మాధ్యమము: కూర్పుల మధ్య తేడాలు

2,916 బైట్లు చేర్చారు ,  11 సంవత్సరాల క్రితం
కాగితం, కలం కనుగొనడం మాధ్యమంలో విపవాత్మకమైన మార్పులబ్ను తీసుకు వచ్చింది. రాజ్యాంగపరమైన విషయాలను, రాజ్యాంగ వ్యవహారాలను, ప్రపంచం నలుమూలలా జరిగే సంఘటనలు, నూతన పరిశోధనలు వంటి అనేక విషయాలను ప్రజల మద్యకు దినపత్రికల రూపంలో అందడం మొదలైంది. అలాగే వారపత్రికలు, పక్షపత్రికలు, మాసపత్రికలు వ్యాపారసరళిలో కధలు, కావ్యాలు, ధారావాహికలు, చిట్కాలు , స్త్రీలను ఆకర్షించే అల్లికలు, వంటలు, ముగ్గులూ, పిల్లను ఆకర్షించే బొమ్మల కధలు, అందరినీ ఆకర్షించే వ్యంగ్య చిత్రాలతో ప్రజలను రంజింపచేసాయి. కొందరు ఔత్సాహికులు చేతివ్రాత పత్రికలు కూడా నడిపారు. అచ్చుతో పని లేకుండా చేతితో వ్రాసి ఒకరికి ఒకరు అందిస్తూ చదువుతూ పోవడం. కరపత్రాలు అనే చిన్న కాగితాలలో ముద్రించి ప్రజలకు ఉచితంగా పంచి పెట్టి ప్రజలకు సమాచారాన్ని అందించడం అచ్చు యంత్రాల ఉపయోగంతో సాధ్యమైంది. కొన్ని మతపరమైన పుస్తకాలను ముద్రించి ప్రజలకు ఉచితంగా పంచి మతప్రచారం చేస్తూ ఉండడం జన విదితమే. హిందువులు దేవతా స్తోత్రాలను చిన్న చుఇన్న పుస్తకాలుగా ముద్రించి దైవప్రీతి కొరకు భక్తులకు పంచి ఇస్తారు. క్రైస్తవులు తమ ప్రవక్తలు కధలను సువార్తలు అన్న పేరుతో ముద్రించి అందరికీ ఉచితంగా ఇస్తుంటారు.అచ్చురూప మాధ్యమం రచయిత ప్రజల మధ్య దూరాన్నిచెరిపి ప్రజల జీవన సరళి మానసిక స్థితిలో సంచలనాత్మ
మార్పులు తీసుకు వచ్చింది.
=== నాటకరంగం ===
మహాకవి కాశిదాసు నాటకాలను రచించాడు కనుక నాటకరంగానికి పునాదులు అతి ప్రాచీనమనవే. రచయితలు దృశ్యాలను వర్ణించి, పాత్రల సంసంభాణలను చేర్చి, పాత్రల ప్రవేశం హావభావాలను వివరిస్తూ సాగించిన నాటక రచనలను దర్శలుకు నటులకు ముందుగా తర్ఫీదు ఇచ్చి తరువాత రంగస్థలం మీద ప్రజల ముందు ప్రదర్శనకు తీసుకు వస్తారు. ఇంతకు ముందు కధలుగా విన్న వాటిని పాత్రల హావభావాలతో సజీవంగా చూసే అవకాశం ప్రజలను ఆకర్షించింది. ముందుగా పురాణకధలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన కారణంగా ప్రజలకు పురాణ పాత్రలను దృశ్యరూపంగా చూసే అవకాశం కల్పించింది. అనేక మంది కళాకారులు నాటకాలకు తమ జీవితాలను అంకితం చేసారు. ఆతరువాత చిన్నగా చారిత్రక నాటకాలు, సాంఘిక నాటకాలు ప్రజకు అందించారు. చలన చిత్రాలు వచ్చాక అనేక నాటక కళాకారులు చిత్ర రంగ ప్రవేశం చేసి తమ ప్రతిభను చాటుకున్నారు. నాటకానికి ప్రాణం పాటలు పద్యాలు కనుక కళాకారులు సంగీతంలో కూడా ప్రావీణ్యం కలిగి ఉండే వారు. పాటలు, పద్యాలు ప్రజలకు త్వరగా చేరువ ఔతాయి కనుక నాటకాలలో పాటలు పద్యాల పాత్ర అధికమే. కొన్ని పద్యాలను ప్రేక్షకులు ఒన్స్ మోర్ అని అడిగి పాడించుకున్న సందర్భాలు కో కొల్లలు.
కొన్ని నాటకాలు నూరు ప్రదర్శనలు దాటి ప్రదర్శించబడ్డాయి. చలన చిత్రాలు వచ్చే వరకు నాటకరంగ ఆధిఖ్యత కొనసాగింది.
 
=== శబ్ధరూప మాధ్యమం ===
64,874

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/553873" నుండి వెలికితీశారు