"పిండి" కూర్పుల మధ్య తేడాలు

53 bytes added ,  9 సంవత్సరాల క్రితం
చి
యంత్రము కలుపుతున్నది: bjn:Galapung; cosmetic changes
చి (యంత్రము కలుపుతున్నది: so:Bur)
చి (యంత్రము కలుపుతున్నది: bjn:Galapung; cosmetic changes)
{{విస్తరణ}}
[[Imageదస్త్రం:Wheatflour rw.jpg|thumb|300px|Wheat flour]]
 
'''పిండి''', '''పొడి''' లేదా '''చూర్ణం''' ([[ఆంగ్లం]]: '''Flour''') [[ఆహారధాన్యాలు|ఆహారధాన్యాల]] నుండి తయారుచేసే మెత్తని పదార్ధము. ఇది ప్రపంచంలోకెల్లా ప్రధాన ఆహారమైన [[రొట్టి]]కి మూలం. అమెరికా మరియు ఐరోపా ఖండాలలో [[గోధుమ పిండి]] ముఖ్యమైనది. [[జొన్న పిండి]] ప్రాచీనమైన మెసపుటోమియా మరియు లాటిన్ అమెరికా సంస్కృతులలో ముఖ్యమైనది. ఈ ధాన్యాలను [[మిల్లు]] లేదా [[పిండి మర]] లో ఆడించి పిండిగా చేస్తారు. కొన్నింటిలో పొట్టును వేరుచేయాల్సి ఉంటుంది.
 
పిండి చేసిన గింజలలో ముఖ్యంగా [[పిండి పదార్ధాలు]] ఉంటాయి. [[కార్బోహైడ్రేట్లు]] లేదా పాలీసాకరైడ్లు వీనిలో ప్రధానమైనవి.
 
 
== పిండిలో రకాలు ==
* గోధుమ పిండి :
* [[మైదా పిండి]]
* వరి పిండి :
* శెనగ పిండి :
* నువ్వు పిండి :
* కంది పొడి
* నువ్వుల పొడి
* కారం పొడి
 
== పిండి ఉపయోగాలు ==
* ప్రతి రోజూ మనం తినే [[రొట్టెలు]], [[చపాతీ]], [[పూరీ]], [[పరాఠా]] మొదలైనవి చేసుకోవాలంటే గోధుమ పిండి అవసరం.
* రకరకాల [[అట్లు]] లేదా [[దోసెలు]] కొన్నింటికి మూలమైనది పిండి. కొన్ని అట్లు ఒకటి కంటే ఎక్కువ పిండి రకాలు కలిపి చేస్తారు.
* [[పిండి వంటలు]] అన్నింటికి పిండి ఒక మూల పదార్ధం.
* కొన్ని రకాల పొడుల్ని మసాలా దినుసులతో ఉప్పు, కారం కలిపి ఉపాహారంగా నంచుకోవడానికి వాడుతాము. నువ్వుల పొడి, కంది పొడి, మొదలైనవి.
 
== తయారుచేయు విధానం ==
* ముందుగా పిండి చేయాల్సిన ఆహార ధాన్యాల్ని కావలసినన్నింటిని తడి లేకుండా ఎండబెట్టాలి. రాళ్ళు లేకుండా ఏరుకోవాలి. కొన్నింటిని ముందుగా కడగవలసి వుంటుంది.
* [[రోలు]] మరియు [[రోకలి]] ఉపయోగించి దంచుకొని, మధ్య మధ్యలో పిండి [[జల్లెడ]]తో జల్లించి పిండిని, నూకల్ని వేరుచేసుకోవచ్చును. ఇలా మళ్ళీ మళ్ళీ దంచుకొంటుంటే మొత్తం గింజలన్నీ పిండిగా మారిపోతాయి. కొద్దిగా మిగిలిపోవచ్చును.
* ఈ ఆధునిక కాలంలో [[పిండి మర]] లో కావలసిన వాటిని శుభ్రం చేసుకున్న తర్వాత క్షణాల్లో పిండిగా మార్చవచ్చును.
* కొన్ని సందర్భాలలో పిండి నుండి పొట్టును వేరుచేయడానికి సన్నని జల్లెడ పట్టించాల్సి వస్తుంది.
 
[[en:Flour]]
[[bar:Mej]]
[[bg:Брашно]]
[[bjn:Galapung]]
[[bn:ময়দা]]
[[ca:Farina]]
20,329

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/550686" నుండి వెలికితీశారు