మాధ్యమము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
=== శబ్ధరూప మాధ్యమం ===
రేడియో కనిపెట్టిన తరువాత శబ్ధరూప మాద్యమం మరింత ఊపందుకుంది. ఒకప్పుడు కొమ్ము బూరలను, శంఖనాదాన్ని, గంటా నాదాన్ని శబ్ధరూప మాధ్యమంగా వాడుకున్నారు. విదేశీ నావికులు తాము వ్యాపారార్ధం పట్టుకు వచ్చిన వస్తువులను విక్రయించడానికి శబ్ధరూపమైన సింగి నాదాన్ని వాయించి ప్రకటించే వారు. ప్రజలు ఆశబ్ధం విని వెళ్ళి సామాను కొనే వారు. అందుకే సింగినాదం విని జీలకర కొనేవారు కనుక సింగినాదం జిలకర అనే సామెత వచ్చింది. రాజులు లాలంలో యుద్ధం ఆరంభించడానికి ముందు శంఖనాదంతో తమ సంసిద్ధతను చాటే వారు. కొందరు సన్యాసులు, భిక్షుకులు కూడా ఒకప్పుడు శంఖనాదం చేసేవారు. చర్చిలో గంటానాదంతో కొన్ని విషయాలను చెప్పేవారు. రాజులు గంటా నాదంతో ప్రజలకు దర్శనం ఇచ్చేవారు. వేదాలు శబ్ధరూపంగానే వినపడ్డాయి. అవి ఎవరిచేత రచింపబడ లేదు కనుక అవి అపౌరుషేయాలు, శ్రుతులైనాయి. వేదాలను పఠించడం ద్వారానే గురువుల నుండి శిష్యులు నేర్చుకుంటారు. ఆకాశవాణి వచ్చిన తరువాత శబ్ధరూప మాద్యమంలో మరింత మార్పులు వచ్చాయి. ఊదయం భక్తి గీతాలతో ప్రారంభం చేసి సూక్తులు చెప్పి వ్యవసాయదారులకు సూచనలు అందించి దేశంలో జరిగిన విశేషాలను వార్తలలో అందించడం వరకు ఆకాశవాణి కార్యక్రమాలద్వారా ప్రజలకు అందించేది. పంచాయితీలలోను రేడియోలను పెట్టి చదువు కోని పామరులకు విశేషాలు తెలుసుకోవడం సులువైంది. సంగీతం, కధలు, నాటకాలు, స్త్రీల కార్యక్రమాలు, బాలల పాటలు ఆకాశ వాణి అందించేది. చలన చిత్రాలను శబ్ధరూపంలో విని ఆనందించే వారు. రేడియో ఉండడం అప్పట్లో అంతస్థుకు చిహ్నం. రేడియోల ముందు గుంపులుగా కూర్చుని ఆనందించిన సందర్భాలు కోకొల్లలు. ప్రజలకు అత్యవసరంగా అందించ వలసిన హెచ్చరికలు సైతం ఆకాశవాణి ద్వారానే ప్రలకు చేరేవి.
=== చలన చిత్ర రంగం ===
వినోదమే ప్రధానమైన మాధ్యమం చలన చిత్రరంగం. అప్పటి వరకూ ప్రజల మనసులను దోచుకున్న నాటకరంగాన్ని త్రోసి రాజని చలన చిత్ర రంగం ముందుకు సాగింది. ముందు మూకీ చిత్రాల విడుదల. మాటలు లేకపోయినా ప్రజలను చిత్రరంగం సమ్మోహన పరచింది. తరువాత చిత్రాలకు మాటలు పాటలు పద్యాలను చేర్చి ప్రదర్శించ గలిగారు. చిత్రరంగం ప్రజల జీవితంలో ఒక భాగం అయి పోయింది. ఒకప్పటిలా కాకున్నా ఇప్పటికీ చలన చిత్రాలకు ప్రజల జీవితంలో చలన చిత్రాల స్థానం ప్రత్యేకమే. చలన చిత్రాలు ప్రజలకు చరిత్రను సదృశ్యకంగా చూపించాయి. పల్నాటి యుద్ధము, మహామంత్రి తిమ్మరుసు, అనార్కలి, తెనాలి రామకృష్ణ, అల్లూరి సీతారామ రాజు వంటి అనేక చిత్రాలు ప్రజల మనసులో శాశ్వత స్థానం సంపాదించుకున్నాయి. పౌరాణిక చిత్రాలు ప్రజలను భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి. రామాయణ, మహా భారతం, శివపురాణం వంటి పురాణేతిహాసాలలోని ఘట్టాలు అనేకం వివిధ చిత్రాలుగా విడుదలై ప్రజాదరణ పొంది అమోఘ విజాయాన్ని సాధించాయి. భక్తుల చరిత్రలు, సాంఘిక చిత్రాలు, జానపద చిత్రాలు, స్వాతంత్ర్య సమరయోధుల గురించిన చిత్రాలు ప్రజలకు ఆనాటి రోజులను కళ్ళకు కట్టినట్లు చూపించి ప్రజలను అలరించాయి. చిత్రరంగం వినోదము అందించడామే కాక అనేక మందికి జీవనోపాధికి కారణమైంది.
=== విద్యుత్ పరికరాల మాధ్యమం ===
"https://te.wikipedia.org/wiki/మాధ్యమము" నుండి వెలికితీశారు