దానం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
 
==పురాణాలలో దానం==
*[[వైశాఖమాసము]] దానాలు ఇవ్వడానికి ప్రశస్తమైన మాసంగా పురాణాలు పేర్కొన్నాయి.
*[[బలి చక్రవర్తి]] మూడడుగులు విష్ణుముర్తికి దానం చేసి చిరస్మరణీయుడైనాడు.
*[[శిబి చక్రవర్తి]] పావురం రూపంలో వచ్చిన దేవతలకు తన శరీరాన్ని కోసి దానం ఇచ్చిన ఉత్తముడు.
*[[కర్ణుడు]] తనకు సహజంగా ఉన్నకవచకుండలాలను రక్షకకవచాన్ని దానం చేసి "దాన కర్ణుడి"గా నిలిచాడు.
*[[ఏకలవ్యుడు]] తన బొటనవేలును కోసి ఇచ్చాడు
 
==ఆస్తి దానం==
అమెరికాలోని సంపన్నులంతా తమ ఆస్తిలో సగభాగాన్ని దాతృత్వ కార్యక్రమాలకు కేటాయించేందుకు ప్రతినబూనాల్సిందిగా బఫెట్‌, బిల్‌గేట్స్ పిలుపునిచ్చారు. అమెరికాలో దాదాపు 400 మంది బిలియనీర్లున్నారు. వీరంతా తమ సంపదలో అధిక భాగాన్ని దానధర్మాలకు మళ్లిస్తే- దాతృత్వ కార్యక్రమాల తీరుతెన్నులే మారిపోతాయని వ్యాఖ్యానించారు. 2006లో బఫెట్‌ తన 'బెర్క్‌షైర్‌ హాథవే' కంపెనీలోని షేర్లన్నింటినీ దాతృత్వ కార్యక్రమాలకు కేటాయించారు. ''నా ఆస్తిలో 99 శాతానికిపైగా నా జీవితకాలంలోనో, నా తదనంతరమో దాతృత్వ కార్యక్రమాలకు వెళ్లిపోతుంది. ఈ డబ్బునంతా ప్రస్తుత సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసమే ఖర్చుపెట్టాలనుకుంటున్నాను. ఇంత దానం చేసినా మా జీవన సరళి ఏమాత్రం ప్రభావితం కాదు. నేనూ, నా పిల్లలూ హాయిగా జీవించేందుకు నా మొత్తం ఆస్తిలో 1% ఉంచుకుంటే చాలు. అంతకు మించి ఉంచుకోవటం వల్ల మా జీవితాల్లోగానీ, మా సుఖసంతోషాల్లోగానీ పెద్దగా మార్పేమీ రాదు' అని ఆయన లేఖలో వ్యాఖ్యానించారు. ఈ దాతృత్వ కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు బఫెట్‌, బిల్‌గేట్స్‌, మిలిండా గేట్స్‌ ముగ్గురూ కలిసి.. www.givingpledge.org పేరుతో ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ ప్రారంభించారు.ప్రపంచంలోని 793 మంది బిలియనీర్లలో కేవలం 14 మంది మాత్రమే ఈ మాత్రం దానాలు చేసినట్టు తేలింది. కొందరైతే ఆర్భాటంగా ప్రకటనలు చేసేసి.. ఆ తర్వాత నెరవేర్చలేదనీ తేలింది.
"https://te.wikipedia.org/wiki/దానం" నుండి వెలికితీశారు