మాధ్యమము: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: మాధ్యమము అంటే సమాచారమును అందింస్తూ రూపకర్తను ప్రజలను అను సంధ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
మాధ్యమము అంటే సమాచారమును అందింస్తూ రూపకర్తను ప్రజలను అను సంధానించేది. మానవాభివృద్ధికి మాధ్యమము చాలా ఉపకరిస్తుంది. సమాచారం ఒకరి నుండి ఒకరికి చేరినప్పుడే విజ్ఞానం విస్తరిస్తుంది. ఉదాహరణగా రచయిత తన కల్పనా శక్తితో రచించే కధలు, నవలలు, వ్యాసాలు లాంటివి ప్రజలకు చేరినప్పుడే రచయితకు తృప్తి రచనకు సార్ధకత ఏర్పడుతుంది. ప్రజా పాలనకు మాధ్యమం అత్యవసరం. ఉదాహరణగా రాజ్యాంగ ఉత్తరువులను ప్రజలకు చేర్చడంలో ప్రచురణా మాధ్యమం తోడ్పడుతుంది. పండితులను పామరులకు చక్కగా చేరువ కాగలిగింది అందరికి సులువుగా అర్ధం అయ్యేది శబ్ధరూపం. ఆకాశవాణి వాణి కార్యక్రమాలు శబ్ధరూప మాధ్యమం. ఆకాశవాణి వాత్రలను అందించడం లాంటి అనేక కార్యక్రమాలను అందించి ఒకప్పుడు ప్రజలను విపరీతంగా అలరించింది. ఇక ప్రచురణా వ్యవస్థ అత్యద్భుత సేవలు అందిస్తూ ప్రజలను విపరీతంగా అలరించింది ఇప్పుడూ అనేక సంచలనాలను సృష్టిస్తుంది ప్రజాదరణ చూరగొంటూ ముందడుగు వేస్తున్నదీ మాధ్యమం.
=== పురాతన కాల మాధ్యమం ===
ఆదిమానవుని కాలంలో కుడ్య శల్పాలు, కుడ్య చిత్రాలు ఒక రకంగా మొదటి మాధ్యమమని అనుకోవచ్చు. లిపి కూడా లేని కాలంలో మానవుడు తన భావాలను
వెబుచ్చడానికి చేసిన ప్రయత్నమే కుడ్యశిల్పాలు. అవి ఇప్పటికీ ఆనాటి నాగరికత, ఆనాటి జంతువులు, వారి సంస్కృతి మనకు అందిస్తూ గత చరిత్రను ఆధునికులకు అందించడంలో తమ తోడ్పాటు అందిస్తున్నాయి. అజంతా ఎల్లోరా గుహలు దీనికి ఉదాహరణలు. లిపి పుట్టిన తరువాత కాగితం లేని సమయంలో ముందుగా సమాచారాన్ని, భద్రపరచి ప్రజలకు అందించడానికి కొంత ఎక్కువ కాలం మన్నే తాటి ఆకులను రచయితలు మాధ్యమంగా ఎంచుకున్నారు. ఇప్పటికీ పురాతన రచనల తాళ పత్ర గ్రంధాలను భద్రపరచి అపురూప సంపదగా కాపాడబడుతున్నాయి. అలాగే లోహాలను రచనలు భద్రపరచడానికి ఎంచుకుని రచనలు సాగించారు. అవే తామ్రపత్ర గ్రంధాలు. ఇవి అత్యధిక కాలం మన్నికగా ఉంటాయి. రాజులు తమ శాసనాలను ప్రజలకు తెలియపరచడానికి శిలలను మాధ్యమంగా చేసుకుని వాటి మీద శాసనాలను చెక్కించి ప్రజలకు కనిపించేలా స్థాపించారు. దేవాలయాలు, కోటలు మొదలైన ప్రదేశాలలో వీటిని ఇప్పటికీ చూడ వచ్చు.
"https://te.wikipedia.org/wiki/మాధ్యమము" నుండి వెలికితీశారు