నెరణికి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
==దేవరగట్టు జాతర==
నెరణికి గ్రామ శివార్లలోని మాళమల్లేశ్వరస్వామి దేవాలయంలో 'బన్ని ఉత్సవాలు [[దసరా]] పండుగ సందర్భంగా జరుగు తాయి. ఈ ఉత్సవం రాత్రి 12 నుంచి తెల్లవారు ఝామున 3 గంట ల వరకు నిర్వహిస్తారు. మూడు గ్రామాల ప్రజలు ఒక వైపు, 30 గ్రామాల ప్రజలు మరోవైపు ఉత్సవ విగ్రహాలను తీసుకెళ్లేందుకు పోటీ పడతారు. నెరణికి గ్రామం నుంచి ఉత్సవ విగ్రహాలను 'బహు పరాక్‌ అంటూ కర్రలతో దేవరగట్టు దేవాలయం వరకు తీసుకొస్తారు. ఈ ఉత్సవాల్లో ప్రజలు కర్రలతో కొట్టుకుంటూ దేవుడి ఊరేగింపులో పాల్గొంటారు. హింసాత్మకంగా జరిగే ఈ ఉత్సవాల్లో కర్ర దెబ్బలకు తలలు పగలడం సర్వ సాధారణం. ఈ హింసను ఆపాలని ప్రభుత్వం చేసిన పలు ప్రయత్నాలు ప్రజలను నిలువరించలేకపోయాయి. కర్రలు లేనిదే [[బన్ని ఉత్సవం]] జరగదు. ప్రతి ఏటా దసరా సందర్భంగా జరిగే దేవరగట్టు జాతరలో హింస ఆగటంలేదు. మాళమల్లేశ్వర స్వామి భక్తులు విజయ దశమి ఉత్సవాలను పురస్కరించుకుని అనాగరికంగా కర్రలతో పరస్పరం కొట్టుకుంటారు. జిల్లా కలెక్టర్‌ ‌, ఎస్పీ , అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సామాజిక హితుల హితోపదేశాలు, భారీ పోలీస్‌ బందోబస్తు, వందల సంఖ్య నాటు సారా బట్టీల ధ్వంసం, కర్రల స్వాధీనం, మానవ హక్కుల కమిషన్‌ ఆదేశాలు.... ఇవేవీ దేవరగట్టు భక్తుల కర్రల సమరోత్సహానికి అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. కొందరు బలి అయితే కొందరు భక్తుల తలలు పగిలి ఉత్సవంలో రక్తం పారుతుంది. వందలకు పైగా పోలీస్‌ అధికారులు, సిబ్బంది, సాయుధ బలగాలు వున్నప్పటికీ వేల సంఖ్యలో భక్తులు కర్రలతో ఒక్కసారిగా సమరంలో దిగడంతో చేష్టలుడిగిపోతారు. చివరకు ప్రేక్షకులుగా మిగిలిపోతారు. ఎవరు చెప్పినా కర్రల యుద్ధం ఆగదు. సంప్రదాయం ప్రకారం కర్రలతో 'బహుపరాక్‌ అంటూ కేకలు వేస్తూ కొట్టుకోవటం ఆచారం. ఈ నేపథ్యంలో కర్రల తాకిడిలో చాలా మందికి గాయాలు కావటం, ఒక్కో సారిఒక్కోసారి ప్రాణాలు కోల్పోవటం జరుగు తుండేది. నెరణికి, నెరణికి తండా, కొత్తపేట, అరికెర, ఎల్లార్తి, సుళువాయి, అరికెర తండా, ఆలూరి గ్రామాల ప్రజలు మాళ మల్లేశ్వరస్వామిని తమ గ్రామాలకు తరలించేందుకు కర్రల సమరాన్ని చేస్తారు.ఉత్సవంలో ఇనుప తొడుగులు లేని కర్రలను వాడాలని పోలీసులు చేసిన సూచనలు భక్తులు వినరు.కర్రల సమరాన్ని తిలకించేందుకు కర్ణాటక, ఆంధ్రా, మహారాష్ట్ర నుంచి దాదాపు లక్ష మందికి పైగా హాజరవుతారు.
 
==మూలాలు వనరులు==
*http://www.eenadu.net/story.asp?qry1=4&reccount=26
*http://www.vaartha.com/content/2763/devaragattu-contravercy.html
 
"https://te.wikipedia.org/wiki/నెరణికి" నుండి వెలికితీశారు