మాధ్యమము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
నాట్య భంగిమలకు ప్రసిద్ధి. ఆ కాలపు శిక్షించిన విధానాన్ని సుచీంద్రం కేవెలలో శిలారూపంలో చూడవచ్చు. శిల్పకళా వైరుద్యాలు వాటిని నిర్మించిన కాలాన్ని అప్పటి సంస్కృతిని ఈ కాలానికి అందిస్తున్నాయి. కుడ్యచిత్రాలు, చిత్రలేఖనాలు కూడా అప్పటి చరిత్రను వేషధారణను మరింత విశదీకరిస్తాయి.
=== కళారూప మాధ్యమం ===
గానము, నాట్యము, నాటకము, బుర్రకధ, వీధినాటకాలు, కధాకాలక్షేపము, హరికధ, ఉపన్యాసము, యక్షగానము, ప్రవచనము వంటి రూపాలలో రాజుల కధలను, సంఘటనలను, పురాణాలను ఆకర్షణీయమైన కళారూపంలో ప్రజలకు చేరువ చేసే వారు. ఇవి ప్రజల మనసు రంజింప చేస్తూ ఇతిహాసాలను, ఆ నాటి రాజుల చరిత్రలను, ముఖ్య సంఘటనలు ప్రజల వద్దకు చేరేవి. వాల్మికి రామాయణమును రచించి రాముని పుత్రులకు గాన రూపంలో శిక్షణ ఇచ్చి అయోధ్య అంతా వినిపించ చేసాడు. రచించినది ప్రజల వద్దకు చేర్చడంత అవసరమో ఆది కవి నిరూపించాడు. వ్యాసుడు భారత రచన చేసి వాటిని శిష్యులకు నేర్పి ఆ కావ్యాన్ని ప్రజల మద్యకు తీసుకు వెళ్ళాడు. ఈ కధను వినిపించే వారిని సూతులు అంటారు. అలాగే వేద విభజన చేసి వాటిని శిష్యులకు నేర్పించి వేద వ్యాప్తికి తోడ్పడ్డాడు. వ్యాసుడి కుమారుడైన శుక మహర్షి భాగవత కధను స్వయంగా పరిక్షిత్తు మహారాజుకు ప్రవచన రూపంలో వినిపించాడు.కాశిదాసు నాటకాలను రచించి కళా కారుల చేత నటింప చేసి రచనలను ప్రజలకు నాటక రూపంలో చేర వేసాడు. నాటకాలు కధలను ఇతిహాసాలను దృశ్యరూపంలో ప్రజలకు అందించాయి. కబీరుదాసు, త్యాగరాజు, అన్నమయ్య వంటి గాయకులు తమ భక్తిరసమయ రచనలను కృతులను స్వయంగా గాన రూపంలో తిరుగుతూ పాడుతూ అందించారు. దేవదాసీ సంప్రదాయంతో నాట్యరూపంతో పురాణేతిహాసాలు ప్రజలకు చేరువ చేయబడ్డాయి. ఆసక్తి కరమైన మరొక మాధ్యమం బుర్రకధ. ఇది ముగ్గురు కళాకారులచేత చెప్పబడుతుంది. ప్రధాన కధకుడు కధను వినిపిస్తుంటాడు. పక్కన ఉండే ఇద్దరు కధకులు హాస్యోక్తులు పలుకుతూ తందాన అని చెబుతూ కొంత రంజింప చేస్తారు. దీనిలో కళాకారులు తమ వాద్యాలను తామే వాయుస్తుంటారు. వీరు ముఖ్యమైన సంఘటనలను, చారిత్రక విషయాలను చెప్పడానికి ప్రాముఖ్యత ఇస్తారు. హరికధకులు ఒంటరిగా కధచెప్తారు. వీరు కధను వచన రూపంలోను అక్కడక్కడా పద్య రూపంలోను గాన రూపంలోను చెప్తూ కొంత అభినయం చూపిస్తూ చెప్తారు. వీరికి పక్క వాయుద్యం కావాలి. వీరంతా ఆ కాలంలో ఆలయాలను తమ వేదికగా చేసుకుని ప్రచారం చేసిన వారే.
"https://te.wikipedia.org/wiki/మాధ్యమము" నుండి వెలికితీశారు