మరాఠీ భాష: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: fr:Marathi (langue)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
|notice=Indic}}
 
'''మరాఠీ''' (मराठी ''{{unicode|Marāṭhī}}'') ఒక [[ఇండో-ఆర్యన్ భాషలు|ఇండో-ఆర్యన్ భాష]], దీనిని పశ్చిమ భారతదేశంలోని మరాఠీ ప్రజలు ఉపయోగిస్తారు. ఇది [[మహారాష్ట్ర]] యొక్క అధికార భాష. ప్రపంచంలో దాదాపు 9 కోట్ల మంది ప్రజలు ఈ భాష మాట్లాడుతారు. భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాషలలో నాలుగవ స్థానంలో వున్నది.<ref>[http://www.censusindia.gov.in/Census_Data_2001/Census_Data_Online/Language/Statement1.htm Abstract of Language Strength in India : 2001 Census]</ref> మరియు ప్రపంచంలో 15వ భాష.<ref name="encarta" />. [[బెంగాలీ]] భాషతో బాటు మరాఠీ భాష కూడా ఇండో-ఆర్యన్ భాషలలో ప్రాచీన ప్రాంతీయ భాష. ఇది క్రీ.శ్. 1000 నుండి మాట్లాడబడుచున్నది.<ref>arts, South Asian." Encyclopædia Britannica. Encyclopædia Britannica 2007 Ultimate Reference Suite.</ref>మరాఠీ 1300 సంవత్సరాల వయస్సు గలది,<ref name="bhasha">[http://bhashaindia.com/Patrons/LanguageTech/Marathi.aspx BhashaIndia.com-Marathi]</ref> మరియు [[సంస్కృతం]] నుండి "ప్రాకృతం" మరియు [[అపభ్రంశ]] ద్వారా ఆవిర్భవించింది. దీని గ్రామరు [[పాలీపాళీ]] భాష నుండి గ్రహించబడినది. ప్రాచీనకాలంలో మరాఠీ భాషను "మహారాష్ట్రి" అని "మర్హటీ" అని "మహ్రాట్టి" అని పిలిచెడివారు.
== మరాఠీ వినియోగంకోసం హైకోర్టు ==
ముంబై హైకోర్టు కోర్టుకు సంబంధించిన పత్రాలు, పిటిషన్ల డాక్యుమెంట్లను మరాఠీలోకి అనువదించే విషయంలో ఓ నిర్ణయం తీసుకునేందుకు ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ఫుల్ బెంచ్‌ను ఏర్పాటు చేసింది. మరో పక్క న్యాయవ్యవస్థలోని కింది స్థాయి సిబ్బంది నియామకం కోసం మరాఠీ మాధ్యమంలో పరీక్షలు నిర్వహించడంలో సాధ్యాసాధ్యాల్ని పరిశీలిస్తోంది. ఎంపీఎస్సీ నిర్వహించే జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్‌క్లాస్ పరీక్షల్లో మరాఠీని ప్రత్యామ్నాయ భాషగా గుర్తించాలని థానేకు చెందిన 'మరాఠీ భాషా వికాస్ ఆని సంరక్షణ సంస్థ' ఓ పిటిషన్‌ను దాఖలు చేసింది. ప్రస్తుతం ఆ పరీక్షను ఆంగ్లంలో రాయాల్సి ఉంటుంది. అభ్యర్థికి ఆంగ్లంతో పాటుగా మరాఠీపై ఉన్న పరిజ్ఞానాన్నీ తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఓ పరీక్షాపత్రం ఉండాలని ఆ పిటిషన్‌లో సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.'పశ్చిబెంగాల్, హర్యానా, రాజస్థాన్, ఒరిస్సా రాష్ట్రాల్లో స్థానిక భాషల్ని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ పరీక్షల్లో వినియోగిస్తున్నారు. కోర్టుల్లో రాష్ట్ర భాషల్ని ఉపయోగించుకునే వెసులుబాటును క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సవరణలు కల్పించాయి. కిందిస్థాయి కోర్టుల్లో కనీసం 50 శాతం తీర్పులు మరాఠీలోనే ఉండాలని హైకోర్టు 2005లోనే అభిప్రాయపడింది.
"https://te.wikipedia.org/wiki/మరాఠీ_భాష" నుండి వెలికితీశారు