వడ్డీ: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: ru:Процентный доход
పంక్తి 37:
== మీటర్ వడ్డీ==
రోజుకు ఇంత అని చెల్లించాల్సి ఉంటుంది.వడ్డీ అసలును మించి పోతుంది.రోడ్డు పక్కన తోపుడు బండ్లు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు తమ వ్యాపారానికో, ఇంటి అవసరాలకో రోజువారి వడ్డీ తీసుకుంటున్నారు. రోజంతా రెక్కలు, ముక్కలు చేసుకొని సంపాదించిన దాంట్లో అధిక మొత్తం సాయంత్రానికి వడ్డీ వ్యాపారికి ముట్ట చెప్పుకుంటున్నారు.పరిస్థితులు బాగోలేక సెలవు తీసుకుంటేనో, వ్యాపారం జరగకపోతేనో ఆరోజు వారు వణికిపోవాల్సిందే. ఆ తరువాతిరోజు రెండు రోజుల మొత్తం కలిపి చెల్లించాల్సి ఉంటుంది. రూ.10వేలు రోజువారి వడ్డీకి తీసుకుంటే రూ.వెయ్యి మినహాయించుకొని రూ.9000 చేతిలో పెడతారు. రోజుకు రూ.100 చొప్పున 100 రోజుల్లో రూ.10వేలు చెల్లించాల్సి ఉంటుంది.ఉదయం రూ.800 ఇస్తే సాయంత్రం రూ. వెయ్యి ఇవ్వాలి
==[[మైక్రో ఫైనాన్స్]] వడ్డీ==
ఈ సంస్థలు పోటీపడి గ్రామీణ ప్రాంతాల్లో పేదవర్గాలకు రుణాలు ఇస్తున్నాయి. గ్రూపులను ఏర్పాటుచేసి లీడర్‌ను బాధ్యురాలిగా చేస్తున్నారు. ఆయా గ్రూపుల పనితీరు ఆధారంగా రూ. 10 వేలు నుంచి రూ. 50 వేలు, లక్ష వరకు రుణాలు ఇస్తున్నారు. వారు తీసుకున్న మొత్తాన్ని బట్టి వారానికి ఒకసారి కిస్తీ చెల్లించాలి.చెల్లించని పక్షంలో సంస్థ ప్రతినిధుల రౌడీయిజంతో మహిళలను వ్యభిచారంలో దించుతున్నారు.కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.బంగ్లాదేశ్‌లో [[మహ్మద్‌ యూనస్‌]] అంతర్జాతీయ సమాజం నుంచి తక్కువ వడ్డీకి నిధుల్ని లేదా గ్రాంటుల్ని తెచ్చి నిరుపేదలకు నామమాత్రపు వడ్డీకి అందించి పేదరికం నుంచి వారిని బయటపడేయడానికి సూక్ష్మరుణ వ్యవస్థ ఏర్పాటు చేశారు.మన రాష్ట్రంలో కూడా పొదుపును బృందాల నుంచే సేకరించి, వాళ్లకే తక్కువ వడ్డీకి ఒక్కో అవసరానికి ఒక్కో రేటుతో అప్పులిచ్చి, వచ్చిన లాభాలను తిరిగి ఆ బృందాలలోని సభ్యులకే పంచే ఆరోగ్యకరమైన సహకార రుణ వ్యవస్థ ప్రయత్నం జరిగింది.ప్రస్తుతం మైక్రో ఫైనాన్స్‌ విధానం పేదల్ని పీల్చి పిప్పిచేసే భయంకరమైన వ్యాపారంగా మారింది.బ్యాంకులనుండి సాధారణ వడ్డీకి తెచ్చిన సొమ్మును పేదలకు అప్పులిచ్చి 40 - 50 శాతం వడ్డీని వసూలు చేస్తున్నారు.
 
==తాకట్టు పేరుతో ఇళ్ళు, స్థలాలు స్వాధీనం==
తనఖా పేరుతో ఇళ్లు, స్థలాలతో పాటు ఆభరణాలు, ఇతర ఆస్తులను వడ్డీ వ్యాపారులు మింగేస్తున్నారు.వడ్డీకి తీసుకునే వారు తమ ఇల్లు లేదా స్థలం లేదా బంగారాన్ని తాకట్టు పెడుతున్నారు.ఆ మొత్తం చెల్లించలేని స్థితిలో వడ్డీ వ్యాపారులు బలవంతంగా ఆయా స్థలాలు, ఇళ్లను స్వాధీనం చేసుకుంటున్నారు. రౌడీషీటర్లు, గూండాలు ఏం చేస్తారో అనే భయంతో బాధితులు పోలీసు స్టేషన్ వరకు రాలేకపోతున్నారు. ఒకరికి వడ్డీ చెల్లించడానికి మరొకరి వద్ద అప్పు చేయడం, వారి వడ్డీ చెల్లించడానికి వేరొకరి వద్ద అప్పులు చేస్తూ కష్టాలలో మునిగి పోతున్నారు.
"https://te.wikipedia.org/wiki/వడ్డీ" నుండి వెలికితీశారు