీసం, గృహ స్థానం ఉపయోగంలో లేని ప్రదేశం, గ్రహపీడ సంతాన లేమి, గ్రహం రాశిలో ఉండే కాలం ఒకటిన్నర సంవత్సరం. వృక్షము పొదలు, ఆహార పదార్ధాలు మినుములు, ఖర్జూరం, ఆవాలు. జంతువులు ఏనుగు, పాములు అడవి ఎలుకలు. వస్తువు గొడుగు, సమిధ దుర్వ, మూలిక చందనం, దేవ వర్గం శైవ, అవతారం వరాహావతారం.
 
=== కారకత్వం ===
రాహువు పితామహుడు (తాత), వృద్ధాప్యము, శ్వాస, భాష, అసత్యము, భ్రమ, వాయువు, విచారము, జూదము, కఫము, సంధ్యా సమయం, బయట ప్రదేశం, గొడుగు, పల్లకి, అపరి శుభ్రం, గొడుగు, పల్లకి, విమర్శ, అంటరాని తనం, నల్లులు, దోమలు, గుడ్లగూబలు, విషకీటకములను సూచిస్తాడు.
"https://te.wikipedia.org/wiki/రాహువు_జ్యోతిషం" నుండి వెలికితీశారు