"గండ్రేడు (పెదపూడి)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
'''గండ్రేడు''', [[తూర్పు గోదావరి]] జిల్లా, [[పెదపూడి]] మండలానికి చెందిన [[గ్రామము]] .
 
ఇది ఒక పురాతన గ్రామం. పూర్వపు రోజులలో ఈ గ్రామం లో వెలసివున్న 'నేరెళ్ళమ్మ జాతర' [[వైశాఖ బహుళ అమావాస్య]] రోజున బహు గొప్పగా జరిగేదట. అందుకనే నేటికీ ఈ పరిసర ప్రాంతాలలో వైశాఖ బహుళ అమావాస్యను 'గండ్రేడమాస' అంటారు. ఈ పరిసర ప్రాంతాల్లో రైతుల తమ దగ్గర కమతాలు కుదిరిన పాలేర్లకు జీతాలు ఇవ్వడానికి గండ్రేడమాస నుంచి గండ్రేడమాస వరకూ ఒక సంవత్సరంగా లెక్కకడతారు.
 
[[దసరా]] నవరాత్రులలో జరిగే 'గౌరీదేవి సంబరం' మరొక ఉత్సవం. పేరుకు ఇది గౌరీదేవి సంబరం, గౌరీదేవి గుడి కానీ గౌరీదేవి గుళ్ళో విగ్రహం మాత్రం శివకుటుంబానిది (శివుడు, పార్వతి, గణపతి, కుమార స్వామి). పూర్వం (బ్రిటిషు వారి పరిపాలనా కాలంలో) ఒక యోగి ఇక్కడ తపస్సు చేసుకొని సజీవ సమాధి చెందాడని, ఆ సమాధి పైన ఈ గౌరీ దేవి గుడి కట్టారని అంటారు. ఈ గౌరీదేవి గుడి ఒక కుటుంబానికి చెందినది.
 
{{పెదపూడి మండలంలోని గ్రామాలు}}
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/553126" నుండి వెలికితీశారు